India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఫైబర్‌నెట్‌లో ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. సంస్థలో పెద్దఎత్తున తన బంధువులను నియమించి రూ.వందల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని, మెటీరియల్ కొనుగోలు, నియామకాల్లోనూ గోల్‌మాల్ చేశారని పలువురు ఆయనపై ఫిర్యాదు చేశారు.
TG: రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. మాఫీ పేరుతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు. నిజంగా రుణమాఫీ చేస్తే ప్రజలు రోడ్లపైకి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. దీనిపై కిషన్ రెడ్డి నేతృత్వంలో కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. విలీనం పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు.
ఆడకూతుళ్లపై అత్యాచారాలు మనసుల్ని కలచివేస్తున్నాయి. ఇలాంటి కష్టం మన ఆడపడుచుకే వస్తే ఎలా స్పందిస్తాం? తప్పుచేసిన వాడి తోలు ఒలిచేస్తాం. కానీ అలాంటి తప్పు జరిగే ఆస్కారం ఎందుకివ్వాలి? ఈ స్వేచ్ఛాభారతంలో ఆడపిల్లలు స్వతంత్రంగా, నిర్భయంగా తిరిగే సమాజాన్ని నిర్మించుకోలేమా? ప్రతి ఆడకూతురిని మన ఆడపడుచులా భావించి ఓ తోబుట్టువులా రక్షగా నిలవలేమా? ఈ ‘రక్షాబంధన్’కి మగవారందరూ ఆలోచించాల్సిన విషయమిది.
అదానీ గ్రూప్ కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్స్ జులైలో రూ.2000 కోట్లు పెట్టుబడి పెట్టాయి. మేలో రూ.880 కోట్లు పెట్టిన MFs జూన్‌లో రూ.990 కోట్లకు పెంచాయి. అదానీ 8 కంపెనీల్లో వీటి పెట్టుబడుల మొత్తం విలువ జూన్‌లో 39,227 కోట్లు ఉండగా జులైలో రూ.42,154 కోట్లకు చేరింది. ప్రమోటర్లు రూ.23,000 కోట్ల విలువైన షేర్లు కొనడాన్ని MFs పాజిటివ్‌గా తీసుకున్నాయి. అదానీ పోర్ట్స్‌లో అత్యధికంగా రూ.1100 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఆల్‌రౌండర్లే కీలకమని ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ అన్నారు. కామెరాన్ గ్రీన్ బంతితోనూ ఎక్కువ శ్రమించాల్సి ఉంటుందని అంచనా వేశారు. మిచెల్ మార్ష్ బౌలింగ్ సేవల్నీ వాడుకుంటామన్నారు. ‘టాప్-6లో ఇద్దరు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల వల్ల జట్టు కూర్పు సులభం అవుతుంది. వారిద్దరి వల్ల మాకు ఆరు బౌలింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఇక స్పిన్నర్ లైయన్ ఎన్ని ఓవర్లైనా వేస్తారు’ అని చెప్పారు.
TG: రాఖీపౌర్ణమి పండుగ సందర్భంగా తన సోదరి కవితను గుర్తు చేసుకుని మాజీ మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ‘నువ్వు ఇవాళ రాఖీ కట్టకపోయినా నీ కష్టసుఖాల్లో నేను తోడుగా ఉంటాను’ అని ట్వీట్ చేశారు. గతంలో కవిత రాఖీ కట్టినప్పటి, ఆమె జైలుకు వెళ్తున్నప్పటి ఫొటోలను షేర్ చేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఈ ఏడాది మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె తిహార్ జైలులో ఉన్నారు.
కర్ణాటక సీఎం సిద్ద రామయ్య ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ముడా స్కామ్‌లో తనపై విచారణకు గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ అనుమతివ్వడాన్ని సవాల్ చేశారు. చీఫ్ జస్టిస్ అనుమతిని బట్టి ఆయన పిటిషన్‌ను నేటి మధ్యాహ్నం లేదా మంగళవారం విచారిస్తామని జస్టిస్ హేమంత్ చందన్‌గౌడర్ తెలిపారు. మైసూరు నగరాభివృద్ధి సంస్థలో భూకుంభకోణం జరిగిందన్న సామాజిక కార్యకర్త టీజే అబ్రహం ఫిర్యాదు మేరకు గవర్నర్ విచారణకు అనుమతి ఇచ్చారు.
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనకు చికిత్స కోసం 15 రోజులు బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. హైదరాబాద్ విడిచి వెళ్లవద్దని న్యాయస్థానం ఆయనను ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు A2గా ఉన్నారు.
బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్, రష్మిక జంటగా తెరకెక్కుతోన్న పీరియాడిక్ చిత్రం ‘ఛావా’. ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆమె హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప-2’ కూడా అదే రోజున రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఒకే రోజున రష్మిక రెండు సినిమాలు విడుదల కానున్నాయి. రెండు చిత్రాలు హిట్ అవ్వాలని నేషనల్ క్రష్ అభిమానులు కోరుకుంటున్నారు.
TG: కాంగ్రెస్ ప్రభుత్వం దసరాకు మరో రెండు పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇందిరమ్మ ఇండ్ల పథకం, రైతు భరోసా విధివిధానాలను ఖరారు చేసే పనిలో పడింది. ఇందిరమ్మ ఇండ్లకు రూ.5 లక్షల ఆర్థిక సాయంపై క్యాబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఇక రైతు భరోసా విషయంలోనూ మేధావులతో చర్చించి గైడ్‌లైన్స్ ఖరారు చేయనుంది. మరోవైపు రైతు కూలీలకు ఆర్థిక సాయంపైనా మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.