India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మెక్సికోలో జరుగుతున్న మిస్ యూనివర్స్-2024 అందాల పోటీలో భారత్ ప్రస్థానం ముగిసింది. మనదేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన రియా సింఘా స్విమ్ సూట్ రౌండ్‌లో ఎలిమినేట్ అయ్యారు. మొత్తం 30 మంది పాల్గొన్న ఈ రౌండ్ నుంచి 12 మంది మాత్రమే తదుపరి గౌను రౌండ్‌కు ఎంపికయ్యారు. అహ్మదాబాద్‌కు చెందిన రియా మిస్ యూనివర్స్ ఇండియా-2024 విజేతగా నిలిచి మిస్ యూనివర్స్ పోటీలకు ఎంపికయ్యారు.

HYDలోని ఓ అగ్రో కంపెనీలో పనిచేసే గోపాల్ బెహరా సంస్థ లాకర్ నుంచి రూ.20లక్షలు తీసుకుని పరారయ్యాడు. ఆ డబ్బును ఒడిశా బాలాసోర్ జిల్లాలోని బాదమందరుని గ్రామానికి తరలించినట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక పోలీసులతో కలిసి అతని అత్తమామలపై ఇంట్లో తనిఖీలు చేశారు. చివరికి ఆవు పేడ కుప్పలో నుంచి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితుని కోసం గాలిస్తున్నామని తెలిపారు.

AI ఊహాతీతంగా ప్రవర్తించేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో అణ్వాయుధాల తయారీ, నిర్వహణ దాని చేతిలో ఎప్పుడూ పెట్టకూడదని US, చైనా తాజాగా అంగీకరించాయి. పెరూలో జరిగిన APEC సదస్సులో ఇరు దేశాల అధ్యక్షులు భేటీ అయిన సందర్భంగా అణ్వాయుధాలను మనుషులు మాత్రమే హ్యాండిల్ చేయాలని నిర్ణయించారు. రక్షణ రంగంలో AIని బాధ్యతగా వాడాలన్న ఏకాభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం US వద్ద 5044, చైనా వద్ద 500 అణు వార్‌హెడ్స్ ఉన్నాయి.

జలుబు చేసి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే మసాలా దట్టించిన చికెన్ పులుసు కూర తినండి/సూప్ తాగండనే మాట తరుచూ వింటూ ఉంటాం. ఇందులో కొంత వరకు నిజం ఉందని నిపుణులు చెబుతున్నారు. కూరలో వాడే అల్లం, వెల్లుల్లి, మసాలా దినుసుల కారణంగా కొంచెం ఉపశమనం కలుగుతుందని, ముక్కు రంధ్రాలు క్లియర్ అవుతాయని పేర్కొంటున్నారు. అయితే జలుబు పూర్తిగా మటుమాయం కాదంటున్నారు.

జేక్ పాల్‌తో నిన్న జరిగిన బాక్సింగ్ మ్యాచ్‌లో తాను ఓడినప్పటికీ గెలిచినట్లేనని దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ ట్వీట్ చేశారు. ‘ఆడినందుకు, ఓడినందుకు నాకు ఏమాత్రం బాధ లేదు. జూన్‌లో చావు అంచుల వరకూ వెళ్లాను. 8సార్లు రక్తం మార్చారు. సగం రక్తాన్ని కోల్పోయాను. మళ్లీ ఆరోగ్యవంతుడైనప్పుడే నేను గెలిచాను. నాకంటే సగం వయసున్న ఫైటర్‌తో 8 రౌండ్లు పోరాడి నిలబడటాన్ని నా బిడ్డలు చూశారు. నాకు అదే చాలు’ అని పేర్కొన్నారు.

ట్రంప్ ప్రభుత్వంలో <<14596564>>కీలక పదవి<<>> దక్కించుకున్న ఎలాన్ మస్క్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన అక్టోబర్‌లో రష్యా ప్రెసిడెంట్ పుతిన్, ఆ దేశ అధికారులతో అనధికారికంగా పలు ఒప్పందాలపై ఫోన్‌లో మాట్లాడినట్లు ఇద్దరు డెమొక్రటిక్ సెనేటర్లు ఆరోపించారు. ఈ క్రమంలో మస్క్‌పై జాతీయ భద్రతా కారణాలపై దర్యాప్తు చేయాలని లేఖ రాశారు. ఇలాంటి వ్యక్తికి GOVT ఎఫీషియెన్సీ బాధ్యతలు అప్పగించడం కరెక్టేనా అని ప్రశ్నించారు.

వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘మట్కా’ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. రూ.42కోట్లతో ఈ మూవీని రూపొందించగా, నెట్‌ఫ్లిక్స్ రూ.15కోట్లు చెల్లించినట్లు సమాచారం. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించారు. ఈనెల 14 రిలీజైన ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై ఫ్లాష్ బాంబుల దాడి కలకలం రేపింది. రెండు బాంబులు ఆయన ఇంటి గార్డెన్‌లో పడ్డట్లు రక్షణ మంత్రి కట్జ్ తెలిపారు. ఆ సమయంలో నెతన్యాహు, కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని వెల్లడించారు. దాడి వల్ల ఎలాంటి నష్టం జరగలేదని, ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. కాగా ఈ అటాక్ పని ఇరాన్‌దేనని భావిస్తున్నారు.

స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొస్తున్నాయి. తల్లిదండ్రులు చూసిన సంబంధం కీర్తికి నచ్చిందని, దీంతో డిసెంబర్‌లోనే వీరిద్దరికీ వివాహం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారని పింక్‌విల్లా తెలిపింది. కాగా, పెళ్లి కొడుకు బంధువేనని, గోవాలో సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో మ్యారేజ్ జరుగుతుందని వెల్లడించింది. దీనిపై కీర్తి టీమ్ త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది.

మధుమేహం ఉన్నవారు ఉదయం అల్పాహారం మానేయడం మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఉదయం ఏమీ తినకుండా మధ్యాహ్నం & రాత్రి మాత్రమే భోజనం చేయడంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు భారీగా పెరుగుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు. దీంతోపాటు అధిక HbA1C, ఇన్సులిన్ ప్రతిస్పందన బలహీనపడటం వంటివి జరుగుతాయన్నారు. కాబట్టి అల్పాహారం మానేయొద్దని సూచించారు. SHARE IT
Sorry, no posts matched your criteria.