News November 23, 2024

CM పోస్ట్: మెట్టు దిగని షిండే, బెట్టు వీడని బీజేపీ

image

మహారాష్ట్ర ఫలితాలపై దాదాపు క్లారిటీ రాగా CM పదవిపై మాత్రం సస్పెన్స్ నెలకొంది. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకే తిరిగి పదవి ఇవ్వాలని శివసేన (శిండే) డిమాండ్ చేస్తోంది. 55 స్థానాలు (2019తో పోలిస్తే 14 సీట్లు+) గెలిచిన తమ పార్టీ ప్రభుత్వంలో కింగ్ మేకర్ అని శివసైనికులు అంటున్నారు. అయితే ప్రస్తుత డిప్యూటీ సీఎం ఫడణవీస్ తదుపరి రాష్ట్ర నేతగా ఉంటారని 126 సీట్ల లీడ్‌లోని BJP (2019లో 105) చెబుతోంది.

News November 23, 2024

రేవంత్ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో కాంగ్రెస్ ఓడింది: బండి సంజయ్

image

TG: మహారాష్ట్రలో సీఎం రేవంత్ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని BJP MP, కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ఓటమికి తెలంగాణ, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఖరే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలనే ఆలోచన లేకపోవడం వల్లే ఆ పార్టీకి ఓటమి ఎదురైందని ఆయన చెప్పుకొచ్చారు.

News November 23, 2024

మహారాష్ట్రలో MVAను ముంచేసిన కాంగ్రెస్

image

మహారాష్ట్ర ఎన్నికల్లో MVA ఘోర పరాజయంలో కాంగ్రెస్‌దే ఎక్కువ బాధ్యత. ఎందుకంటే 288 స్థానాలున్న ఇక్కడ హస్తం పార్టీ 101 చోట్ల పోటీచేస్తే కేవలం 22 నియోజకవర్గాల్లోనే ఆధిక్యం ప్రదర్శిస్తోంది. కూటమి గెలవాలంటే ఎక్కువ సీట్లలో పోటీచేసిన పార్టీయే మరిన్ని విజయాలు అందుకోవాలి. అలాంటిది కాంగ్రెస్ స్ట్రైక్‌రేట్ ఇక్కడ 22కే పరిమితమైంది. ఇక శివసేన యూబీటీ 20/95, NCP SP 12/86తో చతికిలపడ్డాయి.

News November 23, 2024

తిలక్ వర్మ హ్యాట్రిక్ సెంచరీ

image

టీమ్ ఇండియా ప్లేయర్ తిలక్ వర్మ హ్యాట్రిక్ సెంచరీ బాదారు. SMATలో భాగంగా ఇవాళ మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో తిలక్ (151) సెంచరీ చేశారు. 67 బంతుల్లోనే ఆయన 14 ఫోర్లు, 10 సిక్సర్లతో 151 పరుగులు చేసి విధ్వంసం సృష్టించారు. కాగా దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో కూడా తిలక్ వరుస సెంచరీలతో చెలరేగిన సంగతి తెలిసిందే. 3rd, 4th మ్యాచుల్లో ఆయన శతకాలు బాదారు.

News November 23, 2024

మరాఠ్వాడాలో మహాయుతి ప్రభంజనం.. ‘మరాఠా’ మనోజ్‌కు షాక్

image

మహారాష్ట్రలో మహాయుతి విజయంలో మరాఠ్వాడా కీలకంగా నిలిచింది. 46 సీట్లున్న బీజేపీ, శివసేన, NCP 32+ నియోజకవర్గాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి. మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం నడిపిన మనోజ్ జరంగేకు ఇది భారీ షాకే. ఆయన మొదట MVAకు మద్దతిచ్చారు. తర్వాత సొంతంగా కొందరిని పోటీకి నిలుపుతామన్నారు. కాంగ్రెస్ కూటమి ఓట్లు చీలొద్దని తర్వాత మానుకున్నారు. ఈ విజయంతో మహాయుతిని ఆయనిక బ్లాక్‌మెయిల్ చేయలేరని విశ్లేషకుల అంచనా.

News November 23, 2024

BJP హెడ్ ఆఫీస్‌కు మోదీ

image

మహారాష్ట్ర ఎన్నికల్లో మరోసారి మహాయుతి భారీ మెజార్టీ సాధిస్తున్న వేళ ప్రధాని మోదీ ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నారు. మహారాష్ట్రలో ఫలితాలు, సీఎం ఎంపికపైనా ఆయన చర్చించే అవకాశం ఉంది.

News November 23, 2024

భారీగా పెరిగిన బంగారం ధర

image

బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న రేట్లు ఇవాళ మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) రూ.820 పెరిగి రూ.79,640కి చేరింది. 22 క్యారెట్ల బంగారం (10గ్రాములు) రూ.750 పెరిగి రూ.73,000కి చేరింది. వెండి ధర కిలో రూ.1,01,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 23, 2024

ప్రియాంకా గాంధీ అత్యధిక మెజారిటీతో గెలుస్తారు: రేవంత్ రెడ్డి

image

TG: కేరళ వయనాడ్‌లో జరిగిన ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఆది నుంచీ ఆధిక్యంలో కొనసాగుతుండటంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వయనాడ్ ప్రజలు ఆమెను కచ్చితంగా రికార్డు మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తారని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ప్రియాంక ఇప్పటికే 2లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం దిశగా దూసుకెళ్తున్నారు.

News November 23, 2024

ప్రియాంక మెజార్టీ 2,00,000+

image

వయనాడ్‌లో ప్రియాంక గాంధీ బంపర్ విక్టరీ ఖాయమని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఆమె మెజార్టీ 2 లక్షలు దాటింది. దీంతో కాంగ్రెస్ ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా కాంగ్రెస్ కంచుకోటలో పోటీ చేస్తున్న నవ్య హరిదాస్ మూడో స్థానానికి పరిమితమయ్యారు.

News November 23, 2024

మా సర్వే నిజమవుతుంది: యాక్సిస్ మై ఇండియా MD

image

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితంపై సర్వే సంస్థలు అంచనా వేసిన నంబర్లు తారుమారవుతున్నాయి. ఇక్కడ మహాయుతి 150, MVA 100+ సీట్లొస్తాయని చెప్పుకొచ్చాయి. కానీ, ఫలితాలు చూస్తుంటే మహా కూటమి 200+సీట్లు గెలిచేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో యాక్సిస్ మై ఇండియా MD ప్రదీప్ గుప్తా తమ సర్వే రిజల్ట్స్‌ను రీట్వీట్ చేశారు. తమ అంచనా నిజమవుతుందని మరోసారి గుర్తుచేశారు. ప్రస్తుతం MHలో 225స్థానాల్లో ‘మహా’ ముందంజలో ఉంది.