News August 17, 2024

మహిళా కమిషన్ ఎదుట హాజరవుతా: కేటీఆర్

image

TG: ఈనెల 24న రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతానని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలపై జరిగిన అన్ని సంఘటనల వివరాలను తెలియజేస్తానన్నారు. ‘బహిరంగంగా క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా <<13870647>>నోటీసులిచ్చారు<<>>. నేను చట్టాన్ని గౌరవిస్తాను. మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యల్ని కూడా కమిషన్ దృష్టికి తీసుకెళ్తా’ అని చెప్పారు.

News August 17, 2024

మోదీతో చంద్రబాబు భేటీ

image

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అమరావతి పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాత్రి 7 గంటలకు సీబీఎన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ తర్వాత ఆర్థికమంత్రి నిర్మలతో సమావేశం కానున్నారు.

News August 17, 2024

స్కిల్ యూనివర్సిటీలో 20 కోర్సులు.. దసరా నుంచి కొన్ని ప్రారంభం!

image

TG: దసరా నుంచి స్కిల్ యూనివర్సిటీలో కోర్సులను ప్రారంభిస్తామని CS శాంతికుమారి తెలిపారు. 20 కోర్సులను గుర్తించామని, తొలుత స్కూల్ ఆఫ్ ఈ-కామర్స్, లాజిస్టిక్స్ రిటైల్ విభాగంలో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను అందుబాటులోకి తెస్తామన్నారు. దాదాపు 140 కంపెనీలు భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. ఇందులో చదివిన వారికి ఆకర్షణీయ వేతనంతో కూడిన ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యమివ్వాలని CS సూచించారు.

News August 17, 2024

ప్రభాస్ కొత్త సినిమాపై అప్‌డేట్

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమాపై నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేసింది. ‘ఆధిపత్యం కోసమే యుద్ధాలు జరుగుతున్న సమయంలో ఒక యోధుడు పోరాటానికి కొత్త అర్థం చెప్పాడు. 1940ల నాటి చారిత్రక ఫిక్షన్ కథ. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం’ అని ఈ సినిమాపై అప్‌డేట్ ఇచ్చింది. ఇవాళ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

News August 17, 2024

9,583 ఉద్యోగాల భర్తీ.. సవరణకు ఇవాళే లాస్ట్ డేట్

image

9,583 MTS & హవల్దార్ ఉద్యోగాల భర్తీ కోసం స్వీకరించిన దరఖాస్తుల్లో తప్పులు సరిచేసుకునే అవకాశం ఇవాళ రాత్రి 11.59 గంటలకు ముగియనుంది. <>SSC<<>> సైటులోనే అభ్యర్థులు మార్పులు చేర్పులు చేసుకోవాలని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 14 వరకు CBT విధానంలో హిందీ, ఇంగ్లిష్‌తో పాటు 13 స్థానిక భాషల్లో పరీక్షలు జరగనున్నాయి.

News August 17, 2024

ఏపీ క్యాబినెట్ భేటీ వాయిదా

image

AP: ఈ నెల 27న జరగాల్సిన క్యాబినెట్ సమావేశాన్ని 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆ రోజు ఉదయం 11 గంటలకు సమావేశం జరుగుతుందని తెలిపింది. 24వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలను సీఎస్ కార్యాలయం ఆదేశించింది.

News August 17, 2024

రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారు: కేటీఆర్

image

TG: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ‘రేవంత్ బీజేపీలో చేరుతారు. ప్రధాని మోదీతో ఆయన టచ్‌లో ఉన్నారు. బీజేపీలో మొదలైన తన ప్రస్థానం అక్కడే ముగుస్తుందని మోదీతో రేవంత్ చెప్పారు. నాకున్న ఢిల్లీ సోర్స్ ద్వారా వారి మధ్య సంభాషణ నాకు తెలిసింది. ఇది నిజమా? కాదా? అనేది రేవంత్ స్పష్టం చేయాలి’ అని మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్ వ్యాఖ్యానించారు.

News August 17, 2024

గోల్డ్ లోన్ల కోసం ఎగబడుతున్న జనం

image

పెరిగిన బంగారం ధరలు, రుణాల డిమాండుతో గోల్డ్ లోన్ కంపెనీలు ప్రయోజనం పొందుతున్నాయి. మే నెలతో పోలిస్తే జూన్‌లో గోల్డ్ లోన్ల డిమాండ్ 20% ఎగిసిందని క్రిసిల్ తెలిపింది. చివరి త్రైమాసికంతో పోలిస్తే జూన్‌లో రుణాల జారీ 12% పెరిగిందని వెల్లడించింది. ఒక కంపెనీని మినహాయిస్తే ఇండస్ట్రీ సగటు వృద్ధి 23% పైనే ఉందంది. రుణాల జారీలో NBFCలే ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయని, LTV నిష్పత్తి 60-65% అని పేర్కొంది.

News August 17, 2024

ఇంటింటికీ తిరిగి రుణమాఫీపై వివరాలు సేకరిస్తాం: KTR

image

TG: ఇంటింటికీ తిరిగి రుణమాఫీపై వివరాలు సేకరిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. పార్టీ నేతలతో భేటీ అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ‘రాష్ట్రంలో 60శాతం మందికి రుణమాఫీ కాలేదు. ఎల్లుండి నుంచి వివరాలు సేకరిస్తాం. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్‌ఛార్జిని నియమిస్తాం. కలెక్టర్లకు నివేదికలు సమర్పిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం’ అని చెప్పారు.

News August 17, 2024

BREAKING: పోలవరం కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం

image

AP: ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలో పలు ఫైళ్లు దగ్ధం అయ్యాయి. ఎడమ కాలువ భూసేకరణకు సంబంధించిన దస్త్రాలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. లబ్ధిదారుల పరిహారంలో అక్రమాలు బయటకు వస్తాయనే వీటిని కాల్చినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనలో పలువురు అధికారుల పాత్ర ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి దీనిపై విచారిస్తున్నారు.