India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
* INDIA కూటమి హిందుత్వాన్ని అవమానిస్తోంది: మోదీ
* TG: రాష్ట్ర నూతన గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్
* కవిత కేసులో విచారణ జరుపుతున్న జడ్జి బదిలీ
* నేను పార్టీ మారడం లేదు: ఎర్రబెల్లి
* AP: ఈ నెల 27 నుంచి జగన్ బస్సు యాత్ర
* కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్:పవన్
* కాంగ్రెస్‌లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్
* సివిల్స్ పరీక్ష జూన్ 16కు వాయిదా
టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న శ్రీలంక క్రికెటర్ వనిందు హసరంగాకు ఐసీసీ షాకిచ్చింది. రీఎంట్రీ తర్వాత ఆడనున్న తొలి రెండు టెస్టులకు సస్పెండ్ చేసింది. ఈ నెల 18న బంగ్లాతో జరిగిన వన్డేలో అతడు అంపైర్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఐసీసీ 3 డీమెరిట్ పాయింట్లతో పాటు 2 టెస్టులకు సస్పెండ్ చేసింది. దీంతో బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి రెండు టెస్టులకు హసరంగ దూరమయ్యారు.
2025 చివరిలోగా 20కిపైగా మోడళ్లను రిలీజ్ చేస్తామని ఆడీ సంస్థ వెల్లడించింది. 2027కు అన్ని మోడల్స్‌లోనూ EV వెర్షన్‌లను తెస్తామని తెలిపింది. 2024-2028 మధ్య తయారీకి ఏకంగా 41 బిలియన్ యూరోల (రూ.3.6లక్షల కోట్ల)ను ఖర్చు చేయనుంది. వీటిలో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెహికిల్స్ (PHEV) కోసం 11.5 బిలియన్ యూరోలు వెచ్చించనుంది. బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం 29.5 బిలియన్ యూరోలు ఖర్చు చేయనుంది.
TG: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతి కుమారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వేసవి కాలంలో తాగునీటి కొరత లేదని స్పష్టం చేశారు. తాగునీటి సరఫరాపై అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. రిజర్వాయర్లలో సరిపడా నీరు ఉందని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లోనూ సరిపడా నీటి సరఫరా జరుగుతోందని, ఎవరైనా కోరితే అదనపు వాటర్ ట్యాంకులు పంపిస్తున్నామని పేర్కొన్నారు.
భారత మాజీ పేసర్ వినయ్ కుమార్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆర్సీబీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో ఆయనకు చోటు కల్పించింది. క్రిస్ గేల్, డివిలియర్స్ తర్వాత ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా నిలిచారు. ఈ మేరకు ఆర్సీబీ మహిళా జట్టు కెప్టెన్ స్మృతి, పురుషుల జట్టు కెప్టెన్ డుప్లెసిస్, కోహ్లీ చేతుల మీదుగా వినయ్ కుమార్ జ్ఞాపికను అందుకున్నారు. ఐపీఎల్‌లో 105 మ్యాచులు ఆడిన వినయ్ కుమార్ 105 వికెట్లు తీశారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కీలకమైన రాయ్‌బరేలీ ఎంపీగా నుపుర్‌శర్మను బరిలోకి దింపాలని BJP నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈమె గతేడాది టీవీ ఛానల్ డిబేట్‌లో మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. ప్రస్తుతం పరిస్థితులు సర్దుకోవడంతో ఆమెను రాయ్‌బరేలీలో పోటీ చేయించాలని BJP భావిస్తున్నట్లు సమాచారం.
జనరేటివ్ ఏఐ విభాగంలో మార్కెట్‌లో పోటీని తట్టుకునేలా యాపిల్ తన ప్రొడక్ట్‌లు అప్‌డేట్ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో యాపిల్, గూగుల్ మధ్య త్వరలో భారీ డీల్ జరగనున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది. ఐఫోన్లలో గూగుల్‌కి చెందిన జెమిని ఏఐ ఫీచర్స్‌ని అందుబాటులోకి తెచ్చేందుకు చర్చలు జరుగుతున్నట్లు పేర్కొంది. ఏఐ మోడల్‌ను ఐఫోన్ ఐఓఎస్ 18లో అందించేలా యాపిల్ కంపెనీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పింది.
AP: పిఠాపురంతో పాటు 20 నియోజకవర్గాలు, 2 ఎంపీ స్థానాలను గెలిచి చూపిద్దాం అని పవన్ కళ్యాణ్ జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సీట్లను కొట్టి చూపించాలని వారిలో ఉత్తేజం నింపారు. 10 ఏళ్ల ప్రజా పోరాటం తర్వాత అడుగుతున్నానని.. కాకినాడ ఎంపీగా ఉదయ్‌ను, పిఠాపురం ఎమ్మెల్యేగా తనను బలమైన మెజార్టీతో గెలిపించాలని కోరారు. తాను కాపుల్లో పుట్టినా.. ఆ వర్గానికే కాకుండా అన్ని వర్గాలకు న్యాయం చేసే వ్యక్తినని చెప్పారు.
క్రికెట్ మ్యాచులో కొందరు మాజీ ఆటగాళ్ల కామెంట్రీలు ఎప్పటికీ ప్రత్యేకమే. భారత్ నుంచి రవిశాస్త్రి, సిద్ధు, సెహ్వాగ్ ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా సిద్ధూ కామెంటరీ బాక్స్‌లో తనదైన శైలిలో వేసే ఛలోక్తులు నవ్వులు పూయిస్తాయి. ఈ IPL సీజన్‌కు కామెంటేటర్‌గా రీఎంట్రీ ఇస్తున్న సిద్ధు తన ఫీజు ఎంతో వెల్లడించారు. ఐపీఎల్‌లో రోజుకు రూ.25 లక్షలు తీసుకుంటున్నానని తెలిపారు.
ఈనెల 23న దేశవ్యాప్తంగా ఎర్త్ అవర్ నిర్వహించనున్నారు. ఆరోజు రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఎర్త్ అవర్‌లో భాగంగా గంటపాటు అందరూ లైట్లు ఆఫ్ చేయాలని పర్యావరణ శాఖ కోరింది. వాతావరణంలో మార్పులు, జీవవైవిధ్యానికి జరుగుతున్న నష్టాన్ని కొంతైనా తగ్గించేందుకు ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. కాగా ఏటా ఒకసారి దేశవ్యాప్తంగా ఎర్త్ అవర్ నిర్వహిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.