News March 17, 2024

BREAKING: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కీలక ఆదేశాలు

image

AP: రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రకటనల హోర్డింగ్‌లు, కటౌట్లను వెంటనే తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు డెడ్‌లైన్ విధించారు. ఆలోపు సచివాలయ పరిసరాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లోని ప్రచార హోర్డింగ్‌లు, కటౌట్లను తొలగించాలన్నారు. షెడ్యూల్ విడుదల కావడంతో నిన్నటి నుంచే రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది.

News March 17, 2024

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బీఆర్ఎస్ 100 ప్రశ్నలు

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో వంద తప్పులు చేసిందని బీఆర్ఎస్ విమర్శించింది. ‘రూ.2 లక్షల రుణమాఫీ ఏమైంది? రైతుభరోసా కింద రూ.15 వేలు ఇంకెప్పుడు? రైతుబంధును సీరియల్‌‌లాగా ఎంతకాలం సాగదీస్తారు? వరి పంటకు ఇస్తామన్న రూ.500 బోనస్ ఏమైంది? 200 యూనిట్లు దాటితే మొత్తం కరెంట్ బిల్లు ఎందుకు కట్టాలి? దళితబంధు పథకాన్ని అర్ధాంతరంగా ఎందుకు నిలిపివేశారు?’ అంటూ 100 ప్రశ్నలు Xలో పోస్ట్ చేసింది.

News March 17, 2024

కవితను ప్రశ్నిస్తున్న ఈడీ

image

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ తొలిరోజు కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. ఈడీ జాయింట్ డైరెక్టర్ భాను ప్రియ మీనా, అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్ నేతృత్వంలో రెండు బృందాలు ఆమెను విచారిస్తున్నాయి. సా.5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. రేపు విజయ్ నాయర్, పిళ్లైతో కలిపి ఆమెను విచారిస్తారని సమాచారం.

News March 17, 2024

BRSలో చేరతారా? కొత్త పార్టీ పెడతారా?

image

BRSతో పొత్తు రద్దుతో BSPకి RS ప్రవీణ్‌కుమార్ వీడ్కోలు పలికారు. బహుజనుల కోసం తాను KCRతో కలిసి నడుస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన BRSలో చేరతారనే వార్తలు వస్తున్నాయి. ఇంకొందరు మాత్రం గతంలో KCRను తీవ్రంగా విమర్శించి, ఇప్పుడు BRSలో చేరితే ప్రవీణ్‌కుమార్‌పై మరింత వ్యతిరేకత వస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన బహుజనుల కోసం కొత్త పార్టీ పెట్టడం ఉత్తమమని కొందరంటున్నారు. దీనిపై మీ కామెంట్?

News March 17, 2024

IPL: ముంబైకి షాక్?

image

ముంబై ఇండియన్స్ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు బౌలర్ దిల్షాన్ మధుశంక గాయపడ్డారు. అతని గాయంపై శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా అతని మోకాలికి గాయమైందని పేర్కొంది. దీంతో అతడు SL జట్టుకు దూరమయ్యారు. మరో 5 రోజుల్లోనే ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కానుండగా, MI ఆడే ప్రారంభ మ్యాచులకు అతను అందుబాటులో ఉండకపోవచ్చని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.

News March 17, 2024

రాష్ట్రంలో విపరీతంగా పెరగబోతున్న దిగజారుడు రాజకీయాలు: YCP

image

AP: ఇవాళ జరగబోయే ‘ప్రజాగళం’ సభపై వైసీపీ సెటైర్లు వేసింది. ‘ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకు ఏపీలో విపరీతంగా పెరగబోతున్న దిగజారుడు రాజకీయాలు’ అని ట్వీట్ చేసింది. దీనికి గతంలో చంద్రబాబు ప్రధానిని విమర్శిస్తూ చేసిన ట్వీట్‌ను ట్యాగ్ చేసింది. కాగా సాయంత్రం టీడీపీ-బీజేపీ-జనసేన సంయుక్తంగా ‘ప్రజాగళం’ సభ నిర్వహించనున్నాయి. దీనికి ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు, పవన్ హాజరవుతారు.

News March 17, 2024

పాకిస్థాన్ హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం

image

పాక్ నుంచి వచ్చిన 18మంది హిందూ శరణార్థులకు గుజరాత్ ప్రభుత్వం భారత పౌరసత్వం ఇచ్చింది. వారంతా కొన్నేళ్లుగా అహ్మదాబాద్‌లో ఉంటున్నారు. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే మైనారిటీ వర్గాల ప్రజలకు భారత పౌరసత్వం మంజూరు చేసే అధికారాన్ని అహ్మదాబాద్, గాంధీనగర్, కచ్ జిల్లా కలెక్టర్లకు గతంలోనే కేంద్రం అప్పగించింది. ఇప్పటివరకు అహ్మదాబాద్‌లో 1,167 మంది హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం లభించింది.

News March 17, 2024

‘OG’ గ్లింప్స్‌పై అప్డేట్ ఇచ్చిన ఇమ్రాన్ హష్మీ

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తోన్న ‘OG’ సినిమా గ్లింప్స్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేయగా.. తాజాగా మూవీలో కీలక పాత్రలో నటిస్తోన్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ గ్లింప్స్ గురించి అప్డేట్ ఇచ్చారు. తన రోల్ గురించి ఓ నెటిజన్ అడగ్గా.. ‘నేను దీని గురించి ఏమీ చెప్పను. త్వరలోనే గ్లింప్స్ వీడియో రాబోతోంది’ అని రిప్లై ఇచ్చారు.

News March 17, 2024

కవితకు ఎన్నేళ్ల జైలుశిక్ష పడవచ్చంటే?

image

TG: ఎమ్మెల్సీ కవితపై ఈడీ PMLA(ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్) కింద కేసు నమోదు చేసింది. అయితే ఈ PMLA కేసులో నేరం రుజువైతే కనీసం 3 ఏళ్ల నుంచి 7ఏళ్ల వరకూ కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది. దీంతో పాటు రూ.5లక్షల వరకు జరిమానా ఉంటుంది. ఒకవేళ ఇదే జరిగితే ఆమె ఎమ్మెల్సీ పదవి కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. PMLA చట్టాన్ని NDA ప్రభుత్వం 2002లో రూపొందించింది.

News March 17, 2024

టెన్త్ పరీక్షలపై విద్యాశాఖ కీలక నిర్ణయం

image

TG: రేపటి నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానుండగా, కాపీయింగ్ నివారణకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రాలు ఇవ్వగానే ప్రతి పేజీపై విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ రాయాలని తెలిపింది. ఇలా చేస్తే ప్రశ్నపత్రాలు తారుమారు కాకుండా ఉంటాయని పేర్కొంది. కాపీయింగ్‌కు పాల్పడిన వారిని డిబార్ చేస్తామని, ఇందులో సిబ్బంది పాత్ర ఉంటే యాక్ట్-25, 1997 సీసీఏ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.