India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: వికారాబాద్ లగచర్ల ఘటనకు సంబంధించి పోలీస్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. మొత్తం 46 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. A-1గా భోగమోని సురేశ్ పేరు చేర్చారు. అధికారులపై హత్యాయత్నం జరిగిందని, విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని పేర్కొన్నారు. ముందుగానే కారం, రాళ్లు, కర్రలు సిద్ధం చేసుకున్నారని తెలిపారు.

కోలీవుడ్ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ మూవీపై అటవీ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిత్ర నిర్మాతలతోపాటు కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్, హిందుస్థాన్ మెషిన్ టూల్స్ జనరల్ మేనేజర్‌పై కూడా FIR నమోదైంది. ప్రస్తుతం ఈ విషయం శాండల్‌వుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా ‘టాక్సిక్’ షూటింగ్ కోసం మూవీ టీమ్ వందల ఎకరాల అటవీ భూముల్లో చెట్లను కొట్టివేసిందనే ఆరోపణలతో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఫిర్యాదు చేసింది.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు ఎస్ఐ శివరామయ్య టీమ్ ఇవాళ HYDలోని ఆర్జీవీ ఇంటికి చేరుకుని నోటీసులు అందించారు. ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్లలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ వ్యక్తిత్వాలు కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవీపై కేసు నమోదైంది.

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కనున్న స్పిరిట్ మూవీ గురించి టాలీవుడ్‌లో ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. ఆ సినిమాకు డైలాగ్స్ రాయాలంటూ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను సందీప్ అడిగారని సమాచారం. అందుకు పూరీ కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. పూరీ ప్రభాస్‌తో తీసిన బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాల్లో డైలాగ్స్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రా. 24 క్యారెట్ల పసిడి ధర రూ.440 తగ్గి రూ.76,850కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.400 తగ్గి రూ.70,450 పలుకుతోంది. అటు వెండి ధర రూ.1,000 పెరిగి రూ.1,01,000కు చేరింది.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోవాలని ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లీ అభిప్రాయపడ్డారు. వరుస వైఫల్యాల కారణంగా వారిపై ఒత్తిడి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘వారి ఫామ్ బాలేదు. జట్టు నుంచి ఇద్దరూ గ్యాప్ తీసుకోవాలి. క్రికెట్ నుంచి దూరంగా గడపాలి. సమస్యను గుర్తించి సరి చేసుకుని మళ్లీ ఫ్రెష్‌గా మొదలుపెట్టాలి. నేటికీ ఆ ఇద్దరూ అగ్రశ్రేణి బ్యాటర్లే’ అని పేర్కొన్నారు.

బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలు, అధికారులు జడ్జిలుగా మారి వ్యక్తులను దోషులుగా నిర్ధారించకూడదని, వారి ఆస్తులను ధ్వంసం చేయరాదని స్పష్టం చేసింది. ఒకవేళ నిజంగానే నేరనిరూపణ జరిగినా ఇళ్లను కూల్చకూడదని, అలా చేస్తే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నందుకు అధికారులు శిక్షార్హులవుతారని హెచ్చరించింది. పేదలు ఇళ్లు కట్టుకోవడానికి ఎన్నో ఏళ్లు కష్టపడతారని గుర్తుచేసింది.

TG: పోలీసుల అదుపులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. అక్రమ అరెస్ట్‌పై ఆందోళన చెందొద్దని, ధైర్యంగా పోరాడాలని కేటీఆర్ సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత నరేందర్ భార్య శ్రుతితో కూడా ఆయన ఫోన్‌లో మాట్లాడారు. కాగా లగచర్ల ఘటన ప్రధాన నిందితుడు సురేశ్ తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

AP: నటి శ్రీరెడ్డిపై రాజమహేంద్రవరం పోలీసులకు టీడీపీ మహిళా నాయకురాలు మజ్జి పద్మ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, హోంమంత్రి అనితపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు, శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలంటూ అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లోనూ తెలుగు మహిళ సభ్యులు ఫిర్యాదు చేశారు.

TG: ఆహారం బాలేదనో, వార్డెన్ల గురించో రెసిడెన్షియల్ విద్యార్థులు కంప్లైంట్ చేస్తుంటారు. కానీ, వరంగల్ జిల్లాలో తమకు ప్రభాస్ లాగా హెయిర్ స్టైల్ కావాలని అబ్బాయిలు, చీర కట్టుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని అమ్మాయిలు ఫిర్యాదుల బాక్సుల్లో లేఖలు వేశారు. భావాలను వ్యక్తపరచడం సరైందే అని, కానీ ఈ విద్యార్థుల అభ్యర్థనలు ఆసక్తికరంగా ఉన్నాయని ఓ అధికారి చెప్పారు. ఇదంతా సోషల్ మీడియా ప్రభావమే అని నిపుణులు అంటున్నారు.
Sorry, no posts matched your criteria.