News August 24, 2024

టూత్ బ్రష్‌లను బాత్‌రూమ్‌లో పెడుతున్నారా?

image

టూత్ బ్రష్‌లను బాత్‌రూమ్‌లో ఉంచడం ఆరోగ్యానికి ప్రమాదం కావొచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్నానాలగదిలో తేమ, వేడి కలగలిపిన వాతావరణం బ్యాక్టీరియా పెరగడానికి అనువైనదని పేర్కొంటున్నారు. ‘కమోడ్ ఫ్లష్ చేసినప్పుడు అందులో బ్యాక్టీరియా గాల్లో చేరి బ్రష్ మీదకు వచ్చే ప్రమాదమూ ఉంది. అందువల్ల బ్రష్‌ను బాత్‌రూమ్‌ బయట పొడి వాతావరణంలో దుమ్ము లేని చోట పెడితే మంచిది’ అని పేర్కొంటున్నారు.

News August 24, 2024

భారత్‌కు విచ్చేయండి జెలెన్‌స్కీ: మోదీ పిలుపు

image

ఉక్రెయిన్‌లో ప‌ర్య‌టించిన భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆ దేశాధ్య‌క్షుడు జెలెన్‌స్కీని భార‌త్‌కు ఆహ్వానించారు. ‘1992 తర్వాత మన ప్రధాని తొలిసారిగా ఉక్రెయిన్‌లో పర్యటించడం విశేషం. ఇలాంటి సందర్భాలలో ఆహ్వానించ‌డం సహజమే. ప్ర‌ధాని కూడా అదే చేశారు. వీలును బ‌ట్టి ఆయ‌న భార‌త్ వ‌స్తార‌ని ఆశిస్తున్నాం’ అని విదేశాంగ మంత్రి జైశంక‌ర్ తెలిపారు. రెండుదేశాల సంయుక్త ప్రకటన కూడా దీన్ని ధ్రువీక‌రించింది.

News August 24, 2024

విశాఖలో రూ.172 కోట్లతో యూనిటీ మాల్

image

AP:చేనేత, హస్తకళలను ప్రోత్సహించేలా కేంద్రం మంజూరు చేసిన యూనిటీ మాల్ విశాఖ మధురవాడలో అందుబాటులోకి రానుంది. రుషికొండ బీచ్‌కు 5K.Mల దూరంలో సముద్రపు ఒడ్డున 5 ఎకరాల్లో G+4 తరహాలో రూ.172 కోట్లతో నిర్మిస్తారు. 2 అంతస్తుల్లో 62 షాపుల్లో వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రొడక్ట్, GI గుర్తించిన ఉత్పత్తులు ఉంటాయి. 3వ ఫ్లోర్‌లో సముద్రం వీక్షించేలా సీ వ్యూ, 4వ ఫ్లోర్‌లో కన్వెన్షన్ హాలు, 2 థియేటర్లు, ఇతర స్టోర్లు ఉంటాయి.

News August 24, 2024

తల్లి స్వార్జిత ఆస్తిపై పిల్లలకు హక్కులు ఉండవు: హైకోర్టు

image

TG: తల్లి స్వార్జిత ఆస్తిపై పిల్లలు హక్కులు అడగలేరని, ఆమెకు నచ్చిన వారికి ఇవ్వొచ్చని హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. హిందూ మహిళకు ఆర్జిత ఆస్తిని కలిగే ఉండే హక్కు ఉందని వ్యాఖ్యానించింది. వారసత్వ ఆస్తిలో ముగ్గురు పిల్లల్లో ఒకరైన తనకు 3వ వంతు తల్లి ఇవ్వడం లేదని ఓ వ్యక్తి సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తల్లి స్థిర, చర ఆస్తుల వివరాలను పిటిషనర్ చేర్చలేదని కోర్టు కొట్టేయగా, హైకోర్టులో సవాల్ చేశారు.

News August 24, 2024

అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్

image

TG: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజైంది. 2024-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు ఈ నెల 31 చివరి తేదీ. https://www.braouonline.in/ వెబ్‌సైటులో దరఖాస్తు చేసుకోవాలి. సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలి. ఈ ఏడాది తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు ఉంటాయి.

News August 24, 2024

మన శరీరంలోని త్రివిధ దోషాలు ఇవే

image

పాంచభౌతికమైన మానవ శరీరంలో వాతం, పిత్తం, కఫం అనే మూడు దోషాలు ఆరోగ్యానికి కీలకమని ఆయుర్వేదం చెబుతోంది. గాలితో ముడిపడిన వాతం, శరీర కదలికల్ని నియంత్రిస్తుంది. ఇక అగ్నితో ముడిపడిన పిత్తం, పొట్ట పైభాగంలో ఉండి జీర్ణవ్యవస్థను నడిపిస్తుంది. నీరు, భూమి సంబంధితమై ఛాతీలో ఉండే కఫం రోగ నిరోధక శక్తి విషయంలో కీలకమవుతుంది. ఈ మూడు సమతుల్యంగా ఉంటే ఆరోగ్యమని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు.

News August 24, 2024

మహిళలకు ఫ్రీ బస్.. RTC కీలక నిర్ణయం

image

TG: మహిళలకు ఉచిత ప్రయాణంతో సీట్లు దక్కక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో RTC వ్యూహాత్మకంగా పాత రాజధాని AC బస్సులకు మార్పులు చేసి సెమీ డీలక్స్‌లుగా నడుపుతోంది. వీటిల్లో మహిళలకు ఫ్రీ కాదు. ఎక్స్‌ప్రెస్ కంటే 10% ఛార్జీలు అధికంగా ఉంటాయి. పల్లెవెలుగు కంటే 5 సీట్లు ఎక్కువగా ఉండటంతో ఆదాయమూ సమకూరుతుంది. నిర్మల్, NZB జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తుండగా.. మిగతా జిల్లాలకూ విస్తరించనున్నారు.

News August 24, 2024

ఇవాళ మహిళా కమిషన్ ముందుకు KTR

image

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇవాళ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరుకానున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆయన చేసిన <<13878635>>వ్యాఖ్యలపై<<>> కమిషన్ ఇటీవల నోటీసులు ఇచ్చింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఇవాళ ఉ.11 గంటలకు ఆయన కమిషన్ కార్యాలయానికి వెళ్లనున్నారు. అటు ఇప్పటికే తన వ్యాఖ్యలపై KTR క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.

News August 24, 2024

సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

image

AP: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఉమ్మడి జిల్లా స్థాయిలోనే బదిలీలు చేయనుంది. అర్హత ఉన్న వారు ఈ నెల 27లోగా దరఖాస్తులు సమర్పించాలి. 29 నుంచి 30 వరకు కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీ చేస్తారు. అభ్యంతరాలుంటే కలెక్టర్‌కు తెలియజేయవచ్చు. మ్యూచువల్, స్పౌజ్, మెడికల్, విభిన్న ప్రతిభావంతులు, వితంతువులు, గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లకు మించి పనిచేసిన వారు బదిలీకి అర్హులు.

News August 24, 2024

ఏపీకి ఇచ్చే రుణంలో కేంద్రం కొత్త మెలిక?

image

AP: అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.15వేల కోట్ల సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి కేటాయించే నిధుల నుంచి విడతలవారీగా ఆ రుణాన్ని మినహాయించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏటా బడ్జెట్లో ఆ మినహాయింపును చూపించొచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక అమరావతికి కేంద్రం రూ.3వేల కోట్లను మంజూరు చేసినట్లు సమాచారం. దీంతో రాజధాని రైతులకు సర్కారు వచ్చే నెలలో కౌలు చెల్లించే అవకాశం ఉంది.