News November 14, 2024

సీనరేజ్ మినహాయిస్తూ AP సర్కార్ నిర్ణయం

image

AP: అమరావతి చుట్టూ ORR, విజయవాడ ఈస్ట్ బైపాస్‌లకు చిన్నతరహా ఖనిజాలకు సీనరేజ్ మినహాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.6వేల కోట్లకు పైగా ఖర్చయ్యే 189కి.మీ ORR, 50కి.మీ. బైపాస్ కోసం భూసేకరణను NHAI, MORTH భరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్నికోరింది. దానికి ప్రత్యామ్నాయంగా పై నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఈ 2నిర్మాణాల కోసం స్టీల్, సిమెంట్, తదితరాలకు రాష్ట్ర GST మినహాయింపునకు ముందుకొచ్చింది.

News November 14, 2024

‘కంగువా’ మూవీ రివ్యూ & RATING

image

1000 ఏళ్ల క్రితం తన జాతి, ఓ పిల్లాడి తల్లికి ఇచ్చిన మాట కోసం హీరో చేసిన పోరాటమే కంగువా కథ. తన పర్ఫామెన్స్, యాక్షన్ సీన్లతో సూర్య మెప్పించారు. విజువల్స్ బాగున్నాయి. సినిమా స్థాయికి తగ్గట్లుగా బలమైన ఎమోషన్ సీన్లు లేకపోవడం మైనస్. మ్యూజిక్ బాగున్నా అక్కడక్కడ లౌడ్ BGM ఇబ్బంది కలిగిస్తుంది. ప్రస్తుతానికి, గత జన్మకు డైరెక్టర్ సరిగా లింక్ చేయలేకపోయారు. ఫస్టాఫ్ స్లోగా ఉంటుంది.
RATING: 2.25/5

News November 14, 2024

బ్రెజిల్ సుప్రీం కోర్టు వద్ద బాంబు పేలుళ్లు

image

బ్రెజిల్‌లో ఏకంగా సుప్రీం కోర్టును పేల్చేందుకు ఓ దుండగుడు యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. పేలుడు పదార్థాలతో వచ్చిన సూసైడ్ బాంబర్ ప్రవేశ ద్వారం వద్దే అవి పేలిపోవడంతో మరణించాడని అధికారులు తెలిపారు. అతడి వివరాలతో పాటు వెనుక ఎవరున్నారనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 18 నుంచి బ్రెజిల్‌లో జీ20 సదస్సు జరగనుండగా ఈ పేలుడు సంభవించడం చర్చనీయాంశంగా మారింది.

News November 14, 2024

కార్తీక మాసంలో ఉసిరిని ఎందుకు పూజిస్తారంటే..

image

మహావిష్ణువుకు ప్రతిరూపంగా భావించే ఉసిరిని కార్తీక మాసంలో పూజించి దాని వద్ద దీపం వెలిగిస్తే శివకేశవుల అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి. ఉసిరిలో విటమిన్-సి పుష్కలంగా లభిస్తుంది. ఎండ తక్కువగా ఉండే చలికాలంలో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉసిరి ఉపకరిస్తుందని శాస్త్రీయ వివరణ. కార్తీక వన భోజనాలు సైతం ఉసిరి చెట్ల నీడలో చేయాలని పెద్దలు పేర్కొనడం గమనార్హం.

News November 14, 2024

శ్రీవారికి రూ.2కోట్ల విలువైన వైజయంతీ మాల విరాళం

image

AP: తిరుమల శ్రీవారికి రూ.2 కోట్ల విలువైన స్వర్ణ వైజయంతీ మాలను టీటీడీ మాజీ ఛైర్మన్ డీకే ఆదికేశవులు మనవరాలు తేజస్వీ విరాళంగా అందించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చేతుల మీదుగా ఏడుకొండలవాడికి కానుకగా ఇచ్చారు. వజ్ర వైడూర్యాలు పొదిగిన ఈ మాలను ఉత్సవమూర్తులకు అలకరించనున్నారు. తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారికి కూడా మరో వైజయంతీమాలను ఆమె అందజేయనున్నారు.

News November 14, 2024

టీమ్ఇండియా బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా సచిన్?

image

BGT సిరీసుకు టీమ్ఇండియా బ్యాటింగ్ కన్సల్టెంటుగా లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను నియమించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ‘BGT2025కు బ్యాటింగ్ కన్సల్టెంటుగా సచిన్ సేవలను వాడుకుంటే భారత్‌కు బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నా’ అని మాజీ క్రికెటర్, కోచ్ WV రామన్ Xలో అన్నారు. NZ సిరీసులో 0-3తో వైట్‌వాష్ కావడంతో ఈ డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం సిరీసుల కోసం కన్సల్టెంట్లను నియమించుకోవడం కామన్‌గా మారింది.

News November 14, 2024

ప్రపంచవ్యాప్తంగా బాలల దినోత్సవాల తేదీలివే

image

అంతర్జాతీయంగా నవంబరు 20 బాలల దినోత్సవం కాగా.. వివిధ దేశాలు ఏటా వేర్వేరు తేదీల్లో ఈ వేడుక జరుపుతుంటాయి. USలో జూన్‌లో రెండో ఆదివారాన్ని చిల్డ్రన్స్ డేగా నిర్వహిస్తారు. UKలో మే రెండో ఆదివారం, రష్యా-చైనాలో జూన్ 1, మెక్సికోలో ఏప్రిల్ 30, జపాన్‌-దక్షిణ కొరియాలో మే 5, తుర్కియేలో ఏప్రిల్ 23, బ్రెజిల్‌లో అక్టోబరు 12, జర్మనీలో సెప్టెంబరు 20, థాయ్‌లాండ్‌లో జనవరిలో రెండో శనివారం చిల్డ్రన్స్ డే జరుగుతుంది.

News November 14, 2024

రఘురామకు విజయసాయిరెడ్డి విషెస్

image

AP: అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎంపికైన TDP MLA రఘురామకృష్ణరాజుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి Xలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ స్థానం గౌరవాన్ని కాపాడతారనే నమ్మకం ఉందన్నారు. గతం తాలూకూ జ్ఞాపకాలను వదిలేసి పైకి ఎదుగుతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 2019లో వైసీపీ ఎంపీగా గెలిచి ఆ పార్టీపైనే తీవ్ర విమర్శలు చేసిన RRRకు VSR విషెస్ తెలపడం చర్చనీయాంశంగా మారింది.

News November 14, 2024

RBI వడ్డీరేట్లను తగ్గించాల్సిందే: పీయూష్ గోయల్

image

వడ్డీరేట్ల తగ్గింపునకు ఆహార ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకోవడం లోపభూయిష్ఠమైన థియరీ అని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ‘ఇది నా పర్సనల్ ఒపీనియన్. ప్రభుత్వానిది కాదు. RBI కచ్చితంగా వడ్డీరేట్లను తగ్గించాల్సిందే. మోదీ హయాంలో ఇన్‌ఫ్లేషన్ స్వతంత్ర భారత చరిత్రలోనే అత్యంత తక్కువగా ఉంది’ అన్నారు. FIIల సెల్లింగ్‌పై మాట్లాడుతూ దీర్ఘకాల దృక్పథంతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని సూచించారు.

News November 14, 2024

శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

image

హైదరాబాద్ నిజాంపేటలోని శ్రీచైతన్య కాలేజీలో విషాదం నెలకొంది. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న జస్వంత్ గౌడ్ అనే విద్యార్థి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఉదయం తోటి విద్యార్థులు నిద్రలేచి చూసేసరికి జస్వంత్ విగతజీవిగా కనిపించాడు. దీంతో కాలేజీ యాజమాన్యానికి విద్యార్థులు సమాచారం అందించారు. మృతి చెందిన విద్యార్థి కామారెడ్డి జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు.