India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అయోధ్యలో బాల రాముడి విగ్రహాన్ని రూపొందించిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడి విగ్రహం తయారీ ఫొటోలను పంచుకున్నారు. క్లాసికల్ హోయసల స్టైల్‌లో 11 అంగుళాల కిట్టయ్య విగ్రహాన్ని చెక్కుతున్నట్లు ఆయన తెలిపారు. అయితే, 11 అంగుళాల్లోనే గోవిందుడితో పాటు పక్కనే ఆవులు, మరికొన్ని విగ్రహాలు స్పష్టంగా కనిపించేలా చెక్కడంపై నెట్టింట అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో ప్రస్తుతం 2 జిల్లాలు(లేహ్, కార్గిల్) ఉండగా, కొత్తగా 5 జిల్లాలు ఏర్పాటుచేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా Xలో వెల్లడించారు. వాటిని జన్‌స్కర్, డ్రాస్, శామ్, నుబ్రా, చంగ్‌థంగ్ జిల్లాలుగా పేర్కొన్నారు. ప్రభుత్వ ఫలాలను ప్రతి ఇంటికీ చేరవేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. త్వరలో జమ్మూకశ్మీర్ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ టెస్టులో పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ‘నేను వెళ్లేసరికే వైద్యురాలు చనిపోయింది. సెమినార్ హాల్‌లో డెడ్ బాడీ కనిపించింది. భయపడి పారిపోయా’ అంటూ అతడు చెప్పినట్లు సమాచారం. ఘటన జరిగినప్పుడు తాను మరో చోట ఉన్నట్లు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అటు నిందితుడు ఏం చెప్పారన్న విషయాలను అధికారులు గోప్యంగా ఉంచారు.
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పంజాబ్‌ను బలూచిస్థాన్‌తో కలిపే హైవేపై వారు బస్సులు, ట్రక్కులు, వ్యాన్‌లను నిలుపుతూ అందులోని వారిని తనిఖీ చేస్తూ కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో 22 మంది మృతి చెందగా ఐదుగురికి గాయాలైనట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. చనిపోయిన వారిలో 19 మంది పంజాబీలు, ముగ్గురు బలూచీలు ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మొత్తం 10 వాహనాలకు ఉగ్రమూకలు నిప్పు పెట్టాయి.
HYD మాదాపూర్‌లోని N-కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేయడంతో హీరో నాగార్జున భారీగానే నష్టపోయారనే చర్చ నడుస్తోంది. మొత్తం కన్వెన్షన్ విలువ ₹500 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులోని 4 హాళ్ల ద్వారా ఫంక్షన్ జరిగిన రోజు ₹50 లక్షల నుంచి కోటి వరకూ, ఏటా ₹100 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందట. హైడ్రా కూల్చేసిన హాళ్లతో పాటు ఈ సీజన్లో వాటిల్లో జరగాల్సిన <<13935679>>కార్యక్రమాలు<<>> జరగకపోవడంతో ఈ ఆదాయమంతా ఆయన కోల్పోయినట్లే.
బంగ్లా చేతిలో పాకిస్థాన్ <<13938635>>ఓటమికి<<>> భారతే కారణమని PCB మాజీ ఛైర్మన్ రమీజ్ రజా ఆరోపించారు. ASIA CUPలో పాక్ బౌలర్లపై IND పైచేయి సాధించడంతోనే జట్టు పతనం ప్రారంభమైందన్నారు. అప్పటి నుంచి తమ బౌలర్ల రహస్యాలు బహిర్గతమై మిగతా జట్లూ బౌలర్లను సులువుగా ఎదుర్కొంటున్నాయన్నారు. రజా కామెంట్స్‌పై భారత ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ‘మిమ్మల్ని వేరే దేశాలు ఓడించినా మేమే కారణమా? సిగ్గుచేటు వ్యాఖ్యలు’ అని ఫైర్ అవుతున్నారు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ శంఖం పూరించింది. తొలి విడతలో 44 మంది పేర్లను ప్రకటించింది. ముస్లిం అభ్యర్థులకు ఎక్కువ సీట్లిచ్చి ఆశ్చర్యపరిచింది. అర్షిద్ భట్, జావెద్ అహ్మద్, మహ్మద్ రఫీక్, సయ్యద్ వజాహత్, అబ్దుల్ ఘని, సుష్రీ షాగున్, గజయ్ సింగ్ రాణా, కుల్‌దీప్ రాజ్, రోహిత్ దూబె, పవన్ గుప్తా, దేవిందర్, మోహన్ లాల్ భగత్ పేర్లు జాబితాలో ఉన్నాయి. ఈ ఎన్నికలపై మోదీ, షా ప్రత్యేకంగా దృష్టి సారించారు.
అస్సాంలో మైనర్ బాలిక అత్యాచార ఘటనలో కలచివేసే విషయం వెలుగులోకి వచ్చింది. తనపై అఘాయిత్యానికి 2 రోజుల ముందే కోల్‌కతా హత్యాచార ఘటనను పేపర్లో చదివిన ఆమె అత్యాచారం అంటే ఏంటని తన బంధువును అడిగిందట. తర్వాత ఆ బాలిక లైంగిక దాడికి గురైంది. ట్యూషన్‌కు వెళ్లి వస్తున్న ఆమెను ముగ్గురు వ్యక్తులు చెరువు వద్దకు లాక్కెళ్లి రేప్ చేశారు. విచారణ సందర్భంగా ప్రధాన నిందితుడు చెరువులో దూకి <<13929006>>ఆత్మహత్య<<>> చేసుకున్నాడు.
TG: రూ.2లక్షలకు పైన రుణమాఫీపై ముందడుగు పడింది. అదనపు మొత్తాల వసూలు కోసం వ్యవసాయ శాఖ బ్యాంకులకు లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో ఇప్పటివరకు బ్యాంకులు రైతుల నుంచి అదనపు మొత్తాలు తీసుకోలేదు. తాజాగా ప్రభుత్వం వసూలు చేసుకోవాలని స్పష్టత నివ్వడంతో అదనపు మొత్తం చెల్లించేందుకు రైతులకు అవకాశం లభించింది. అయితే వారికి ఎప్పుడు రుణమాఫీ చేసేది ప్రభుత్వం వెల్లడించలేదు.
వడ్డీరేట్ల కోతకు సమయం వచ్చేసిందన్న యూఎస్ ఫెడ్ వ్యాఖ్యలు, గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో మొదలయ్యాయి. BSE సెన్సెక్స్ 81,647 (+561), NSE నిఫ్టీ 24,980 (+157) దూకుడు ప్రదర్శిస్తున్నాయి. నిఫ్టీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 36:14గా ఉంది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో విప్రో, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, TCS, టెక్ మహీంద్రా వంటి సాఫ్ట్‌వేర్ కంపెనీల షేర్లు పెరిగాయి.
Sorry, no posts matched your criteria.