India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత స్టాక్ మార్కెట్ల విశ్వసనీయతపై <<13830742>>రాహుల్ గాంధీ<<>> అనుమాన బీజాలు నాటుతున్నారని BJP నేత అమిత్ మాలవీయ విమర్శించారు. మన ఎకానమీపై నమ్మకాన్ని చెడగొట్టేందుకు ఇది ఆయన చేస్తున్న ప్రయత్నమని మండిపడ్డారు. ఇది భారత్‌ను నాశనం చేయడమేనని చెప్పారు. అదానీ షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచలేదని సుప్రీంకోర్టు కమిటీ స్పష్టం చేసిందన్నారు. నిబంధనల్ని సెబీ ఉల్లంఘించలేదని CJI చంద్రచూడ్ ధర్మాసనమే చెప్పినట్టు పేర్కొన్నారు.
అదానీ, సెబీ చీఫ్ మాధబీపై హిండెన్‌బర్గ్ ఆరోపణల ప్రభావం మార్కెట్లపై కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అదానీ స్టాక్స్ 7శాతానికి పైగా నష్టపోవడంతో రూ.53వేల కోట్ల సంపద ఆవిరైంది. BSEలోని అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్ ధర రూ.1656కు పడిపోయింది. అదానీ పవర్ 4%, విల్‌మర్, ఎనర్జీ సొల్యూషన్స్, ఎంటర్‌ప్రైజెస్ 3% చొప్పున నష్టాలను చవిచూస్తున్నాయి. నిఫ్టీలోని అదానీ పోర్ట్స్ 2% డౌన్ ఫాల్ అయింది.
ఇరాన్ తమపై ప్రత్యక్ష యుద్ధానికి సన్నద్ధమవుతోందని ఇజ్రాయెల్ తాజాగా అనుమానాలు వ్యక్తం చేసింది. తమ నిఘా వర్గాలకు దీనిపై సమాచారం ఉందని పేర్కొంది. మరికొన్ని రోజుల్లోనే ఈ యుద్ధం మొదలవుతుందని తెలిపింది. హమాస్ నేత ఇస్మాయిల్ హనియేను టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ చంపించిందని ఇరాన్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దానికి ప్రతీకారంగానే ఇప్పుడు ఆ దేశం దాడికి దిగుతోందని ఇజ్రాయెల్ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
శ్రీలంకతో ODI సిరీస్‌లో భారత్ ఓడిపోవడంపై వ్యంగ్యంగా స్పందించిన మైఖేల్ వాన్‌కు వసీమ్ జాఫర్ అదిరిపోయే కౌంటరిచ్చారు. ‘హాయ్ వసీమ్.. శ్రీలంకతో ODI సిరీస్ రిజల్ట్ ఏమైంది? నేను మ్యాచ్‌లు చూడలేదు. అంతా బాగుందనుకుంటున్నా’ అని వాన్ ట్వీట్ చేశారు. దీనికి జాఫర్ స్పందిస్తూ.. ‘మీకు యాషెస్ సిరీస్ గుర్తు చేస్తున్నా. 12ఏళ్లలో ఆసీస్‌లో ENG గెలిచిన టెస్టుల కంటే ఎక్కువ సిరీస్‌లను IND గెలిచింది’ అని పేర్కొన్నారు.
TG: మనుషులు, ముఖ్యంగా మహిళలు చెవి కమ్మలు పెట్టుకోవడం సాధారణం. కానీ కోడి పుంజు చెవి కమ్మలు ధరించడం ఎక్కడైనా చూశారా? నిన్న మహబూబాబాద్(D) కేసముద్రంలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కోడిపుంజుకు బంగారు చెవి కమ్మలు కుట్టించాడు. ముత్యాలమ్మ తల్లి బోనాల సందర్భంగా కోడికి చెవికమ్మలు పెట్టి ఊరేగించాడు. అనంతరం మొక్కులు చెల్లించాడు. జాతరలో ఈ కోడి అందరి దృష్టిని ఆకర్షించింది. పలువురు కోడితో ఫొటోలు తీసుకున్నారు.
AP: దివ్వెల మాధురి సూసైడ్ <<13829134>>అటెంప్ట్<<>> డ్రామా కాదని YCP MLC దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. ‘వ్యక్తిత్వ హననం జరుగుతోందని ఆమె డీప్ డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఈక్రమంలోనే వెళ్లి కారును ఢీకొట్టింది. గతంలోనూ ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు నేను కాపాడి ధైర్యం చెప్పాను. ఇప్పుడున్న డిప్రెషన్ మూడ్ ఆమెను ఆత్మహత్యాయత్నానికి పురిగొల్పింది. ఇదంతా డ్రామా అని కొందరు అంటున్నారు. కానీ కాదు’ అని వెల్లడించారు.
దేశంలో ఏనుగులు వృద్ధి చెందడానికి అనుకూలమైన ఆవాసాలను ఏర్పాటు చేయడానికి నిబద్ధతతో ప్రయత్నిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. మన దేశ సంస్కృతి, చరిత్రలో ఏనుగులు భాగంగా ఉన్నాయన్నారు. ఇవాళ వరల్డ్ ఎలిఫెంట్ డే సందర్భంగా వాటి రక్షణకు కృషి చేస్తున్న సంస్థలు, వ్యక్తులను Xలో అభినందించారు. కొన్నేళ్లుగా ఏనుగుల సంఖ్య పెరుగుతూ ఉండటం సంతోషకరమన్నారు. కాగా మన దేశంలో 30వేలకు పైగా ఏనుగులు ఉన్నట్లు అంచనా.
స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో మొదలయ్యాయి. ప్రస్తుతం BSE సెన్సెక్స్ 258 పాయింట్ల నష్టంతో 79,447, NSE నిఫ్టీ 80 పాయింట్లు ఎరుపెక్కి 24,286 వద్ద చలిస్తున్నాయి. బ్యాంకు నిఫ్టీ 397 పాయింట్లు పతనమై 72,321 వద్ద ట్రేడవుతోంది. హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కొనుగోళ్లకు ఆసక్తి చూపడం లేదు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 3, అదానీ పోర్ట్స్ 2 శాతానికి పైగా నష్టపోయాయి.
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ విన్‌స్టన్ బెంజిమన్ కుమారుడు రాయ్ బెంజిమన్ పారిస్ ఒలింపిక్స్‌లో సత్తా చాటారు. US తరఫున ఆయన 400 మీ.హర్డిల్స్, 4X400 మీ.రిలేలో స్వర్ణ పతకం సాధించారు. 400 మీ.హర్డిల్స్‌ను 46:46 సెకన్లలో పూర్తి చేశారు. అలాగే 4X400 మీ.రిలేను 2:54.43 నిమిషాల్లో ముగించారు. కాగా రాయ్ బెంజిమన్ 1997లో న్యూయార్క్‌లో జన్మించారు. ఆయన తండ్రి విన్‌స్టన్ విండీస్ తరఫున 21 టెస్టులు, 85 వన్డేలు ఆడారు.
TG: ఫోన్ మాట్లాడుతూ పరధ్యానంగా ఉండటం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఖమ్మంకు చెందిన మహేశ్(40) స్థానికంగా కొబ్బరికాయల వ్యాపారం చేస్తున్నారు. నిన్న రాత్రి వాటర్ హీటర్ ఆన్ చేస్తున్న సమయంలో కాల్ వచ్చింది. హీటర్‌ను చంకలో పెట్టుకుని స్విచ్ ఆన్ చేశారు. దీంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూశారు. ఫోన్ వాడే సమయంలో అప్రమత్తంగా ఉండాలి.
Sorry, no posts matched your criteria.