News August 12, 2024

దూసుకెళ్తున్న ఓలా షేర్లు

image

గత వారం మార్కెట్‌లో ఫ్లాట్‌గా లిస్ట్ అయిన ఓలా ఎలక్ట్రిక్ షేర్లు అదరగొడుతున్నాయి. షేర్‌ను రూ.72 నుంచి రూ.76 మధ్య లిస్ట్ చేయగా, రెండు రోజుల్లోనే 44 శాతం పెరిగాయి. BSEలో ఈరోజు 109.44 మార్కును తాకాయి. ఓలా మొత్తం మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.48,250 కోట్లకు చేరింది. జూన్ త్రైమాసిక సంపాదన వివరాలు ఈ నెల 14న వెల్లడించనున్నట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఓలా తెలిపింది.

News August 12, 2024

DSC పరీక్షల ’కీ‘ కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు

image

TG: 11,062 టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నిర్వహించిన DSC పరీక్షలు ముగిసి వారం అవుతున్నా ఇంకా ప్రాథమిక కీ విడుదల కాలేదు. దీనిపై విద్యాశాఖ నుంచి స్పందన లేకపోవడంతో త్వరగా కీ విడుదల చేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే 1:3 చొప్పున సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ నెలాఖరులోగా ఫలితాలను విడుదల చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

News August 12, 2024

మరోసారి టాప్‌లో ఐఐటీ మద్రాస్

image

దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా ఐఐటీ మద్రాస్(అన్ని విభాగాలు) నిలిచింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమింగ్(NIRF) జాబితాను విడుదల చేశారు. మేనేజ్మెంట్ కేటగిరీలో IIM అహ్మదాబాద్, ఇంజినీరింగ్‌లో IIT మద్రాస్, ఫార్మసీలో జమియా హమ్దార్ద్ తొలి స్థానంలో నిలిచాయి. ప్రస్తుతం ఉన్న 13 కేటగిరీలకు అదనంగా మరో మూడింటిని చేర్చి కేంద్రం ఈ ర్యాంకుల్ని ప్రకటించింది.

News August 12, 2024

బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి మంచిదేనా?

image

పాలు, చక్కెర లేని కాఫీని బ్లాక్ కాఫీ అంటారు. అది ఆరోగ్యానికి మంచిదేనా? అంటే పరిమితంగా తీసుకుంటే చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. తక్కువ క్యాలరీలు, పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో హృద్రోగాలు, మధుమేహం వంటి వాటి ముప్పును తగ్గించే అవకాశం ఉందంటున్నారు. లివర్ ఆరోగ్యానికి, శరీర మెటబాలిజం మరింత వేగవంతమయ్యేందుకు ఉపకరిస్తుందని వివరిస్తున్నారు.

News August 12, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40కి.మీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News August 12, 2024

Stock Market: స్వ‌ల్ప న‌ష్టాలు

image

సెబీ చీఫ్ మాధ‌బిపై హిండెన్‌బ‌ర్గ్ చేసిన‌ ఆరోప‌ణ‌లు స్టాక్‌ మార్కెట్ల‌పై ఎలాంటి ప్ర‌భావాన్ని చూప‌లేక‌పోయాయి. దేశీ సూచీలు ఆరంభంలో న‌ష్టాల‌తో ప్రారంభ‌మైనా మిడ్ సెష‌న్‌లో లాభాల బాట‌ప‌ట్టాయి. అయితే, సెన్సెక్స్ 80,100 వ‌ద్ద‌, నిఫ్టీ 24,500 పాయింట్ల వ‌ద్ద బ‌ల‌మైన రెసిస్టెంట్స్ ఎదుర్కోవడంతో బుల్ జోరు సాగ‌లేదు. దీంతో, ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి సెన్సెక్స్ 56, నిఫ్టీ 20 పాయింట్లు న‌ష్ట‌పోయాయి.

News August 12, 2024

తగ్గిన వరద.. సాగర్ ప్రాజెక్టు గేట్లు మూసివేత

image

కృష్ణా పరీవాహకంలో ప్రాజెక్టులకు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. నాగార్జున సాగర్ జలాశయానికి వరద తగ్గడంతో అధికారులు క్రస్ట్ గేట్లను మూసివేశారు. గత కొన్ని రోజులుగా భారీగా ప్రవాహం రావడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రస్తుతం 305 టీఎంసీలకు పైగా నీటి నిల్వ ఉంది.

News August 12, 2024

మాటల యుద్ధం మళ్లీ మొదలు (1/1)

image

2024 సార్వత్రిక ఎన్నిక‌ల తరువాత నీట్ పేపర్ లీకేజీ, కేంద్ర బ‌డ్జెట్‌, వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లు వంటి అంశాల‌పై ఎన్డీయే – ఇండియా కూట‌ముల మ‌ధ్య ఇప్ప‌టికే మాట‌ల యుద్ధం నడిచింది. తాజాగా సెబీ చీఫ్ మాధ‌బిపై హిండెన్‌బ‌ర్గ్ చేసిన ఆరోప‌ణ‌లతో అధికార, విపక్షాలు మరోసారి తిట్టిపోసుకుంటున్నాయి. అదానీ విషయంలో కాంప్రమైజ్ అయ్యారంటూ కాంగ్రెస్, ద్వేషం నింపుతున్నారంటూ BJP బిగ్ ఫైట్‌కి దిగాయి.

News August 12, 2024

కాంగ్రెస్ – బీజేపీ మాటల యుద్ధం (2/2)

image

గ‌తంలో అదానీపై వ‌చ్చిన ఆరోప‌ణ‌లపై సెబీ నిష్పాక్షిక‌ విచార‌ణ జ‌ర‌పలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మ్యాచ్‌లో అంపైర్ కాంప్రమైజ్ అయ్యారంటూ సెబీ చీఫ్ మాధ‌వీపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ఉటంకిస్తూ BJPని టార్గెట్ చేసింది. అయితే, ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కూల్చ‌డానికి కాంగ్రెస్, దాని టూల్ కిట్ మిత్ర‌ప‌క్షాలు విదేశీ సాయం తీసుకుంటున్నాయని BJP తిప్పికొడుతోంది.

News August 12, 2024

‘అవయవదానం’ ప్రతిజ్ఞ చేసిన సజ్జనార్

image

రేపు అంతర్జాతీయ అవయవదాన దినోత్సవం. ఈ సందర్భంగా ఎల్‌బీ నగర్‌లో జరిగిన ‘Organ Donation Pledge Drive’లో TGSRTC ఎండీ సజ్జనార్ పాల్గొని అవయవదానం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ప్రాణం పోయినా మరికొందరిని బతికించగలిగే మ‌హోత్త‌ర కార్యక్రమం ఇదని, ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎంతో మంది అవయవాలు దొరక్క ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. మీరూ ప్రతిజ్ఞ చేయాలనుకుంటే ‘<>జీవన్‌దాన్’<<>>లో రిజిస్టర్ అవ్వండి.