India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హిమాచల్‌ప్రదేశ్‌లోని ‘మండి’ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నటి కంగనా రనౌత్ సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే కష్టమంటూ ట్వీట్ చేశారు. ‘వరుస రోడ్‌షోలు. సమావేశాలు. వందల కిలోమీటర్ల ప్రయాణం. నిద్రలేని రాత్రులు. సమయానికి తీసుకోని భోజనం. ఇవన్నీ చూశాక నాకు ఒకటి అర్థమైంది. వీటి ముందు సినిమా తీయడానికి పడే కష్టాలు ఒక జోక్ లాంటివి’ అంటూ పోస్ట్ పెట్టారు.
ఉద్యోగులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌ను SMS లేదా మిస్డ్ కాల్ ద్వారానూ తెలుసుకోవచ్చు. ‘EPFOHO UAN ENG’ అని టైప్ చేసి రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కి SMS పంపాలి. మిస్డ్ కాల్ ద్వారా అయితే రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి 9966044425కి ఫోన్ చేయాలి. ఈ కాల్ రింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. కాసేపటి తర్వాత మీ పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు మెసేజ్ ద్వారా వస్తాయి.
చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నేడు ఆసక్తికర పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారీ మార్జిన్‌తో RCB గెలిస్తే ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంది. గత సీజన్లో మే 18న జరిగిన మ్యాచుల్లో ప్రతిసారి RCB గెలుస్తూ వస్తోంది. 2013లో CSK, 2014లో CSK, 2016లో KXIP, 2023లో SRHపై RCB గెలిచింది. నేటి మ్యాచ్‌లోనూ ఇదే కొనసాగుతుందని, CSKపై గెలిచి తీరుతుందని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
తన మనవడు, MP ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల వ్యవహారంపై JDS చీఫ్, మాజీ PM దేవెగౌడ తొలిసారి స్పందించారు. ‘ప్రజ్వల్ వేరే దేశంలో ఉన్నాడు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కుమారస్వామి వెల్లడించారు. ఈ కేసులో చాలా మంది ప్రమేయం ఉంది. అందరిపైనా కచ్చితంగా చర్యలు ఉండాలి’ అని స్పష్టం చేశారు. కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ఆయన కుమారుడు రేవణ్ణకు ఇటీవల బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే.
నాన్‌స్టిక్ పాత్రల్లో వంటల గురించి ఇటీవల ICMR మార్గదర్శకాలు విడుదల చేసింది. టెఫ్లాన్ కోటింగ్ ఉండే నాన్‌స్టిక్ పాత్రల్లో 170డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి దగ్గర వంట చేస్తే ప్రమాదమని తేల్చింది. టెఫ్లాన్ కోటింగ్ నుంచి విషపూరిత వాయువులు విడుదల అవుతాయని, అవి ఆహారంలో కలిసిపోయి శరీరంలోకి చేరతాయంది. ఒకవేళ కోటింగ్ పాడైపోతే ఆ పాత్రలను ఉపయోగించకూడదని సూచించింది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.800 పెరిగి రూ.68,400కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.870 పెరగడంతో రూ.74,620 పలుకుతోంది. కేజీ వెండి ధర ఏకంగా రూ.4,000 పెరిగి రూ.96,500కు చేరింది. త్వరలోనే కేజీ సిల్వర్ రేటు రూ.లక్ష పలికే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాజీ పీఎస్ బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం నివాసంలో అతడు తనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడని, సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడని ఎంపీ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడంతో తాజాగా బిభవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ప్రధాని మోదీ జీవితంపై తెరకెక్కనున్న బయోపిక్‌లో సీనియర్ నటుడు సత్యరాజ్ నటించనున్నట్లు తెలుస్తోంది. మోదీ పాత్రలో ఆయన నటిస్తారని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తారని సినీ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకు ‘విశ్వనేత’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారని, అన్ని భారతీయ భాషల్లో తెరకెక్కనున్నట్లు వార్తలొస్తున్నాయి.
జట్టును గెలిపించడానికే తాను ఫీల్డ్‌లో కృషి చేస్తానని, దీని గురించి చెప్పుకోవాల్సిన అవసరం తనకు లేదని కోహ్లీ స్పష్టం చేశారు. ఆటపై తన ప్రేమ, ఆకలి ఎప్పటికీ తగ్గబోదన్నారు. వచ్చే T20WCకు ఇదే తన ప్రేరణ అని చెప్పారు. జియో సినిమా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెరీర్‌లో ఒకే ఏడాది(2016) రెండుసార్లు హార్ట్ బ్రేకయ్యిందని పేర్కొన్నారు. T20WC సెమీ ఫైనల్‌లో ఓడటం, ఐపీఎల్ ఫైనల్‌లో పరాజయం బాధించిందని తెలిపారు.
ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి వ్యవహారంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఆమెపై <<13262229>>దాడి<<>> నిజమేనని AIIMS వైద్యులు నిర్ధారించారు. స్వాతి ఎడమ కాలు, కుడి కన్ను కింద సహా శరీరంలోని నాలుగు భాగాలకు గాయాలయ్యాయని నివేదిక ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు స్వాతి అనధికారికంగా సీఎం నివాసంలోకి ప్రవేశించి తనపై దాడి చేశారని బిభవ్ కూడా ఫిర్యాదు చేశారు.
Sorry, no posts matched your criteria.