India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 పేరిట ప్రభుత్వం కొత్త విద్యుత్ విధానాన్ని తీసుకురానుంది. దీనిపై అధికారులతో CM చంద్రబాబు సమీక్షించారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ, బయో ఎనర్జీకి ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగేలా పాలసీని రూపొందించాలని అధికారులకు CM సూచించారు. తక్కువ ధరకే విద్యుత్ సరఫరా, మిగులు విద్యుత్ విక్రయించేలా పాలసీ ఉండాలన్నారు. ఈ రంగంలో పెట్టుబడులపైనా చర్చించారు.
EPFOలో జూన్‌లో 19.29 లక్షల కొత్త సభ్యులు చేరారని కార్మిక శాఖ తెలిపింది. నిరుడు జూన్‌తో పోలిస్తే 7.86% వృద్ధి నమోదైందని పేర్కొంది. ఉపాధి అవకాశాలు, ఉద్యోగుల ప్రయోజనాలపై అవగాహన పెరగడమే ఇందుకు కారణాలని వెల్లడించింది. కొత్తవారిలో తొలిసారి ఉద్యోగంలో చేరినవారు, 18-25 మధ్య వయస్కులే 59.14% ఉన్నారంది. వీరిలో మహిళల సంఖ్య 2.98 లక్షలని పేర్కొంది. 14.15 లక్షల మంది వెళ్లిపోయి మళ్లీ తిరిగొచ్చారని తెలిపింది.
TG: CM రేవంత్ <<13898171>>వ్యాఖ్యలపై<<>> BRS నేత RS.ప్రవీణ్ కుమార్ స్పందించారు. ‘మానసిక చికిత్సాలయంలో ఉండాల్సిన వ్యక్తి సచివాలయానికి వస్తే ఇలాగే ఉంటుంది. ఆయన మాటలకు నవ్వుతున్న కాంగ్రెస్ నేతలను చూస్తే జాలేస్తోంది. ఆయన బూతు పురాణానికి అమాయకంగా చప్పట్లు కొడుతున్న చిన్నారుల భవిష్యత్తు పట్ల ఆందోళన కలుగుతోంది. మలి ఉద్యమానికి KCR ఊపిరిలూదకపోతే తెలంగాణ వచ్చేదా?’ అని ట్వీట్ చేశారు.
SC, ST వర్గీకరణకు వ్యతిరేకంగా రేపు భారత్ <<13902275>>బంద్‌కు<<>> పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అయితే AP, TGలో బంద్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వాలు సెలవు ఇవ్వలేదు. ఇక TGలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిస్థితిని బట్టి కలెక్టర్లు స్కూళ్లకు సెలవు ఇవ్వాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. హాలిడేపై రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
గత ఆరు నెలలు తనకు ఎంతో కష్టంగా గడిచాయని హీరో నవీన్ పొలిశెట్టి అన్నారు. ఓ రియాల్టీ షోలో సందడి చేసిన ఆయన తన చేతి గాయం గురించి మాట్లాడారు. ‘నా చెయ్యి సాధారణ స్థితికి వస్తుందో లేదో అని ఆందోళన చెందా. ఆ కష్టకాలంలో సంగీతం ఓదార్పునిచ్చింది. ఓ థెరపీలా పని చేసింది. మ్యుజీషియన్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అని తెలిపారు. USలో ఉన్నప్పుడు తన చేతికి గాయమైనట్లు నవీన్ గతంలో తెలిపిన సంగతి తెలిసిందే.
AP: చేనేత రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సవిత అన్నారు. విజయవాడలోని స్టెల్లా కాలేజీలో నిర్వహించిన చేనేత వస్త్ర ప్రదర్శన ముగింపు వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ మేళాలో రూ.2 కోట్ల మేర టర్నోవర్ జరిగినట్లు తెలిపారు. నేతన్నలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఆమె కోరారు. వారంలో ఒక్కసారైనా నేత వస్త్రాలు ధరించాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన చేనేత వస్త్రాల ఫ్యాషన్ షో ఆకట్టుకుంది.
అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ మంటల్లో కాలిపోయే ప్రమాదం ఉందని US మిలిటరీ స్పేస్ సిస్టమ్ మాజీ కమాండర్ రుడీ రిడాల్ఫీ అంటున్నారు. బోయింగ్ స్టార్‌లైనర్ సురక్షితంగా భూమ్మీదకు రావాలంటే సర్వీస్ మాడ్యూల్ సరైన కోణంలో క్యాప్సూల్‌కు అతుక్కోవాలన్నారు. ఒకవేళ మాడ్యూల్ కోణం మరీ ఏటవాలుగా ఉండి ఒరిపిడి పెరిగి మంటలు చెలరేగితే ఆస్ట్రోనాట్స్ మాడిమసవుతారని హెచ్చరించారు.
PM మోదీ ఈనెల 23న ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. 22న పోలాండ్ టూర్ ముగిసిన అనంతరం ఆయన ‘రైల్ ఫోర్స్ వన్’లో 10 గంటలు ప్రయాణించి కీవ్ నగరానికి చేరుకుంటారని సమాచారం. గతేడాది ఫిబ్రవరిలో US అధ్యక్షుడు బైడెన్ కూడా ఇదే ట్రైన్‌లో ప్రయాణించారు. అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ తదితర కార్యక్రమాల కోసం మోదీ సుమారు 7 గంటలు ఉక్రెయిన్‌లో గడుపుతారు. మొత్తంగా ఆయన 20 గంటలు ట్రైన్ జర్నీ చేస్తారని తెలుస్తోంది.
TG: సీఎం రేవంత్‌రెడ్డిపై BRS నేతలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఎం హోదాలో ఉండి ఆయన అభ్యంతరకర భాష మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని దాసోజు శ్రవణ్, బాల్క సుమన్, ముఠా గోపాల్ కోరారు. అధికారం శాశ్వతం కాదని, సీఎం రేవంత్ తీరును ప్రజలు గమనిస్తున్నారని వారు పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఇన్‌ఛార్జులుగా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌లను BJP అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Sorry, no posts matched your criteria.