India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఫౌజీ’ సినిమాలో తాను నటించట్లేదని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ స్పష్టం చేశారు. ‘ఫిల్మ్‌ఫేర్’ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌పై ఆమె కామెంట్ చేశారు. ఇందులో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతుండగా, ఈనెల 17న ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని సమాచారం.
జపాన్‌లో వెలుగు చూస్తున్న రాజకీయ కుంభకోణాలు, జీవన వ్యయాలు పెరగడంతో ప్రజల్లో వెల్లువెత్తిన అసంతృప్తికి జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా తలొగ్గారు. వచ్చే నెల పదవి నుంచి దిగిపోనున్నట్టు ప్రకటించారు. ప్రజల విశ్వాసం లేకుండా రాజకీయాలు నడవలేవని, రాజకీయ సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతో ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం అందించే ప్రెసిడెంట్ మెడల్‌కు తెలంగాణ నుంచి 11 మంది పోలీసులు ఎంపికయ్యారు. ఇందులో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతితో పాటు జమీల్ భాషా (కమాండెంట్), క్రిష్ణమూర్తి (ASP), నూతలపాటి జ్ఞానసుందరి (ఇన్‌స్పెక్టర్), కొమరబత్తిని రాము (SI), అబ్దుల్ రఫీక్ (SI), ఇక్రమ్ ఏబీ ఖాన్ (SI), శ్రీనివాస మిశ్రా (SI), కుంచల బాలకాశయ్య (SI), లక్ష్మయ్య (ASI), గుంటి వెంకటేశ్వర్లు (ASI) ఉన్నారు.
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన యావత్ సమాజం తలదించుకునేలా చేసింది. అయితే దానిపై సాజిత్ కుమార్ అనే కార్టూనిస్ట్ గీసిన కార్టూన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో పేషెంట్ పేరు ఇండియన్ మేల్ అని రాసి ఉంది. ప్రిస్క్రిప్షన్‌లో ‘వాళ్లను బుద్ధిగా పెంచండి’ అని డాక్టర్ సూచించినట్లు ఉంది. కాగా డాక్టర్ సంతకం పెట్టాల్సిన ప్రదేశంలో రక్తపు మరకలు ఉండటం మనసులను కదిలిస్తోంది. దీనిపై మీ కామెంట్?
రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్ గాయపడినట్లు వస్తోన్న వార్తలను ఆయన టీమ్ ఖండించింది. కొన్ని రోజుల క్రితం జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా ఆయన ఎడమ చేతి మణికట్టు బెణికినట్లు తెలిపింది. పెద్ద ప్రమాదం జరగలేదని తెలియజేస్తూ చేతికి కట్టు ఉన్న ఫొటోను షేర్ చేసింది. గాయంతోనే ఆయన ‘దేవర-1’లోని తన పాత్ర షూట్‌ను కంప్లీట్ చేసినట్లు తెలిపింది. రెండు వారాలపాటు రెస్ట్ తీసుకుంటారని చెప్పింది.
‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. రేపు విడుదల కానున్న ఈ మూవీకి టికెట్ రేట్లను రూ.35కు పైగా పెంచుకునేందుకు అనుమతిస్తూ ఏపీ సర్కారు జీవో విడుదల చేసింది. పూరీ జగన్నాథ్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో తెలిపింది. రిలీజ్ రోజు నుంచి 10 రోజుల వరకు ఈ రేట్లు ఉండనున్నాయి.
ఐసీసీ మెన్స్ వన్డే ర్యాంకింగ్స్ ప్రకటించింది. తాజా జాబితాలో బాబర్ ఆజమ్(పాక్) మొదటి స్థానాన్ని పదిలపరుచుకున్నారు. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని రెండో స్థానానికి ఎగబాకారు. ఆ తర్వాతి స్థానాల్లో గిల్, కోహ్లీ, టెక్టర్(ఐర్లాండ్), మిచెల్(NZ), వార్నర్(AUS), నిస్సాంక(SL), మలన్(ENG), డస్సెన్(SA) ఉన్నారు. టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ తొలి స్థానంలో ఉంది.
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ కెన్యా జట్టుకు కోచ్‌గా ఎంపికయ్యారు. త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారు. భారత్ తరఫున ఆయన 4 టెస్టులు, ఒక వన్డే ఆడారు. 2000 రన్స్, 365 వికెట్లతో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సక్సెస్ అయ్యారు. కెన్యా కోచ్‌గా ఎంపికైనందుకు హ్యాపీగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. భారతీయులను కోచ్‌గా పెట్టుకోవడం కెన్యాకు కొత్తేం కాదు. సందీప్ పాటిల్ కోచింగులో 2003 ODI వరల్డ్ కప్ సెమీస్‌కు చేరింది.
AP: ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మేయర్ సుజాతతో పాటు 17 మంది కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. నాయుడుపాలెంలో MLA దామచర్ల జనార్దన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ వశమైంది.
బ్రిటన్ పాలన నుంచి విముక్తి పొందిన సందర్భంగా మన దేశం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటోంది. కానీ పంద్రాగస్టున ఇండిపెండెన్స్ డే చేసుకునే దేశాలు ఇంకా ఉన్నాయి. దక్షిణ కొరియా, ఉత్తర కొరియా 1945లో జపాన్ నుంచి స్వేచ్ఛను పొందాయి. ఇక బ్రిటిష్ నుంచి బహ్రెయిన్‌కు, ఫ్రాన్స్ నుంచి రిపబ్లిక్ ఆఫ్ కాంగో, జర్మనీ నుంచి లీచెన్‌స్టైన్‌కు కూడా ఆగస్టు 15నే స్వాతంత్ర్యం లభించింది.
Sorry, no posts matched your criteria.