News November 23, 2024

కపిల్ దేవ్ సరసన జస్ప్రీత్ బుమ్రా

image

టీమ్ ఇండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించారు. టెస్టుల్లో సేనా దేశాల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన బౌలర్‌గా బుమ్రా నిలిచారు. ఇప్పటివరకు ఆయన 7 సార్లు ఈ ఫీట్ సాధించారు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ (7) రికార్డును సమం చేశారు. కాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శన చేశారు.

News November 23, 2024

ఇద్దరి తనయుల తడాఖా

image

మహారాష్ట్ర ఎన్నికల్లో ఠాక్రే కుటుంబీకుల యువతరం ఆధిక్యత కనబరుస్తోంది. శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే వర్లిలో లీడింగ్‌లో ఉన్నారు. ఇక వీరి బంధువైన మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ మహిమ్ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు.

News November 23, 2024

బ్యాలెట్ ఓట్లలో మహాయుతిదే పైచేయి

image

మహారాష్ట్రలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇందులో అధికార మహాయుతి పూర్తి ఆధిపత్యం కనబర్చింది. ఆ కూటమి 76కు పైగా స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. ఇక ఈవీఎంలు ఇప్పుడే తెరిచారు. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి కనీసం 20-25 నిమిషాల సమయం పట్టనుంది. బారామతిలో ఇప్పటివరకు వెనుకంజలో ఉన్న డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మళ్లీ లీడింగ్‌లోకి వచ్చారు. నాగ్‌పూర్ సౌత్‌ వెస్ట్‌లో ఫడణవీస్ ఆధిక్యంలో ఉన్నారు.

News November 23, 2024

వయనాడ్‌లో ప్రియాంక ఆధిక్యం

image

కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానం ఉపఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ లీడింగ్‌లో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఆమె 400 పైచిలుకు ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ బీజేపీ తరఫున నవ్యా హరిదాస్ పోటీలో ఉన్నారు.

News November 23, 2024

దూసుకెళ్తున్న మహాయుతి

image

మహారాష్ట్ర ఫలితాల్లో మహాయుతి దూసుకెళ్తోంది. ఎర్లీ ట్రెండ్స్‌లో ఆ కూటమి హాఫ్ సెంచరీ మార్క్ దాటింది. ఇప్పటివరకు మహాయుతి 51 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు మహావికాస్ అఘాడీ మాత్రం 7 స్థానాలకే పరిమితమైంది.

News November 23, 2024

బాబాయ్‌పై అబ్బాయి ఆధిక్యం..

image

మహారాష్ట్ర సీఎం అభ్యర్థుల్లో ఒకరిగా ఉన్న అజిత్ పవార్ ఆశ్చర్యకరంగా ఫలితాల్లో వెనకబడ్డారు. బారామతిలో ఆయన సోదరుడి కుమారుడు యుగేంద్ర పవార్ ఆధిక్యత కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. యుగేంద్ర తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. శరద్ పవార్ ఫ్యామిలీకి ఈ నియోజకవర్గం కంచుకోట. అటు కొప్రిలో సీఎం ఏక్‌నాథ్ శిండే ఆధిక్యంలో ఉన్నారు.

News November 23, 2024

ఝార్ఖండ్ రిజల్ట్స్.. సీఎం ముందంజ

image

ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బర్హత్‌ నుంచి బరిలో ఉన్న JMM చీఫ్, సీఎం హేమంత్ సోరెన్ ముందంజలో ఉన్నారు. ఓవరాల్‌గా చూస్తే ఎన్డీఏ లీడింగ్‌లో కొనసాగుతోంది. 9 స్థానాల్లో ఎన్డీఏ ముందంజలో ఉండగా ఇండియా కూటమి 3 చోట్ల ఆధిక్యం కొనసాగిస్తోంది.

News November 23, 2024

చేతికీ చెయ్యిస్తారా? ఉద్ధవ్ ఠాక్రేపై కాంగ్రెస్ డౌట్!

image

శివసేన UBTని కాంగ్రెస్ నమ్మడం లేదని తెలుస్తోంది. ఒకవేళ MVA గెలిచినా CM పదవి ఇవ్వకపోతే ఉద్ధవ్ ఠాక్రే హ్యాండ్ ఇస్తారేమోనని అనుమానిస్తోందని సమాచారం. ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటి నుంచి ఠాక్రే, సంజయ్ రౌత్ మాట్లాడుతున్న విధానం వారిని కలవరపెడుతోందని విశ్లేషకులు అంటున్నారు. 2019లో CM పదవి కోసమే ఆయన BJPని కాదని కాంగ్రెస్, NCP పంచన చేరడాన్ని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడూ అలా చేయరన్న గ్యారంటీ ఏంటంటున్నారు.

News November 23, 2024

ఆధిక్యంలో ఎన్డీయే

image

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో ఓట్ల కౌంటింగ్‌ మొదలైంది. ఎర్లీ ట్రెండ్స్‌లో రెండు చోట్ల ఎన్డీయే ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో మహాయుతి 8 చోట్ల, మహా వికాస్ అఘాడీ 6 చోట్ల లీడింగ్‌లో ఉన్నాయి. ఝార్ఖండ్‌లో ఎన్డీఏ 6, ఇండియా కూటమి 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.

News November 23, 2024

చంద్రబాబు, పవన్ న్యాయం చేయాలి: వాలంటీర్లు

image

AP: తమ ఉద్యోగం తిరిగి తమకు ఇవ్వాలని CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్‌ను వాలంటీర్లు వేడుకున్నారు. తక్షణమే తమను విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు. ‘గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం విధుల్లోకి తీసుకుని రూ.10 వేల వేతనం ఇవ్వాలి. మాకు రాజకీయ రంగు పూయకండి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఆదేశాల ప్రకారమే పని చేస్తాం. ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి’ అని వారు విజ్ఞప్తి చేశారు.