News March 17, 2024

సీఎం జగన్‌కు గుణపాఠం నేర్పాలి: సత్యకుమార్

image

AP: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సీఎం జగన్‌కు రాష్ట్ర ప్రజలు గుణపాఠం నేర్పాలని బీజేపీ నేత సత్యకుమార్ అన్నారు. ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సభ.. గొడ్డలిపోటు వేసినవారికి గుండెపోటు తెప్పించాలి’ అని తెలిపారు. ‘వైసీపీ పాలన అవినీతిమయం. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారింది. రాష్ట్రాన్ని సీఎం జగన్ అప్పుల్లో ముంచారు. ప్రజాగళం సభ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తుంది’ అని సోమువీర్రాజు మాట్లాడారు.

News March 17, 2024

సీఎం జగన్ దుర్మార్గుడు: చంద్రబాబు

image

AP: అమరావతిని సీఎం జగన్ నాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. మూడు ముక్కలాటతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. ‘కేంద్ర సహకారంలో మేము 70 శాతం పోలవరం పూర్తి చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టును గోదావరిలో కలిపేసింది. లాండ్, శాండ్, మైన్, వైన్స్ పేరుతో దోచేశారు. జే బ్రాండ్ లిక్కర్ ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టి తన ఆదాయాన్ని పెంచుకున్న దుర్మార్గుడు జగన్’ అని మండిపడ్డారు.

News March 17, 2024

జెండాలు వేరైనా.. మా అజెండా ఒక్కటే: చంద్రబాబు

image

AP: జెండాలు వేరైనా.. టీడీపీ, జనసేన, బీజేపీ అజెండా ఒక్కటేనని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభలో వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమే. ఐదేళ్లలో విధ్వంస, అహంకార, అవినీతి పాలనతో ప్రజల జీవితాలు నాశనమయ్యాయి. ఎన్నికల్లో మీరిచ్చే తీర్పే రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే మా అజెండా’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

News March 17, 2024

సీఎం జగన్ సారా వ్యాపారి: పవన్

image

AP: రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. బొప్పూడి సభలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో రావణ సంహారం జరుగుతుంది. రామరాజ్య స్థాపన జరుగుతుంది. సీఎం జగన్ ఒక సారా వ్యాపారి. బ్లాక్ మనీ పెరిగిపోయింది. డబ్బు అండ చూసుకుని ఏదైనా చేయగలనని జగన్ అనుకుంటున్నారు. కానీ అదేమీ జరగదు’ అని స్పష్టం చేశారు.

News March 17, 2024

ఇసుకలో జగన్ రూ.40వేల కోట్ల స్కామ్: పవన్

image

AP: ఇసుక తవ్వకాలతో సీఎం జగన్ బినామీలు రూ.40వేల కోట్లు దోచేశారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. దీనిపై ప్రశ్నించిన జర్నలిస్టును చంపేశారని ఆరోపించారు. ‘రాష్ట్రం డ్రగ్స్‌కు రాజధాని అయిపోయింది. ఇక్కడ 30వేల మందికిపైగా మహిళలు అదృశ్యమయ్యారు. దీనిపై ప్రభుత్వం ఒక్కసారీ స్పందించలేదు. రాష్ట్రం నుంచి కంపెనీలు తరలిపోతున్నాయి. పారిశ్రామిక ప్రగతి దిగజారిపోయింది’ అని ఆరోపించారు.

News March 17, 2024

8th ఫెయిలయ్యా.. నాన్న ఏడ్చారు: మాధవన్

image

నటుడు మాధవన్ పలు ఆసక్తికర విషయాలను ఓ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. ‘‘నేను మెరిట్ స్టూడెంట్ కాదు. 8వ తరగతిలో గణితంలో ఫెయిల్ అయ్యాను. కానీ, నేను టాటా స్టీల్స్‌లో జాబ్ కొట్టి, పెళ్లి చేసుకొని మా నాన్న ఉన్న ఇంట్లోనే ఉండాలని మా పేరెంట్స్ కోరిక. ఓ ఇంజినీరింగ్‌ కాలేజీ నా అప్లికేషన్‌‌ను రిజెక్ట్ చేసినప్పుడు ‘నేను నీకేం తక్కువ చేశాను’ అని మా నాన్న నాతో కన్నీళ్లు పెట్టుకున్నారు’’ అని చెప్పుకొచ్చారు.

News March 17, 2024

మోదీ రాక కోసం ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూశారు: పవన్

image

AP: రాష్ట్రంలో దుష్టపాలన అంతం కాబోతోందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. అభివృద్ధి లేక, అవినీతి, అరాచక పాలనతో కొట్టుమిట్టాడుతోన్న రాష్ట్రానికి అండగా నిలిచేందుకు వచ్చిన మోదీకి స్వాగతం పలుకుతున్నామన్నారు. మోదీ రాక కోసం ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూశారని పేర్కొన్నారు. తమ కూటమికి దుర్గమ్మ ఆశీస్సులు ఉన్నాయని తెలిపారు. మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని జోస్యం చెప్పారు.

News March 17, 2024

PHOTO: ఒకే ఫ్రేమ్‌లో మోదీ, చంద్రబాబు, పవన్

image

AP: చిలకలూరిపేట బొప్పూడిలో టీడీపీ-బీజేపీ-జనసేన నిర్వహిస్తోన్న సభా వేదికపైకి ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత వీరంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు.

News March 17, 2024

BIG ALERT.. పరీక్ష తేదీలు మార్పు?

image

ఏపీ ఈఏపీసెట్ తేదీల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మే 13 నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే మే 13న ఏపీ, తెలంగాణలో ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో షెడ్యూల్‌పై సందిగ్ధం నెలకొంది. త్వరలోనే కొత్త తేదీలను అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. అటు ప్రస్తుతం EAPCET దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుండగా.. ఏప్రిల్ 15 వరకు చేసుకోవచ్చు.

News March 17, 2024

ఒక సంస్థ నుంచే DMKకి ₹509 కోట్ల విలువైన బాండ్లు

image

ఎలక్టోరల్‌ బాండ్ల విషయంలో ‘ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీస్‌’ పేరు అందరినీ ఆకర్షించింది. ఆ సంస్థ అత్యధికంగా ₹1,368 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ కంపెనీ కొనుగోలు చేసిన బాండ్ల మొత్తంలో ₹509 కోట్లు తమిళనాడు CM స్టాలిన్ నేతృత్వంలోని DMK పార్టీ ఖాతాలోకి చేరడం విశేషం. ఈ విషయాన్ని EC తాజాగా వెల్లడించింది. ఒక పార్టీకి ఇంతపెద్ద మొత్తంలో బాండ్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.