India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘హే.. నేనొక్కడిని ఓటు వేయకపోతే మునిగిపోయేది ఏం లేదులే..’ అని అనుకుంటాం మనలో చాలామంది. కానీ నీ ఒక్క ఓటే అభ్యర్థి ఫేట్ మారుస్తుంది. అన్యాయాలు, అక్రమాలకు పాల్పడే క్యాండిడేట్ల ఆట కట్టిస్తుంది. నిఖార్సైన నాయకులకు ప్రజాసేవ చేసే భాగ్యం కల్పిస్తుంది. సమస్యలపై నీకు ప్రశ్నించే అధికారమిస్తుంది. నువ్వు ఎవరికి వేశావనే దాని కంటే ఓటేశావా? లేదా? అనేదే ఇంపార్టెంట్. అందుకే నీ హక్కును వినియోగించుకో.
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కలకలం రేపింది. సీఎం కేజ్రీవాల్ అనుచరుడు బిభవ్ కుమార్ ఆమెపై దాడి చేశారని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. సీఎం నివాసంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలిపాయి. దీంతో ఒక్కసారిగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా స్పందించారు. కేజ్రీవాల్ అరెస్టుపై స్వాతి మౌనంగా ఉన్న విషయాన్ని ఎత్తి చూపారు.
AP: పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసులు విఫలమయ్యారని చంద్రబాబు ఆరోపించారు. ఉదయం నుంచి పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తున్నామని, అయినా శాంతిభద్రతలను కాపాడలేకపోయారని ఫైరయ్యారు. ఎన్నికల సంఘం వెంటనే పోలింగ్‌ను సమీక్షించి పరిస్థితి చక్కదిద్దాలని సూచించారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ కేంద్రాలు ఓటర్లతో కిక్కిరిసి కనిపిస్తుంటే హైదరాబాద్‌లో బోసిపోయి కనిపిస్తున్నాయి. ఓటర్ల కోసం పోలింగ్ సిబ్బంది సైతం వేచిచూస్తున్నారు. చాలా మంది సెటిలర్లకు ఏపీలోనూ ఓటు హక్కు ఉంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సెటిలర్లంతా సొంతూళ్లకు తరలివెళ్లారు. దీంతో దాదాపు 20 శాతం ఓటింగ్ తగ్గేలా కనిపిస్తోంది.
అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ సీఎంగా తొలగించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న నేపథ్యంలో ఆయనకు సీఎంగా కొనసాగే అర్హత లేదంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పిటిషనర్ వాదనలతో ఏకీభవించలేదు. కాగా లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కేజ్రీవాల్ ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు.
లోక్‌సభ ఎన్నికల నాల్గవ దశ పోలింగ్‌లో ఉ.11గంటల వరకు 24.87 శాతం ఓటింగ్ నమోదైంది. ఏపీలో 23.10%, బిహార్ 22.54%, జమ్మూ కశ్మీర్ 14.94%, ఝార్ఖండ్ 27.40%, మధ్యప్రదేశ్ 32.38%, ఒడిశా 17.51%, మహారాష్ట్ర 17.51%, తెలంగాణ 24.31%, యూపీ 27.12%, వెస్ట్ బెంగాల్‌లో 32.78% ఓటింగ్ రికార్డు అయినట్లు ఈసీ వెల్లడించింది.
పారిస్ ఒలింపిక్స్‌కు భారత్ నుంచి పురుష రెజ్లర్లలో ఒక్కరు మాత్రమే అర్హత సాధించారు. 57 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో అమన్ సెహ్రావత్ పోటీ పడనున్నారు. మిగతా వారు క్వాలిఫయర్స్‌లో ఓటమితో ఈ పోటీలకు దూరమయ్యారు. 2004లో ఆరుగురు, 2008లో ముగ్గురు, 2012, 2016, 2020లో నలుగురు చొప్పున రెజ్లర్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. ఈసారి ఒక్కరే వెళ్తుండడంతో దేశంలో రెజ్లింగ్ భవితవ్యంపై క్రీడాభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఈ ఎన్నికల్లో NDA కూటమి 400 సీట్ల మార్క్ దాటుతుందని ప్రధాని మోదీ మరోసారి ధీమా వ్యక్తం చేశారు. ‘మోదీని వ్యతిరేకిస్తే గెలుస్తామని ఇండియా కూటమి భావిస్తోంది. కానీ ఇప్పటివరకు ఆ కూటమి ప్రధాని అభ్యర్థినే తేల్చుకోలేదు. ఏడాదికి ఒకరిని చొప్పున ప్రధానిని చేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు ఓ పేపర్‌లో చదివా. ఒక్క ఏడాదిలో దేశం గురించి ఆ ప్రధానికి ఏం తెలుస్తుంది? ఏం చేయగలడు?’ అని ప్రశ్నించారు.
దేశంలో నేడు 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఇందులో ఏపీలో 25 (అసెంబ్లీ- 175), తెలంగాణలో 17 స్థానాలున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా-4, ఝార్ఖండ్-4, బిహార్-5, UP-13, MH-11, MP-8, WB-8, JK-1 సెగ్మెంట్లలో ఎలక్షన్ జరుగుతోంది. ఈ ఫేజ్‌లో17.7 కోట్ల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక 2019లో వీటిలో NDA-49, INDIA-11, నాడు రెండు కూటముల్లో లేని పార్టీలు 35 చోట్ల గెలిచాయి.
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు ఏపీలో 23.10 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ పేర్కొంది. మరోవైపు తెలంగాణలో 24.31 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలిపింది. 2019లో ఇదే సమయానికి APలో 23.22 శాతం ఓటింగ్ నమోదవడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.