India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✒ ధారగా పడుతున్న నీటితో 15min గాయాన్ని కడగాలి. ఇలా చేస్తే కుక్క లాలాజలం శరీరంలోకి ప్రవేశించదు.
✒ గాయమైన చోటును యాంటిసెప్టిక్ లోషన్‌తో శుభ్రం చేయాలి. ఆ తర్వాత డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లి టీటీ ఇంజక్షన్ వేయించాలి.
✒ కరిచిన చోటును మూసి ఉంచొద్దు. నీరు, రక్తం కారుతున్నా అలాగే వదిలేయాలి.
✒ వైద్యుల సూచన మేరకు యాంటీ రేబిస్ టీకాను అవసరమైన (3లేదా5) మోతాదుల్లో తీసుకోవాలి.
కులం, మతం, రంగు, వస్త్రధారణ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజల తరఫున మరింత దృఢంగా పోరాడతానని ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా పోస్ట్ చేశారు. జైలు అధికారులు తన చేతిపై వేసిన ఖైదీ స్టాంప్‌ను చూపుతూ ఇది తన గుర్తు మాత్రమే కాదని, ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్లకు గుర్తు అని అన్నారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన సోరెన్ జూన్ 28న జైలు నుంచి విడుదలయ్యారు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) భర్తీ చేయనున్న 17,727 కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్(CGL) ఉద్యోగాలకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ రేపటితో ముగియనుంది. ఇప్పటికే దరఖాస్తు చేసిన అభ్యర్థులు <
రష్యా ఆర్మీలో పనిచేస్తున్న భారతీయుల విడుదలకు చర్యలు తీసుకుంటున్నామని ఢిల్లీలో రష్యా ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడంపై భారత ప్రభుత్వానికి, బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించింది. ఏప్రిల్ నుంచి భారత పౌరులను సైన్యంలో చేర్చుకోవడాన్ని రష్యా నిలిపివేసినట్టు వెల్లడించింది.
వరుసగా 17 నెలల నుంచి బంగారంపై పెట్టుబడులను ఆసియా ఆకర్షిస్తూనే ఉంది. జులైలో వీటి విలువ $438 మిలియన్లకు చేరింది. కస్టమ్స్ సుంకం 15 నుంచి 6 శాతానికి తగ్గించడంతో భారత్‌కే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్లు వచ్చాయి. విదేశీయులు Gold ETFల్లో పెట్టుబడికి మొగ్గుచూపారు. జులైలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.65314కు చేరడంతో ఒక నెలలో 4.5%, YTD 17.5% రాబడి వచ్చింది. US పదేళ్ల బాండు ఈల్డులు, డాలర్ బలహీనతలు ఇందుకు దోహదపడ్డాయి.
TG: పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూ.లక్షన్నర, మాగాణి 3.50ఎకరాలు, చెలక 7.5ఎకరాలు, పట్టణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూ.2లక్షలు ఉన్న కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు జారీ చేయాలని ప్రతిపాదించింది. 2 రాష్ట్రాల్లో కార్డులున్న వారికి ఆప్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీల సూచనలు తీసుకోనుంది.
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టారు. కాసేపటి క్రితం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్న ఆయన తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, అధ్యక్షుడి ఎంపికపై చర్చించే అవకాశం ఉంది. కార్యకర్తల నుంచి వినతి పత్రాలు స్వీకరించనున్నారు.
ప్రపంచంలోనే అతి పొడవైన ‘మోటరబుల్ రోడ్’గా ‘పాన్ అమెరికన్ హైవే’ గిన్నిస్ రికార్డు సాధించింది. ఇది నార్త్ అమెరికాలోని కెనడాలో ప్రారంభమై అమెరికా, మెక్సికో, కోస్టారికా, పనామా, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, చిలీ, బొలివీయా లాంటి 14 దేశాల మీదుగా సౌత్ అమెరికాలోని అర్జెంటీనా వరకు ఉంటుంది. సముద్రం, ఎడారులు, నదులు దాటుకుంటూ వెళ్లే ఈ హైవే మొత్తం పొడవు సుమారు 30వేల కిలోమీటర్లు కావడం విశేషం.
విద్యార్థులకు టిఫిన్ బాక్సుల్లో నాన్‌వెజ్ పెట్టవద్దంటూ నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరెంట్స్‌కి జారీ చేసిన సర్క్యులర్ వివాదాస్పదమైంది. ఉదయం వండిన నాన్‌వెజ్ మధ్యాహ్నానికి పాడవుతుందని, అలాగే లంచ్ టైంలో కలిసి తినేటప్పుడు ఇతరులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ సర్క్యులర్ ఇచ్చినట్టు చెప్పింది. అయితే దీన్ని కొందరు సమర్థించగా, ఇంకొందరు వ్యతిరేకిస్తున్నారు.
వంచిత రాజకీయాలకు రాహుల్ ప్రతిరూపంగా మారారని BJP నేత గౌరవ్ భాటియా విమర్శించారు. తాము మోసపోయినట్టు కర్ణాటక, హిమాచల్ ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. ‘KA ఎన్నికల్లో ఇచ్చిన 59 హామీల్లో 2 నెరవేర్చారు. రాష్ట్రంలో 1200 మంది రైతులు సూసైడ్ చేసుకున్నట్టు కథనాలు వచ్చాయి. బాధితుల్ని కలిసేందుకు లేదా కనీసం సమస్యను CM దృష్టికి తీసుకొచ్చే టైమ్ రాహుల్‌కు లేదు. ఎందుకంటే ఆయన ప్రాధామ్యాలు వేరు’ అని అన్నారు.
Sorry, no posts matched your criteria.