News March 19, 2024

కోహ్లీని ప్రశంసిస్తే బాధపడుతున్నారు: ఇమాద్ వసీమ్

image

టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ స్పిన్నర్ ఇమాద్ వసీమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్లేయర్. అతణ్ని ప్రశంసిస్తే పాక్ అభిమానులు బాధపడుతున్నారు. అయినా నిజం ఏంటంటే విరాట్ కోహ్లీ.. బాబర్ ఆజమ్ కంటే గొప్ప ఆటగాడు’ అని వసీమ్ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు.

News March 19, 2024

డిప్రెషన్ తగ్గేందుకే ఆ డ్రగ్ తీసుకుంటున్నా: మస్క్

image

డిప్రెషన్‌ నుంచి బయటపడేందుకు కెటామైన్ అనే డ్రగ్‌ను తీసుకుంటున్న టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ దానిని సమర్థించుకున్నారు. ‘కొన్నిసార్లు ఒత్తిడికి గురవుతుంటా. దాని నుంచి బయటపడేందుకు డాక్టర్ సూచన మేరకు కొంత మోతాదులో కెటామైన్ తీసుకుంటున్నా. ఇది సంస్థలను మెరుగ్గా నిర్వహించేందుకు ఉపయోగపడుతోంది’ అని తెలిపారు. కాగా మత్తుమందులా పనిచేసే ఈ కెటామైన్‌‌ను అతిగా వాడటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News March 19, 2024

రెచ్చిపోతున్న హిజ్రాలు

image

హిజ్రాల ఆగడాలు పెరిగిపోయాయని నెటిజన్లు ఫిర్యాదులు చేస్తున్నారు. పెళ్లిళ్లు, షాప్ ఓపెనింగ్స్, ఇతర వేడుకలకు రూ.10వేల నుంచి రూ.50వేల వరకు డిమాండ్ చేస్తున్నారని చెబుతున్నారు. అడిగినంత ఇవ్వకుంటే డ్రెస్సులు తీసేసి వీరంగం సృష్టిస్తున్నారని వాపోతున్నారు. వీరి వెనుక పెద్ద మాఫియా ఉందని అనుమానిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించట్లేదని, హిజ్రాలను ఎలాగైనా కంట్రోల్ చేయాలంటున్నారు. దీనిపై మీ కామెంట్?

News March 19, 2024

మహారాష్ట్రలో బీఆర్ఎస్‌కు షాక్

image

మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. రైతు సంఘం నేత మాణిక్ రావు కదం ఆ పార్టీని వీడి అజిత్ పవార్ వర్గం ఎన్సీపీలో చేరారు. మరోవైపు NCP ఆయనకు కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది.

News March 19, 2024

సెల్యూట్.. చనిపోతూ ముగ్గురిని కాపాడాడు

image

కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సమయంలో అవయవాలు దొరక్క ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అవయవదానంపై ఎంత అవగాహన కల్పించినా ప్రజలు ముందుకు రావడం లేదు. అయితే, తాజాగా తెలంగాణకు చెందిన ప్రభాస్ అనే 19 ఏళ్ల యువకుడు తాను చనిపోతూ ఇతరులకు ప్రాణదానం చేశారు. ప్రభాస్ చనిపోవడంతో అతడి 2 కిడ్నీలు, లివర్‌ను కుటుంబీకులు దానం చేసి మరో ముగ్గురిని కాపాడారు. ఈ విషయాన్ని ‘జీవన్‌దాన్ తెలంగాణ’ ట్వీట్ చేసింది.

News March 19, 2024

ఎన్నికల సమయంలో జనంలోనే జగన్: సజ్జల

image

AP: వైసీపీ నిర్వహించిన ‘సిద్ధం’ సభలకు అనుహ్య స్పందన వచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 28న నంద్యాల, 30న కర్నూలు(ఎమ్మిగనూరు)లో బస్సుయాత్ర, బహిరంగ సభలు ఉంటాయని తెలిపారు. ఉదయం ఇంటరాక్షన్ కార్యక్రమాలు, సాయంత్రం సభలు నిర్వహిస్తామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనంతగా సభలు ఉంటాయన్నారు. వైసీపీ సంక్షేమాన్ని ప్రజలకు చేరవేస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో సీఎం జగన్ జనంలోనే ఉంటారన్నారు.

News March 19, 2024

తల్లి, పిల్లల్ని కలిసేందుకు కవితకు అనుమతి

image

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితకు తన తల్లి, పిల్లల్ని కలిసేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. ఆమె పిటిషన్‌పై విచారణను చేపట్టిన కోర్టు ఈమేరకు అనుమతి మంజూరు చేసింది. కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు.

News March 19, 2024

సమంత కొత్త సిరీస్ టైటిల్ ఫిక్స్

image

సమంత, బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్ కాంబినేషన్‌లో వస్తున్న సిరీస్‌కు టైటిల్ ఫిక్స్ అయ్యింది. ‘సిటాడెల్: హనీ-బన్నీ’(Citadel Honey Bunny) పేరుతో ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మరో బాలీవుడ్ స్టార్ ప్రియాంకా చోప్రా కీలక పాత్ర పోషించనున్నారు. రాజ్&డీకే దర్శకత్వంలో వస్తున్న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.

News March 19, 2024

3 నెలల్లో 30వేల ఉద్యోగాలిచ్చాం: వేణుగోపాల్

image

TG: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్‌ అన్నారు. గ్రామీణ యువత, మహిళల సమస్యలను పరిష్కరిస్తూ దేశ ప్రజలకు హామీలు ఇస్తున్నామన్నారు. కర్ణాటక, తెలంగాణలో ప్రకటించిన గ్యారంటీలను అమలు చేశామని అన్నారు. అదే విధంగా దేశ ప్రజలకు కూడా హామీలు ఇస్తున్నామని, వాటిని నెరవేరుస్తామని పేర్కొన్నారు.

News March 19, 2024

రేపటి నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

image

AP: తిరుమలలో మార్చి 20 నుంచి 24 వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుంచి 8గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. తెప్పోత్సవంలో భాగంగా తొలి రోజు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి భక్తులను కనువిందు చేయనున్నారు.