News August 10, 2024

సిక్కిం పౌరులు ఐటీ పన్ను చెల్లించరు.. ఎందుకంటే

image

సిక్కిం పౌరులు ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా పన్ను కట్టకపోవడానికి కారణమేంటో తెలుసా? ఆ రాష్ట్రం 1975లో భారత్‌లో విలీనమైంది. అప్పటి వరకు అక్కడి ప్రజలకు పన్ను లేదు. దీంతో భారత్‌లో భాగమయ్యాక కూడా ప్రభుత్వం ఆ విధానాన్ని కొనసాగించింది. దాన్ని మరింత బలోపేతం చేసేందుకు 2008లో ఆదాయ పన్ను సెక్షన్ 10(26 ఏఏఏ)ని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే సిక్కిం పౌరులు తమ ఆదాయంపై ఏ పన్నూ చెల్లించరు.

News August 10, 2024

ఏఐతో మానవ సంబంధాలపై ప్రభావం

image

అన్ని రంగాల్లో ఏఐ విస్తరిస్తూ మానవ జీవితాల్లో భాగమవుతోంది. అయితే ఏఐ రియలిస్టిక్ వాయిస్ ఫీచర్ వల్ల మానవ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉదని OpenAI ఆందోళన వ్యక్తం చేసింది. AI బోట్‌లతో చాట్ వల్ల మనుషులతో బాండింగ్, నమ్మకం తగ్గిపోతుందని పేర్కొంది. తాము అభివృద్ధి చేస్తున్న ChatGPT-4o వెర్షన్‌పై నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. ఇది అందుబాటులోకి వస్తే మనుషులతో మాట్లాడిన ఫీల్ వస్తుందని తెలిపింది.

News August 10, 2024

దువ్వాడను సస్పెండ్ చేయండి జగనన్న: వాణి

image

AP: టెక్కలిలోని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద <<13819884>>మరోసారి<<>> ఉద్రిక్తత నెలకొంది. ఆయన ఇంటి ముందు భార్య వాణి, కూతురు హైంధవి బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ‘దువ్వాడను వెంటనే ఎమ్మెల్సీగా, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జగనన్నను కోరుతున్నాను. YCP దీనిపై కచ్చితంగా ఆలోచించాలి. మాకు న్యాయం చేయాలి’ అని వాణి డిమాండ్ చేశారు.

News August 10, 2024

భారత్ అత్యంత నమ్మకమైన దేశం: ముయిజ్జు

image

మాల్దీవుల నుంచి భారత్‌ జాడల్ని తరిమికొట్టాలంటూ ఒకప్పుడు పెద్ద ప్రచారాన్నే నిర్వహించిన ఆ దేశాధ్యక్షుడు ముయిజ్జు ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు. భారత్ తమకు అత్యంత నమ్మకమైన భాగస్వామి అంటూ ఓ ప్రకటనలో తెలిపారు. ‘భారత్-మాల్దీవుల బంధం బలోపేతానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మా దేశానికి ఎప్పుడు అవసరం ఉన్నా భారత్ అండగా నిలిచింది. ఆ దేశ ప్రభుత్వానికి, ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాం’ అని పేర్కొన్నారు.

News August 10, 2024

డార్క్‌వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్లు.. స్పీడ్ పోస్టులో డెలివరీ

image

స్పీడ్ పోస్టులో డ్రగ్స్ డెలివరీ చేస్తున్న వ్యక్తిని TG పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మంకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జులై 31న డార్క్‌వెబ్‌లో డ్రగ్స్‌ ఆర్డర్ చేశాడు. అతనికి విక్రయదారుడు అస్సాం నుంచి డ్రగ్స్‌ను స్పీడ్ పోస్టులో పంపాడు. ఈ విషయాన్ని నార్కోటిక్ వింగ్ కనిపెట్టింది. దీంతో పోలీసులు నిందితుడిని ఈనెల 8న పట్టుకున్నారు. క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు జరుగుతున్నట్లు గుర్తించారు.

News August 10, 2024

వీరిని పట్టిస్తే రూ.20 లక్షల రివార్డు

image

నలుగురు ముష్కరుల ఊహా చిత్రాలను జమ్మూకశ్మీర్ పోలీసులు విడుదల చేశారు. వీరి ఆచూకీ చెబితే ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రూ.20 లక్షలు అందజేస్తామని తెలిపారు. కథువా జిల్లాలో మచేడీ‌లో పెట్రోలింగ్ చేస్తున్న ఐదుగురు సైనికులపై జులై 8న బురద ప్రాంతాల్లో దాక్కొని ఈ టెర్రరిస్టులు దాడి చేశారు. ఘటనలో ఒక జవాన్ మరణించారు. జులై 15న కూడా ఇలాంటి దాడే జరిగింది. జైష్ ఏ మహ్మద్ షాడో గ్రూపులే ఇలా చేస్తున్నాయని సమాచారం.

News August 10, 2024

రోహిత్ శర్మ 24 క్యారెట్ల బంగారం: ఆకాశ్ చోప్రా

image

టీమ్ ఇండియా వన్డే/టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించారు. రోహిత్ చాలా మంచి మనిషంటూ ఆకాశానికెత్తేశారు. ‘ఆటగాడిగానే కాదు, మనిషిగానూ రోహిత్ అద్భుతం. తను మంచివాడు కాదని చెప్పిన ఒక్క వ్యక్తిని కూడా నేను చూడలేదు. 24 క్యారెట్ల బంగారం ఆయన’ అని కొనియాడారు. టీ20ఐ నుంచి రిటైరైన రోహిత్ ప్రస్తుతం వన్డే, టెస్టు ఫార్మాట్లలో మాత్రమే కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

News August 10, 2024

కుంకీలుగా మగ ఏనుగులే ఎందుకంటే..

image

ఊళ్లపైకి వచ్చే అడవి ఏనుగుల్ని ఎదుర్కొనేందుకు కుంకీలుగా అధికారులు మగ ఏనుగుల్నే వాడుతుంటారు. ఎందుకంటే మగవి ఒంటరిగా అయినా ఉండగలవు కానీ ఆడఏనుగులు గుంపులో ఉండేందుకే ఇష్టపడతాయి. ఇక ఏనుగుల గుంపునకు ఆడ ఏనుగే నాయకురాలుగా ఉంటుంది. కుంకీ మగ ఏనుగు అడ్డుకోవడానికి రాగానే తమ పిల్ల ఏనుగుల రక్షణ కోసం మందను వెనక్కి తీసుకెళ్లిపోతుంది. ఒకవేళ గుంపులో మగ ఏనుగు ఉన్నా దానితో పోరాడేందుకు కుంకీ ఏనుగులు భయపడవు.

News August 10, 2024

కుక్కల దాడులు పెరుగుతున్నా పట్టించుకోరా?: హరీశ్

image

TG: వీధికుక్కల దాడులు విపరీతంగా పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ‘నిన్న వరంగల్‌లో పసికందును కుక్కలు పీక్కుతిన్నాయి. నార్సింగిలో దివ్యాంగ చిన్నారిపై దాడి చేశాయి. ఇబ్రహీంపట్నంలో నాలుగేళ్ల చిన్నారిని చంపేశాయి. 8 నెలల్లో 343 కుక్కకాటు ఘటనలు జరిగాయి. హైకోర్టు హెచ్చరించినా మొద్దు నిద్ర వదలట్లేదు’ అని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

News August 10, 2024

పిక్టోగ్రామ్స్ గురించి తెలుసా..!

image

పిక్టోగ్రామ్స్ అనేవి చిత్రలేఖనం ద్వారా సమాచారాన్ని అందించే చిహ్నాలు. వీటిని ఒలింపిక్స్‌లో మొద‌టిసారిగా జ‌పాన్ (1964) ఉప‌యోగించింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఇత‌ర దేశాల క్రీడాకారుల‌కు జ‌ప‌నీస్ అర్థం కాక‌పోవ‌డంతో జ‌పాన్ ఈ ఎత్తుగ‌డ వేసింది. నిజానికి పిక్టోగ్రామ్స్‌ వాడకం 5 వేల ఏళ్ల క్రితం మెసొపొటేమియా, ఈజిప్ట్‌లో ప్రారంభమైనట్టు చ‌రిత్ర చెబుతోంది.