India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బంగ్లాలో మైనారిటీ వర్గాలు తమ హక్కుల సాధనకై ఉద్యమించాయి. మైనారిటీ వర్గాల కోసం దేశంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, మైనారిటీ రక్షణ కమిషన్ ఏర్పాటు చేయాలని, దాడులను అరికట్టేందుకు కఠిన చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే పార్లమెంటు స్థానాల్లో మైనారిటీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఢాకాలోని షాబాగ్ వేదికగా ఉద్యమించాయి.
టాలీవుడ్ లెజెండ్స్ చిరంజీవి, బాలకృష్ణ చాలా రోజుల తర్వాత ఒకే వేదికను పంచుకోనున్నారు. బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ కొత్త సీజన్‌లో గెస్ట్‌గా మెగాస్టార్ రాబోతున్నారు. చిరు బర్త్ డే సందర్భంగా ఈ నెల 22న అధికారికంగా ప్రకటన వెలువడుతుందని సమాచారం. ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే ఈ టాక్ షోలో ప్రభాస్, పవన్ కళ్యాణ్, రవితేజ, రానా, చంద్రబాబు తదితర ప్రముఖులు పాల్గొన్న విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్‌లో అల్లర్లపై నటి ప్రీతి జింటా ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి మైనారిటీలపై జరుగుతున్న దాడిని చూసి గుండె పగిలిందని పేర్కొన్నారు. ‘జనాన్ని చంపుతున్నారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఆలయాలపై దాడులు చేస్తున్నారు. ఈ హింస ఆగేలా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నా. కష్టాల్లో ఉన్నవారి కోసం ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. SaveBangladesiHindus అంటూ హ్యాష్ ట్యాగ్ జతచేశారు.
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన రెజ్లర్ అమన్ సెహ్రావత్‌పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించారు. ‘భారత్ తరఫున అత్యంత చిన్న వయస్సులో పతకం గెలిచిన అమన్ సెహ్రవాత్‌కు కంగ్రాట్యులేషన్స్. ఇది మీ విజయం మాత్రమే కాదు, మొత్తం భారత రెజ్లింగ్‌ది. ప్రతి భారతీయుడూ మీ విజయం పట్ల గర్విస్తున్నాడు. స్వర్గం నుంచి మీ తల్లిదండ్రులు నిన్ను చూస్తూ గర్వపడుతుంటారు’ అని ట్వీట్ చేశారు.
అధిక బరువు కారణంగా ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో పాల్గొనకుండా తనపై వేసిన అనర్హతను భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ సవాల్ చేసిన పిటిషన్‌పై ఇవాళ తీర్పు రానుంది. నిన్న వినేశ్ తరఫు వాదనలు విన్న కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ఇవాళ రాత్రి 9.30 గంటలకు నిర్ణయాన్ని వెల్లడించనుంది. కోర్టు తీర్పు కోసం భారతావని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఆమెకు మెడల్ రావాలని అందరూ కోరుకుంటున్నారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్ రాజీనామా చేశారు. తాత్కాలిక ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఆయన న్యాయమూర్తులతో ఏర్పాటు చేసిన సమావేశం వివాదాస్పదమైంది. వీరంతా కుట్రలో భాగమని ఆరోపిస్తూ వందలాదిగా నిరసనకారులు సుప్రీం కోర్టును చుట్టుముట్టారు. గంటలోనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన వెళ్లిపోయారని వార్తలు వచ్చినా చివరికి రాజీనామా చేయక తప్పలేదు. ఆయన హసీనాకు అనుచరుడని పేరుంది.
ఆగస్టు 5 నుంచి 52 జిల్లాల్లో మైనారిటీలపై 205 దాడులు జరిగాయని బంగ్లాదేశ్ హిందూ సంఘాలు తెలిపాయి. ‘మా జీవితాలు నాశనం అయ్యాయనే రక్షణ కోరుతున్నాం. రాత్రుళ్లు మేల్కొని కాపలా కాస్తూ కుటుంబాలు, గుళ్లను కాపాడుకుంటున్నాం. కొందరు మిత్రులు ఇళ్లలో తలదాచుకుంటున్నారు. ఇలాంటి ఘోర పరిస్థితుల్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు‘ అని హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ అధ్యక్షుడు నిర్మల్ రొసారియో అన్నారు.
TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫోన్స్, కంప్యూటర్ హార్డ్‌డ్రైవ్ వంటి పరికరాల్లో ఉపయోగించే అరుదైన మూలకాల నిల్వలు ఉన్నట్లు బయటపడింది. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా చేపట్టిన మట్టి నమూనాల పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. 15 రకాల లాంథనైడ్స్‌తో పాటు స్కాండియం, ఏట్రియంను గుర్తించినట్లు GSI నివేదిక ఇచ్చింది. దీంతో రాష్ట్ర గనులశాఖ ఖనిజాల అన్వేషణకు కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది.
కొన్ని వారాలుగా 84 దేశాల్లో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని WHO వెల్లడించింది. రానున్న రోజుల్లో మరిన్ని వేరియంట్లు వ్యాపించనున్నాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. పారిస్ ఒలింపిక్స్‌లో దాదాపు 40 మంది అథ్లెట్లు కొవిడ్/శ్వాసకోశ వ్యాధుల బారిన పడినట్లు పేర్కొంది. కరోనా ఇప్పటికీ మనతోనే ఉందని WHO డాక్టర్ మరియా చెప్పారు. ఓవరాల్‌గా పాజిటివ్ కేసుల సంఖ్య 10%, ఐరోపాలో 20% పైగా ఉందని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.