India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బెంగాల్లో ప్రజాస్వామ్యం పతనమవుతోందని గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ అన్నారు. మహిళలకు అండగా ఉంటానని రక్షాబంధన్ సందర్భంగా రాజ్‌భవన్లో తనను కలిసిన మహిళా వైద్యులు, నేతలకు అభయమిచ్చారు. ‘మన కూతుళ్లు, అక్కచెల్లెళ్లను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయాలి. వారు సంతోషంగా, భద్రంగా ఉండే సమాజాన్ని నిర్మించాలి. ఇది మన కనీస ధర్మం. మనది సుదూర లక్ష్యమని తెలుసు. మీ వెంట నేనున్నా. మనం దాన్ని కచ్చితంగా చేరగలం’ అని ఆయన అన్నారు.
రాజ్ కుమార్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘స్త్రీ2’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ మూవీ రూ.204 కోట్లు వసూలు చేసినట్లు సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. తొలి రోజు కన్నా నాలుగో రోజే అత్యధిక కలెక్షన్లు వచ్చాయని పేర్కొన్నారు. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో రూ.50 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించారు.
AP: సీఎం చంద్రబాబు తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో పలు పరిశ్రమల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలను ప్రారంభించారు. శ్రీసిటీలో రూ.900 కోట్ల పెట్టుబడితో 2,740 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. మరో రూ.1,213 కోట్ల పెట్టుబడికి 4 కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది.
గడిచిన క్షణాన్ని మనం తీసుకురాలేము. కానీ ఆ జ్ఞాపకాలను ఫొటో రూపంలో బంధిస్తే కొన్నాళ్ల పాటు మనతో ఉండిపోతాయి. మధురానుభూతులు, విషాద సన్నివేశాలు, వెలకట్టలేని దృశ్యాలు.. ఇలా ఏ సందర్భమైనా ఫొటోలే మనకు జ్ఞాపకంగా నిలుస్తున్నాయి. మాటల్లో చెప్పలేని భావాలను కూడా ఫొటోలు కళ్లకు కడతాయి. గత స్మృతులను గుర్తు చేస్తూ మనల్ని ఆ సమయంలోకి తీసుకెళ్తాయి.
ఇవాళ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం.
TG: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ.7,500 చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విధివిధానాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. మేధావుల సూచనలతో 10 ఎకరాల లోపు వారికి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్‌కు, IAS, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై మరో 20 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
AP: తన భార్య వాణి, కుమార్తె హైందవిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ YCP MLC దువ్వాడ శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై దాడి చేసి, రోజుల తరబడి టెక్కలిలోని తన ఇంటి వద్ద ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. 41A నోటీసులిచ్చినట్లు పోలీసులు వివరించగా, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.
AP: ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని 12 పోలింగ్ బూత్‌లలో రీకౌంటింగ్(ఈవీఎంలు, వీవీప్యాట్లలో ఓట్లు సరిపోల్చడం) కోరుతూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. అటు ఆయన విజ్ఞప్తితో ఇవాళ్టి నుంచి 12 చోట్ల మాక్ పోలింగ్ జరుగుతోంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో విభేదాలు ఉన్నాయనే ప్రచారంపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. తాను అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వక ముందు నుంచే త్రివిక్రమ్ డైలాగ్స్ రాస్తున్నారని గుర్తు చేశారు. తన తండ్రి గురూజీకి పెద్ద ఫ్యాన్ అని ‘మిస్టర్ బచ్చన్’ మూవీ చిట్‌చాట్‌లో తెలిపారు. త్రివిక్రమ్ అంటే తనకు గౌరవమని, ఆయన చాలా సీనియర్ అని పేర్కొన్నారు. తమ ఇద్దరిపై జరుగుతున్న ప్రచారం చూసి నవ్వుకుంటానని తెలిపారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. హైదరాబాద్ నగరంలో మ.1-5 గంటల మధ్య వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అటు ఏపీలోని అల్లూరి జిల్లాలో భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి.
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై హింసను ప్రోత్సహించేలా పోస్టు పెట్టిన యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ‘మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తరహాలో మమతను షూట్ చేయాలి. మీరు ఇలా చేయకపోతే నేను నిరాశ చెందుతాను’ అని బీకాం విద్యార్థిని కీర్తి శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కాగా ఆర్జే కర్ ఆస్పత్రిలో హత్యాచార ఘటనపై గత కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.