India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాష్ట్రంలో 7 ఎయిర్‌పోర్టులు ఉండగా, కొత్తగా మరో ఏడింటిని నిర్మించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు. ‘సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాల్లో టెర్నినల్ కెపాసిటీలు పెంచుతున్నాం. శ్రీకాకుళం, దగదర్తి, కుప్పం, నాగార్జున సాగర్, తుని-అన్నవరం, తాడేపల్లిగూడెం, ఒంగోలులో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కృషి చేస్తాం’ అని తెలిపారు.
ఇద్దరూ డబ్బు సంపాదిస్తున్నా పిల్లల్ని కనొద్దని భావించే జంటల్ని DINKS(Dual Income No Kids)గా పిలుస్తారు. పిల్లల కంటే తమ ఇతర అవసరాలపై దృష్టి సారించాలని వీరు భావిస్తుంటారు. విదేశాల్లో ఎక్కువగా ఉండే ఈ సంస్కృతి ఇప్పుడు భారత్‌లోనూ పెరుగుతోందని లాన్సెట్ సంస్థ అంచనా వేసింది. దానికి తగ్గట్టు జననాల రేటు పడిపోతోందని పేర్కొంది. 1950లో భారత సంతోనాత్పత్తి రేటు 6.18 శాతం కాగా 2021కి అది 1.91శాతానికి పడిపోయింది.
TG: రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా అభయ్ పాటిల్‌ను ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయన ఇవే బాధ్యతల్ని నిర్వర్తించారు. కర్ణాటకలోని దక్షిణ బెల్గాం నుంచి పాటిల్ 3సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఐటీ రిఫండ్స్ విషయంలో పన్ను చెల్లింపుదారులు అప్రమత్తంగా ఉండాలని ఆదాయపు పన్ను శాఖ తాజాగా హెచ్చరించింది. ముఖ్యంగా ఫేక్ కాల్స్, పాప్ అప్ నోటిఫికేషన్స్ విషయంలో జాగ్రత్త వహించాలని సూచించింది. ‘నకిలీ సందేశాలు, కాల్స్‌ను నమ్మి మోసపోవద్దు. ఎటువంటి మెసేజ్ వచ్చినా వెంటనే అధికారిక ఖాతాలను చూసి ధ్రువీకరించుకోవాలి. తెలియని వారికి వివరాలను ఇవ్వొద్దు. అనుమానాస్పద లింకులను ఓపెన్ చేయొద్దు’ అని సూచించింది.
సీఎం రేవంత్‌కు ఎవరైనా మేనర్స్ నేర్పించాలంటూ కేటీఆర్ ట్విటర్‌లో మండిపడ్డారు. ఫాక్స్‌కాన్ ప్రతినిధులతో సీఎం భేటీ అయిన ఫొటోను షేర్ చేసి విమర్శలు గుప్పించారు. ‘బిజినెస్ లీడర్ అయిన ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియూతో భేటీ అవుతున్న మీటింగ్ హాల్‌లో ఏమాత్రం బాగాలేని సొంత పెయింటింగ్స్‌ను ఎవరైనా పెట్టుకుంటారా? ఎవరైనా ఈ మనిషికి కొంచెం సంస్కారం నేర్పించండి’ అంటూ వ్యాఖ్యానించారు.
ఇతర డెలివరీ యాప్‌ల తరహాలోనే ఫ్లిప్‌కార్ట్ కూడా రూ. 3 ప్లాట్‌ఫామ్ ఫీజు వసూలు చేయడం ప్రారంభించింది. సంస్థకు చెందిన మింత్రా, ఫ్లిప్‌కార్ట్స్ మినిట్స్‌లోనూ వసూలు మొదలైంది. తమ సంస్థ అందించే సేవలు మరింత మెరుగ్గా కొనసాగేందుకు ఈ ఫీజు తీసుకుంటున్నట్లు ఓ ప్రకటనలో సంస్థ వెల్లడించింది. కాగా, జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్ వంటివి ఇప్పటికే ప్లాట్‌ఫామ్ ఫీజును కలెక్ట్ చేస్తున్నాయి.
థియేటర్లకు జనం ఒకప్పటిలా రాకపోవడంపై నిర్మాత బన్నీ వాసు స్పందించారు. ‘జనం థియేటర్లకు రావాలంటే ఏదైనా సందర్భం ఉండాలి. మహేశ్ బాబు బర్త్‌డే కాబట్టే మురారి రీరిలీజ్ అంత హిట్ అయింది. మా రీసెంట్ సినిమా ఆయ్‌కి ఎంత బజ్ క్రియేట్ చేసినా మామూలు రోజుల్లో రిలీజ్ చేశామంటే 25శాతం వరకే ఓపెనింగ్ వస్తుంది. ఇప్పుడు వరుస సెలవులు ఉండటంతో ఓపెనింగ్ బాగుంది. థియేటర్ల పరిస్థితులు ఒకప్పటిలా లేవు’ అని పేర్కొన్నారు.
AP: ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మల, సీఆర్ పాటిల్‌తో CM చంద్రబాబు భేటీ అయ్యారు. సీఎంఓ వివరాల ప్రకారం.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన పెండింగ్ అంశాలను పరిష్కరించాలని ఆయన షాను కోరారు. రాజధాని క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధుల్ని విడుదల, పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అంశాలపై నిర్మల, సీఆర్ పాటిల్‌తో ఆయన చర్చించినట్లు CMO తెలిపింది.
AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న AP CM చంద్రబాబు PM మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలతో భేటీ అయ్యారు. ఆ వివరాలను ఆయన కార్యాలయం వెల్లడించింది. ‘ఏపీకి చేసిన కేటాయింపులపై ప్రధానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం నిధుల విడుదలపై క్యాబినెట్‌లో ఆమోదించాలని కోరారు. ‘అమరావతి’ నిధుల్ని త్వరగా విడుదల చేయాలని, పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు’ అని వివరించింది.
AP: రాష్ట్రంలో ఈనెల 20 నుంచి నిర్వహించాల్సిన ఆధార్ క్యాంపుల షెడ్యూల్ మారింది. టెక్నికల్ సమస్యల వల్ల ఆధార్ సర్వీస్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆపరేటర్లకు ఆన్లైన్ రిఫ్రెష్మెంట్ ట్రైనింగ్ పూర్తయ్యాక రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ క్యాంపులు జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు పేర్కొన్నాయి.
Sorry, no posts matched your criteria.