India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి రోజా, ఆ పార్టీ నాయకులు తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఆపడానికి పోలీసులను వాడాలని, వైసీపీపై ప్రయోగిస్తే తిరుగుబాటు తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇచ్చిన హామీలు అమలుచేయలేక సీఎం చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

రైతులు, పేదలు, ఉద్యోగాల విషయంలో మోదీ ప్రభుత్వం ఫెయిలైందని TG సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. MH ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. కేంద్రం తరఫున మంత్రిని లేదా అధికారిని పంపిస్తే తెలంగాణలో తాము నెరవేర్చిన హామీల వివరాలు ఇస్తామని చెప్పారు. పేద మహిళలు పొదుపు చేసుకున్న సొమ్మును మోదీ ధరలు పెంచి దోచుకున్నారని మండిపడ్డారు. తమ పార్టీవి కచ్చితమైన వాగ్దానాలని, జూటా పార్టీ హామీలు కావని సెటైర్లు వేశారు.

APSRTCలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. సంస్థలో 1,275 డ్రైవర్లు, 789 మంది కండక్టర్ల కొరత ఉందని తెలిపారు. ఉద్యోగులకు EHS ద్వారా పూర్తిస్థాయి వైద్య సదుపాయాలు అందిస్తామన్నారు. రాష్ట్రంలోని బస్టాండులను ఆధునికీకరిస్తామని పేర్కొన్నారు. YCP హయాంలో నిధులు ఇవ్వకపోవడంతో బస్టాండుల నిర్వహణ కష్టతరమైందని ఆరోపించారు.

TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్‌పై దాడి కేసులో A1గా ఉన్న బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను కొడంగల్ కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 25న విచారిస్తామని తెలిపింది. అటు అతడిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై కాసేపట్లో విచారణ చేపట్టనుంది.

TG: రాష్ట్రంలో రోడ్లు సరిగా లేవని, గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై CJ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రజలు రోడ్డు సమస్యలు తెలిపేలా మొబైల్ యాప్ రూపొందించి R&B, HMDA అధికారులు దాన్ని నిర్వహించాలని గతంలో ఆదేశించినట్లు హైకోర్టు అధికారులకు గుర్తు చేసింది. మరో నెలలో యాప్ అందుబాటులోకి తెస్తామని అధికారులు చెప్పారు. ఆపై విచారణను హైకోర్టు వచ్చే నెల 12కు వాయిదా వేసింది.

భారత ఎగుమతులపై అమెరికా అధిక టారిఫ్‌లు విధిస్తే అది ఇరు దేశాల మధ్య ట్రేడ్ వార్‌కు దారి తీస్తుందని US కాంగ్రెస్‌కు ఎన్నికైన సుహాస్ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. అందుకే భారత్‌పై టారిఫ్‌లను వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు. US వాణిజ్య లోటును తగ్గించేలా భారత్, చైనాల ఎగుమతులపై Reciprocal Tax విధిస్తామని ఎన్నికల వేళ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సుహాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

AP: తెలుగు నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళిపై సీఐడీ కేసు నమోదైంది. చంద్రబాబును కించపరిచేలా, వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోసాని మాట్లాడారని టీడీపీ నేత బండారు వంశీకృష్ణ ఫిర్యాదుతో ఆయనపై 111, 196, 353, 299, 336(3)(4), 341, 61(2) BNS సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ మూవీ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ టీమ్‌ను అభినందించారు. ప్రస్తుతం బిజీగా ఉండటం వల్ల సినిమాను చూడలేకపోతున్నా అని, కానీ తప్పకుండా మూవీ చూసి హీరో కిరణ్‌కు ఫోన్ చేస్తానని ఆయన పేర్కొన్నారు. ‘పుష్ప-2’ ట్రైలర్ బాగుందని కిరణ్ అబ్బవరం చేసిన ట్వీట్‌కు ఐకాన్ స్టార్ ఇలా స్పందించారు.

TG: రేవంత్ పాలనలో తెలంగాణ 15 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆరు గ్యారంటీలు బంద్ చేసి మూసీ దుకాణం తెరిచారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో తెలంగాణను నం.1గా మార్చారని చెప్పారు. పేదోళ్లతో పెట్టుకుని రేవంత్ హిట్ వికెట్ చేసుకున్నారని అన్నారు. కేసీఆర్ మళ్లీ ఫామ్‌లోకి వస్తారని, బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

TG: ఎల్లుండి సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో వేములవాడకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. ఆలయ అభివృద్ధి పనులకు రూ.127.65 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు ఆధునాతన సదుపాయాల కోసం రూ.76 కోట్లు, ఆలయం నుంచి మూల వాగు బ్రిడ్జి వరకు రోడ్డు విస్తరణ, భూసేకరణకు రూ.47.85 కోట్లు, స్థానికంగా మేజర్ డ్రైన్ నిర్మాణానికి రూ.3.8 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొంది.
Sorry, no posts matched your criteria.