India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఢిల్లీ జల్ బోర్డు మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ED ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఫ్లో మీటర్ల కొనుగోళ్ల టెండర్లలో అవినీతి జరిగినట్లు ఆరోపించింది. DJB మాజీ చీఫ్ ఇంజినీర్ జగదీశ్ అరోరా, కాంట్రాక్టర్ అనిల్ అగర్వాల్, NBCC మాజీ GM మిట్టల్, తేజిందర్ సింగ్ అనే నలుగురితో పాటు NKG ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే కంపెనీని నిందితులుగా చేర్చింది. ఈ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్‌కు ED సమన్లు పంపిన సంగతి తెలిసిందే.
AP: సీఎం జగన్‌పై టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. సీమలో ట్రెండ్ మారిందని.. వైసీపీ బెండు విరగడం ఖాయమని చెప్పారు. ప్రొద్దుటూరులో ‘ప్రజాగళం’ సభలో ఆయన మాట్లాడారు. జగన్ కమల్ హాసన్‌ను మించిన నటుడని.. ఆయనను కరకట్ట కమల్ హాసన్ అని పిలుస్తానని అన్నారు. ఏపీలో అన్ని లోక్‌సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థి సురేంద్రన్‌పై 242 క్రిమినల్ కేసులు ఉన్నాయి. EC నిబంధనల మేరకు ఆయన తనపై ఉన్న కేసుల వివరాలను 3 పేజీల్లో వెల్లడించారు. అలాగే ఎర్నాకులం బరిలో ఉన్న కేఎస్ రాధాకృష్ణన్‌పై 211 కేసులు ఉన్నాయి. వీటిలో ఎక్కువ కేసులు 2018 శబరిమల ఆందోళనల్లో నమోదైనవేనని ఆ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ జార్జ్ కురియన్ తెలిపారు.
TG: టీడీపీ నేత నందమూరి సుహాసిని.. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుహాసినిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించినట్లు సమాచారం. 2018 ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి పోటీ చేసిన ఈమె 41 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ గుండెపోటుతో <<12952187>>కన్నుమూయడంతో<<>> ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన కొన్నేళ్ల కిందటే నేత్ర దానానికి నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మరణించడంతో ఆయన కళ్లను ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు సేకరించారు. వాటిని మరో ఇద్దరు అంధులకు అమర్చుతామని తెలిపారు. బాలాజీ చేసిన గొప్ప పనిని అభిమానులు కొనియాడుతున్నారు. చనిపోయినా ఇద్దరిలో ఆయన బతికే ఉంటారని పేర్కొంటున్నారు.
మైక్రోసాఫ్ట్, ఓపెన్AI కలిసి $100 బిలియన్ల ఖర్చుతో అతిపెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. అలాగే AI సూపర్ కంప్యూటర్ ‘స్టార్‌గేట్’ను 2028లో లాంచ్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశాయి. ప్రపంచంలో ఉన్న పెద్ద డేటా సెంటర్ల కంటే ఇది 100 రెట్లు ఖరీదైనదని అంచనా. అడ్వాన్స్‌డ్ టాస్క్‌లు పూర్తి చేయగల AI డేటా సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను భర్తీ చేయడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని ఉన్నతోద్యోగులు చెబుతున్నారు.
AP: రాష్ట్రానికి చిట్టచివరి నియోజకవర్గం ఇచ్ఛాపురం(శ్రీకాకుళం జిల్లా). ఇక్కడ 1952 నుంచి 15 సార్లు ఎన్నికలు జరగగా, 8 సార్లు TDP గెలిచింది. కాంగ్రెస్ 3, కృషికార్ లోక్ పార్టీ 2, స్వతంత్ర పార్టీ, జనతా పార్టీ చెరొకసారి గెలిచాయి. ఈసారి TDP నుంచి సిట్టింగ్ MLA బెందాళం అశోక్, YCP నుంచి పిరియా విజయ బరిలో ఉన్నారు. హ్యాట్రిక్ కొడతానని అశోక్, గెలుపు బోణీ చేస్తానని విజయ ధీమాగా ఉన్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>
AP: రాష్ట్రంలో మంచి పాలన కొనసాగించడంలో తనకు తోడుగా ఉండాలని సీఎం జగన్ ప్రజలను కోరారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో కర్నూలు జిల్లా తుగ్గలి, రాతన గ్రామస్థులతో ఆయన సమావేశమయ్యారు. కుల, మత, పార్టీలకతీతంగా పనిచేశామని చెప్పారు. ప్రతి ఇంటి తలుపు తట్టి సాయం అందించామన్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి మార్పులు కనిపించలేదని.. 58 నెలల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని తెలిపారు.
ఫ్రెషర్ల నియామకానికి టీసీఎస్ సిద్ధమైంది. ఏప్రిల్ 10 వరకు అప్లికేషన్లు స్వీకరించనుంది. 26న పరీక్షలు నిర్వహించనుంది. 2024 బ్యాచ్ బీటెక్, బీఈ, MCA, Msc, MS విద్యార్థులు ఇందుకు అర్హులు. నింజా, డిజిటల్, ప్రైమ్ అనే 3 కేటగిరీలకు ఈ నియామకాలు చేపట్టనుంది. నింజాకు రూ.3.36లక్షలు, డిజిటల్‌కు రూ.7లక్షలు, ప్రైమ్‌కు రూ.9-11.5లక్షల వరకు ప్యాకేజీ ఉండనుంది. అయితే ఎన్ని పోస్టులకు అనేది సంస్థ వెల్లడించలేదు.
AP: సీఎం జగన్ ఇంటికి పోవడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రజాగళం ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ‘ఐదేళ్లలో రాయలసీమకు ఏం చేశావని జగన్‌కు సవాల్ విసురుతున్నా. జగన్‌కు సీమ అంటే హింస, హత్యా రాజకీయాలు. టీడీపీకి సీమ అంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు. మేం ‘కియా’ పరిశ్రమ తెస్తే.. జగన్ ‘జాకీ’, ‘అమర్ రాజా’ కంపెనీలను వెళ్లగొట్టారు’ అని విమర్శించారు.
Sorry, no posts matched your criteria.