News November 23, 2024

కేంద్ర మంత్రి వ‌ర్గంలోకి శిండే?

image

మ‌హారాష్ట్రలో మ‌హాయుతి భారీ విజ‌యం సాధించ‌డంతో CM పీఠంపై ఉత్కంఠ నెల‌కొంది. కూట‌మిలో అత్య‌ధికంగా 132 సీట్ల‌లో ముందంజ‌లో ఉన్న BJP CM ప‌ద‌విని వ‌దులుకోకపోవచ్చు. దీంతో ఏక్‌నాథ్ శిండే, అజిత్ ప‌రిస్థితి ఏంటనే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలో శిండేకు కేంద్ర మంత్రి ప‌ద‌వి ఇవ్వాలని BJP యోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అజిత్‌ను మాత్రం Dy.CMగా కొన‌సాగించవచ్చని సమాచారం.

News November 23, 2024

ప్రియాంక గురించి ఇందిరా గాంధీ మాటల్లో

image

ప్రియాంకా గాంధీ గురించి ఇందిరా గాంధీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 1984లో తన హ‌త్య‌కు 2 రోజుల ముందు సెక్రటరీతో ఇందిరా గాంధీ మాట్లాడుతూ ‘నేను ఎక్కువ రోజులు బ‌తక్కపోవ‌చ్చు. కానీ మీరు ప్రియాంక ఎదుగుద‌ల‌ను చూస్తారు. ప్ర‌జ‌లు ఆమెలో న‌న్ను చూసుకుంటారు. ఆమెను చూసిన‌ప్పుడు న‌న్ను గుర్తు చేసుకుంటారు. ప్రియాంక ఎంతో సాధిస్తుంది. త‌రువాతి శ‌తాబ్దం ఆమెదే. ప్ర‌జ‌లు న‌న్ను మ‌రిచిపోతారు’ అని వ్యాఖ్యానించారు.

News November 23, 2024

కొత్త వంగడాలు, ఆవిష్కరణలతో స్టాళ్లు: సీఎం రేవంత్

image

TG: ప్రజా ప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్న రైతు సదస్సుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై రైతులకు అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వర్సిటీలు అభివృద్ధి చేసిన కొత్త వంగడాలు, ఆయిల్ పామ్ కంపెనీల ఆవిష్కరణలు, నూతన ఉత్పాదకాలతో 3 రోజులు స్టాళ్లు ఏర్పాటుచేయాలని సూచించారు.

News November 23, 2024

ఝార్ఖండ్‌లో హిమంతకు ఎదురుదెబ్బ

image

ఝార్ఖండ్‌లో అస్సాం CM హిమంత బిశ్వ శ‌ర్మ వేసిన‌ పాచిక‌లు పార‌లేదు. బంగ్లా చొర‌బాటుదారులు స్థానిక మెజారిటీ గిరిజ‌నుల హ‌క్కులు లాక్కుంటున్నార‌ని బిల్డ్‌ చేసిన నెరేటివ్ ప్ర‌భావం చూప‌లేదు. ట్రైబల్ స్టేట్‌లో క‌మ్యూన‌ల్ పోల‌రైజేష‌న్ ఫ‌లితాన్నివ్వ‌లేదు. రోటీ-బేటి-మ‌ట్టీ నినాదం ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించ‌లేదు. మ‌హిళ‌ల‌కు ఆర్థిక సాయం ప‌థ‌కాలు, హేమంత్ సోరెన్ అరెస్టు వ‌ల్ల ఏర్ప‌డిన సానుభూతి JMMకు లాభం చేశాయి.

News November 23, 2024

హిందీ మహా విద్యాలయం అనుమతులు రద్దు

image

హైదరాబాద్‌లోని హిందీ మహా విద్యాలయం అనుమతులను ఉస్మానియా యూనివర్సిటీ (OU) రద్దు చేసింది. విద్యార్థుల మార్కుల జాబితాలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలు నిజం అని దర్యాప్తులో తేలడంతో తాజా నిర్ణయం తీసుకుంది. మరోవైపు, హిందీ మహా విద్యాలయం అటానమస్ హోదాను రద్దు చేయాలని UGCకి సిఫార్సు చేసింది. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు నష్టం కలగకుండా కోర్సు పూర్తి చేసేందుకు OU అవకాశం కల్పించింది.

News November 23, 2024

రాహుల్ రికార్డును బ్రేక్ చేసిన ప్రియాంక.. మెజారిటీ 4,10,931

image

వయనాడ్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి ప్రియాంకా గాంధీ భారీ విజ‌యాన్ని న‌మోదు చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో రాహుల్ గాంధీ సాధించిన 3.60 ల‌క్ష‌ల మెజారిటీ రికార్డును బ్రేక్ చేసి 4,10,931 ఓట్ల ఆధిక్యంతో విజ‌యం సాధించారు. ఎల్‌డీఎఫ్ అభ్య‌ర్థి స‌త్య‌న్ మోకెరీ రెండో స్థానానికి, బీజేపీ అభ్య‌ర్థి న‌వ్యా హ‌రిదాస్ మూడో స్థానానికి ప‌రిమిత‌మ‌య్యారు. విజయం సాధించిన అనంతరం కలిసిన ప్రియాంకకు ఖర్గే శుభాకాంక్షలు తెలిపారు.

News November 23, 2024

జగన్ వద్ద మంత్రిగా చేసినందుకు బాధపడుతున్నా: బాలినేని

image

AP: వైఎస్ జగన్ హయాంలో జరిగిన సోలార్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో తన ప్రమేయం లేదని జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సంబంధిత పత్రాలపై అప్పటి మంత్రిగా తాను సంతకం చేయలేదని తెలిపారు. క్యాబినెట్లో చర్చించకుండానే యూనిట్ రూ.2.49తో ఒప్పందం చేసుకున్నారన్నారు. ఈ కేసులో జగన్ పాత్ర ఉంటే క్షమించరానిదని పేర్కొన్నారు. ఇవన్నీ చూస్తే ఆయన వద్ద మంత్రిగా పనిచేసినందుకు బాధపడుతున్నానని చెప్పారు.

News November 23, 2024

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న తమన్నా, విజయ్?

image

ప్రేమ జంట తమన్నా భాటియా, విజయ్ వర్మ పెళ్లికి సిద్ధమైనట్లు బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ముంబైలో కలిసి ఉండటానికి వీరు ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్ కోసం వెతుకుతున్నట్లు సమాచారం. ఇప్పటికే వివాహ పనులు మొదలుపెట్టారని, అతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ కబురు ఉంటుందని టాక్. లస్ట్ స్టోరీస్-2 తర్వాత రిలేషన్‌లో ఉన్నట్లు తమన్నా-విజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

News November 23, 2024

తల్లిని కోల్పోయిన పిల్లలను దత్తత తీసుకునే ఉడతలు!

image

మాతృత్వం ఏ జీవిలోనైనా ఒకేలా ఉంటుందని వర్సిటీ ఆఫ్ గ్వెల్ఫ్ పరిశోధనలో తెలిసింది. అల్బెర్టా విశ్వవిద్యాలయం& మెక్‌గిల్ విశ్వవిద్యాలయ పరిశోధకులతో కలిసి 20 ఏళ్లు పరిశోధన చేసింది. ఆహారం కోసం గొడవకు దిగే ఉడతలు తల్లిని కోల్పోయిన ఉడత పిల్లలను దత్తత తీసుకొని వాటికి తోడుగా ఉంటాయని గుర్తించింది. ముఖ్యంగా ఎర్ర ఉడతలు ఇందుకు ముందుంటాయని వెల్లడైంది. ఇలా ఇతర పిల్లలను తమవాటిలా చూసుకోవడం కూడా అరుదేనని తెలిపింది.

News November 23, 2024

ప్రియాంక ఫొటోకు పాలాభిషేకం

image

TG: వయనాడ్ (కేరళ) ఉపఎన్నికలో ప్రియాంకా గాంధీ భారీ మెజారిటీతో గెలవడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఇతర నాయకులు గాంధీభవన్‌లో ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రియాంక యావత్ భారత దేశంలో తిరిగితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని వీహెచ్ తెలిపారు. మహారాష్ట్రలో బీజేపీ డబ్బుల ప్రభావంతో గెలిచిందని, అది అంబానీ-అదానీల గెలుపని ఆరోపించారు.