India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఖరీఫ్‌లో 4.97 లక్షల మంది రైతుల నుంచి 29.91 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 4.36 లక్షల మంది రైతులకు రూ.5,700 కోట్లు చెల్లించామంది. మిగిలిన 61 వేల మంది రైతుల ఖాతాల్లో రూ.838 కోట్లను వారం రోజుల్లో జమ చేస్తామని తెలిపింది. ఏప్రిల్ మొదటి వారం నుంచి రబీ కొనుగోళ్లు ప్రారంభిస్తామని, 25 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.
AP: ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి హామీ చట్టం వర్తింపజేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం హిజ్రాలకు కూడా ఉపాధి హామీ వర్తింంపజేయాలని భావించింది. దీంతో వెంటనే కేంద్రానికి విన్నవించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్రాన్స్‌జెండర్‌ను ఒక కుటుంబంగా గుర్తించి జాబ్ కార్డు ఇవ్వనున్నారు. ఐదుగురు హిజ్రాలు ఉంటే వారిని ప్రత్యేక గ్రూపుగా పరిగణించనున్నారు. పని స్థలంలో వారిని ఎవరూ వెకిలిగా కించపరచకూడదు.
AP: మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరుసగా 5 సార్లు ఓడినా మళ్లీ టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆయనకు ఆరోసారి టికెట్ కేటాయిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సర్వేపల్లి నుంచి ఆయన 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓటమిపాలయ్యారు. 2012లో కోవూరు ఉపఎన్నికలో కూడా ఓడిపోయారు. సోమిరెడ్డి గెలుపు రుచి చూడక రెండు దశాబ్దాలు గడిచినా ఆరోసారి టికెట్ సాధించుకున్నారు.
TG: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఆమెను ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. కేసు దర్యాప్తును కోర్టు పరిశీలించనుంది. కాగా కవితను ఈ నెల 15న ఈడీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచింది. వారం రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే.
మాస్కోలో జరిగిన ఉగ్రదాడిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా స్పందించారు. ఘటన వెనుక ఎవరున్నా మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. మరోవైపు ఉగ్రదాడిని అమెరికా, ఐక్యరాజ్య సమితి, ఈయూ ఖండించాయి. అయితే ఉగ్రదాడి జరగొచ్చని వారం క్రితమే రష్యాలోని అమెరికా ఎంబసీ హెచ్చరించడం గమనార్హం.
AP: అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు డిపార్ట్‌మెంటల్ టెస్టుల నిర్వహణకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 4 నుంచి 24 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మేలో జరిగే పరీక్షల తేదీల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామంది. 26 జిల్లా కేంద్రాలతో పాటు ఢిల్లీలోనూ పరీక్ష కేంద్రాలు ఉంటాయని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
ఓటు వేయాలని ఒకరిని ఎలా బలవంతం చేస్తారని మద్రాసు హైకోర్టు ఓ పిటిషనర్‌ను ప్రశ్నించింది. తమిళనాడు తిరుచ్చెందూర్‌కు చెందిన రామ్‌కుమార్ ‘చట్టప్రకారం ఉద్యోగులు పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు తీసుకుంటున్నారు. వారు ఓటు వేసినట్లు తెలిపే ధ్రువపత్రం సమర్పించడాన్ని తప్పనిసరి చేయాలి’ అని పిటిషన్ వేశాడు. విచారణ చేపట్టిన కోర్టు.. ధ్రువపత్రం సమర్పించాలని ఆదేశించలేమని తీర్పిచ్చింది.
టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ రిషభ్ పంత్ చాలా కాలం తర్వాత మ్యాచ్ ఆడనున్నారు. IPLలో భాగంగా ఇవాళ పంజాబ్‌తో మ్యాచులో అతడు బరిలోకి దిగనున్నారు. 2022 డిసెంబర్ 30న పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి చికిత్స తీసుకున్న అతడు పూర్తిగా కోలుకోవడానికి ఏడాది పట్టింది. ఇటీవలే ఫుల్ ఫిట్నెస్ సాధించిన ఈ ఢిల్లీ కెప్టెన్ బ్యాటింగ్ కోసం అతడి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
AP: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో ఉచిత బోధన అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవాలని కోరారు. https://apms.apcfss.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ప్రవేశం కల్పిస్తామని తెలిపారు.
TG: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు, కంటోన్మెంట్ ఉపఎన్నిక పోలింగ్(మే 13) రోజు వేతనంతో కూడిన సెలవును ఇస్తున్నట్లు కార్మిక శాఖ ప్రకటించింది. వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ అవకాశం కల్పించినట్లు పేర్కొంది. ప్రజాప్రాతినిధ్య చట్టం, తెలంగాణ కర్మాగారాలు, దుకాణాలు, సముదాయాల చట్టాల కింద సెలవు మంజూరు చేసినట్లు పేర్కొంది.
Sorry, no posts matched your criteria.