News August 12, 2024

‘కరెంట్’ షాక్.. రూ.20 లక్షల బిల్లు!

image

గుజరాత్‌లోని నవసరీ ప్రాంతంలో ఓ కుటుంబానికి ‘విద్యుత్’ షాక్ తగిలింది. గత నెలకు ఏకంగా రూ.20 లక్షల కరెంటు బిల్లు వచ్చింది. ‘ఇంట్లో ఓ రిఫ్రిజిరేటర్, టీవీ, నాలుగేసి బల్బులు, ఫ్యాన్లు ఉన్నాయి. ముగ్గురం రోజంతా పనిమీద బయటే ఉంటాం. రూ.2500కి మించి ఎప్పుడూ బిల్లు రాలేదు’ అని కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా.. పొరపాటు జరిగిందని, తప్పును సరిదిద్దామని గుజరాత్ విద్యుత్ బోర్డు వివరణ ఇచ్చింది.

News August 12, 2024

దక్షిణ కొరియా బయల్దేరిన సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకున్నారు. అక్కడి నుంచే ఆయన నేరుగా దక్షిణ కొరియా బయల్దేరి వెళ్లారు. ఆయనతోపాటు మంత్రులు, అధికారులు కూడా ఉన్నారు. దక్షిణ కొరియా సీఎం మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఆ తర్వాత ఒక రోజు పర్యటనకు సింగపూర్‌ వెళ్లనున్నారు. ఈ నెల 14న రేవంత్ టీమ్ రాష్ట్రంలో అడుగుపెట్టనుంది. కాగా రేవంత్ అమెరికాలో 8 రోజులు పర్యటించి భారీ పెట్టుబడులు ఆకర్షించారు.

News August 12, 2024

గ్రాండ్‌గా పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలు

image

పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలు ఘనంగా ముగిశాయి. ఫ్రెంచ్ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా ముగింపు వేడుకలు జరిగాయి. భారత్ తరఫున షూటర్ మనూ భాకర్, హాకీ గోల్ కీపర్ పీఆర్ శ్రేజేశ్ ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించారు. భారత త్రివర్ణ పతాకాన్ని వీరిద్దరూ చేబూని ముందు నడవగా మిగతా క్రీడాకారులు వీరిని అనుసరించారు.

News August 12, 2024

డేంజర్‌లో ప్రభాస్ ‘కల్కి’ రికార్డ్?

image

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా ‘కల్కి 2898ఏడీ’ హిందీలో తొలిరోజే రూ.23 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. అయితే శ్రద్ధాకపూర్ నటించిన ‘స్త్రీ 2’ హిందీ బెల్ట్‌లో ఆ కలెక్షన్లను బద్దలుగొట్టే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ నెల 15న రిలీజ్ కానుండగా 14న రాత్రి నుంచే షోలు మొదలుకానున్నాయి. తొలి భాగం ‘స్త్రీ’ రూ.100 కోట్లు సాధించడంతో సెకండ్ పార్ట్‌కి తొలిరోజు రూ.30 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.

News August 12, 2024

చంద్రబాబును కలిసిన తెలంగాణ స్పీకర్

image

TG: ఏపీ సీఎం చంద్రబాబును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వసతి, దర్శనానికి సంబంధించి తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత కల్పించాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. అలాగే విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కూడా ఆయన చర్చించినట్లు సమాచారం. వీటిపై బాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

News August 12, 2024

ఆగస్టు 12: చరిత్రలో ఈ రోజు

image

1919: అంతరిక్ష శాస్త్రవేత్త విక్రం సారాభాయ్ జననం
1939: నేపాల్ మాజీ ప్రధాని సుశీల్ కొయిరాలా జననం
1972: భారత మాజీ క్రికెటర్ జ్ఞానేంద్ర పాండే జననం
1892: గ్రంథాలయ పితామహుడు ఎస్ఆర్ రంగనాథన్ జననం
1997: హీరోయిన్ సాయేశా సైగల్ జననం
ప్రపంచ ఏనుగుల దినోత్సవం

News August 12, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News August 12, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: ఆగస్టు 12, సోమవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:42 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5:58 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:48 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6:44 గంటలకు
✒ ఇష: రాత్రి 8.00 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News August 12, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News August 12, 2024

శుభ ముహూర్తం

image

✒ తేది: ఆగస్టు 12, సోమవారం
✒సప్తమి: ఉదయం 7..55 గంటలకు
✒స్వాతి: ఉదయం 8.33 గంటలకు
✒వర్జ్యం: మధ్యాహ్నం 12.39-4.24 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.37 నుంచి 01.28 గంటల వరకు
మధ్యాహ్నం 03.10 నుంచి 04.00 గంటల వరకు