India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రిలీజ్ వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ప్రకటించిన మే 9న ఈ సినిమాను విడుదల చేయటం లేదని సమాచారం. మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు టాక్. ఎన్నికలకు 4 రోజుల ముందుగా విడుదల చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ కలెక్షన్లపై ప్రభావం చూపుతుందని వారు భావిస్తున్నట్లు టాక్.
AP: రాష్ట్రంలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు 6,23,092 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరితో పాటు గతేడాది ఫెయిలైన దాదాపు లక్ష మంది విద్యార్థులు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ రాయనున్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12జ30 గంటల వరకు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,473 పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
AP: పుట్టపర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి తిరిగి వైసీపీ టికెట్ దక్కడంతో ఓ వ్యక్తి అరగుండు కొట్టించుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో శ్రీధర్ రెడ్డికి వైసీపీ టికెట్ వస్తే అరగుండు కొట్టించుకుంటానని గతంలో సజ్జల మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి సవాల్ విసిరాడు. తాజాగా సీఎం జగన్ ప్రకటించిన వైసీపీ జాబితాలో శ్రీధర్ రెడ్డికి చోటు దక్కింది. దీంతో మహేశ్వర్ రెడ్డి సత్యమ్మ దేవాలయం వద్ద అరగుండు చేయించుకున్నాడు.
WPLలో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లూ తొలిసారి టైటిల్‌ను ముద్దాడాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఆర్సీబీ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. అలాగే ఢిల్లీకి రెండోసారి. ఎవరు గెలిచినా చరిత్ర సృష్టించనున్నారు.
తనకు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే క్రష్ అని సమంత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నాకు అల్లు అర్జున్ అంటే క్రష్ ఉంది. ఇక బాలీవుడ్‌లో షారుఖ్ అంటే చాలా గౌరవం. నేను నటిగా ప్రయాణం మొదలుపెట్టి 14ఏళ్లు అయింది. బిజీ కారణంగా ఒక్కోసారి 5గంటలే పడుకునేదాన్ని. నా శరీరానికి తగినంత విశ్రాంతిని ఇవ్వలేదు. హెల్త్ బాగోక నటిగా నంబర్ వన్ స్థానంలో ఉన్న క్షణాలను ఎక్కువ ఆస్వాదించలేకపోయాను’ అని వెల్లడించారు.
ఐపీఎల్ 17వ సీజన్ మొత్తం భారత్‌లోనే జరుగుతుందని బీసీసీఐ సెక్రెటరీ జైషా స్పష్టం చేశారు. త్వరలోనే సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఐపీఎల్ నిర్వహణపై వచ్చే వదంతులను నమ్మొద్దని ఆయన సూచించారు. కాగా ఏప్రిల్‌లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఐపీఎల్ విదేశాల్లో నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. రెండో దశ షెడ్యూల్ మొత్తం UAEలో జరుగుతుందని వార్తలు వచ్చాయి.
గుజరాత్ టైటాన్స్‌కు మరో షాక్ తగిలింది. ఆ జట్టు యువ వికెట్ కీపర్ రాబిన్ మింజ్ ఈ ఏడాది IPL మొత్తానికి దూరమయ్యారు. ఇటీవల బైక్ ప్రమాదంలో గాయపడ్డ అతడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరికొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ సీజన్ మొత్తానికి మింజ్ దూరమైనట్లు కోచ్ ఆశిశ్ నెహ్రా తెలిపారు. కాగా IPL-2024 మినీ వేలంలో అతణ్ని రూ.3.60 కోట్ల భారీ ధరకు GT కొనుగోలు చేసింది.
ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ముంబైలో ముగిసింది. ఈ సందర్భంగా సెంట్రల్ ముంబైలోని బీఆర్ అంబేడ్కర్ చిహ్నం వద్ద రాహుల్ రాజ్యాంగ పీఠికను చదివారు. రేపు ఇండియా కూటమి ఆధ్వర్యంలో ముంబైలో భారీ బహిరంగ సభ జరగనుంది. కాగా 63 రోజుల పాటు 6700 కి.మీ మేర రాహుల్ యాత్ర చేపట్టారు. మొత్తం దేశంలోని 110 జిల్లాల్లో ఈ యాత్ర కొనసాగించారు.
TS: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ ఏడు రోజుల కస్టడీ విధించింది. దీంతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. వీరితోపాటు ప్రశాంత్ రెడ్డి జీవన్ రెడ్డి జాన్సన్ నాయక్ కూడా హస్తినకు వెళ్లనున్నారు. వీరందరూ కవితను కలవనున్నారు. కాగా కవిత అరెస్ట్‌పై ఆమె తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటివరకూ స్పందించలేదు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ నుంచి ఫామ్‌హౌజ్‌కు వెళ్లిపోయినట్లు సమాచారం.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Sorry, no posts matched your criteria.