India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి టీడీపీలో చేరారు. అలాగే కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాలరెడ్డి, అద్దంకి నేతలు బాచిన గరటయ్య, కృష్ణచైతన్య కూడా సైకిల్ ఎక్కారు. చంద్రబాబు వారికి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
లిక్కర్ సిండికేషన్‌ను కవిత తెర వెనక ఉండి నడిపారని ED ఆరోపించింది. ఇండో స్పిరిట్ కంపెనీలో వాటా గల అరుణ్ పిళ్లై కవితకు డమ్మీ వ్యక్తి అని అధికారులు తెలిపారు. సాక్ష్యాలు బయటకు రాకుండా ఫోన్లు, పలు డాక్యుమెంట్లను MLC ధ్వంసం చేశారని వెల్లడించారు. డేటా రికవరీ కోసం ఆమె 10 ఫోన్లు ల్యాబ్‌కు పంపితే 4 మొబైళ్లలో డేటా రికవరీ కాలేదన్నారు. తమ విచారణలోనూ అసంబద్ధ సమాధానాలు ఇవ్వడంతోనే అరెస్టు చేశామని వివరించారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్ రాణిస్తారని ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ధీమా వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్ హెడ్ కోచ్ వెటోరీ ఆస్ట్రేలియా టీమ్‌కు అసిస్టెంట్ కోచ్ కూడా. ఆయనతో కమిన్స్‌కు చక్కటి అనుబంధం ఉంది. పైగా కెప్టెన్సీ బాధ్యత ఉన్న ప్రతిసారీ కమిన్స్ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారు. ఈసారి SRH రాణిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది’ అని స్మిత్ వ్యాఖ్యానించారు.
AP: రాష్ట్రంలో 81 గ్రూప్-1 పోస్టులకు రేపు జరిగే ప్రిలిమ్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు సీఎస్ జవహర్‌రెడ్డి వెల్లడించారు. 301 కేంద్రాల్లో ఉ.10 నుంచి మ.12 వరకు పేపర్-1, మ.2 నుంచి 4 గంటల వరకు పేపర్-2 ఎగ్జామ్ జరుగుతుందన్నారు. 1.48 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారని చెప్పారు. పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు ఓ ఐఏఎస్‌ను నియమించామని పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈక్రమంలో ప్రజలు రూ.50వేల కంటే ఎక్కువ నగదును తీసుకెళ్లకూడదు. ఒకవేళ ఉంటే.. కచ్చితంగా రసీదు, ఇతర డాక్యుమెంట్స్ చూపించాల్సిందే. తనిఖీల్లో దొరికితే పోలీసులు డబ్బును సీజ్ చేస్తారు. బంగారం, వెండి వంటి ఆభరణాలు సైతం పెద్ద మొత్తంలో తీసుకెళ్లకూడదు. ఆస్పత్రి, ఇతర అత్యవసరాల కోసం డబ్బు తీసుకెళ్తే రోగి రిపోర్టులు, రసీదులను చూపించాలి.
కవితకు 7 రోజుల కస్టడీ విధించిన కోర్టు.. ఆమె అడిగిన కొన్ని మినహాయింపులకు అంగీకరించింది. ప్రతిరోజు కుటుంబ సభ్యులను, లాయర్లను కలిసేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు కూడా ఒకే చెప్పింది. కాగా కవితను ఈడీ అధికారులు తమ కార్యాలయానికి తీసుకెళ్లారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఆమెకు కోర్టు కస్టడీ విధించడంతో ఈడీ కవితను విచారించనుంది. లిక్కర్ స్కాంలో ఆమె పాత్రపై ఆరా తీయనుంది. గతంలో ఈ కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మాగుంట రాఘవ, శరత్‌చంద్రారెడ్డితో ఆమెకు ఉన్న సంబంధాలపై ప్రశ్నించనుంది. అయితే ఈడీ ప్రశ్నలకు కవిత సమాధానం చెప్తారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.
కవిత రిమాండ్ రిపోర్టులో ఈడీ కీలక అంశాలు పొందుపర్చింది. ‘లిక్కర్ కేసు కీలక సూత్రధారుల్లో కవిత ఒకరు. మాగుంట రాఘవ, శ్రీనివాసులురెడ్డి, శరత్‌చంద్రారెడ్డితో కలిసి ఆమె సౌత్ సిండికేట్ ఏర్పాటు చేశారు. ఆప్ నేతలతో కుమ్మక్కై రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చారు. లిక్కర్ పాలసీలో తమకు అనుకూలంగా నిబంధనలు రూపొందించారు’ అని పేర్కొంది.
➥ప్రభుత్వ కార్యాలయాలతో పాటు బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ స్తంభాలపై నాయకుల పోస్టర్లు తొలగించాలి
➥ప్రజాధనంతో పత్రికలు, టీవీల్లో ఇచ్చే ప్రకటనలు నిలిపివేయాలి
➥పథకాల లబ్ధిదారులకు ఇచ్చే పత్రాలు, అధికారిక వెబ్‌సైట్ల నుంచి ప్రజాప్రతినిధుల ఫొటోలు తొలగింపు
➥ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ అధికారిక వాహనాల వినియోగం నిలిపివేత
➥అధికారుల బదిలీలపై నిషేధం, ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు.
లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కవితకు హైబీపీ ఉందని ఆమె లాయర్ తెలిపారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయి రక్తపోటు లేదని కోర్టుకు వెల్లడించారు. ఆమె అరెస్టు విషయంలో నిబంధనలు పాటించలేదని, ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అయితే ఈ కారణంగా ఉపశమనం ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. 7 రోజుల ED కస్టడీలో అవసరమైన మెడిసిన్, దుస్తులు, ఫుడ్ అందించవచ్చని లాయర్‌కు తెలిపింది.
Sorry, no posts matched your criteria.