News March 18, 2024

2 రోజుల్లో మిగిలిన అభ్యర్థుల ప్రకటన

image

AP: రెండు రోజుల్లో మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటివరకు రెండు జాబితాల్లో కలిపి 128 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను CBN ప్రకటించారు. మిగిలిన 16 ఎమ్మెల్యే, 17 ఎంపీ స్థానాలకు రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం.

News March 18, 2024

వర్షం మొదలైంది..

image

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కొండాపూర్, మియాపూర్, చందానగర్ పరిసర ప్రాంతాల్లో వాన పడుతోంది. నగరంలోని పలు చోట్ల వాతావరణం చల్లబడింది. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు.. మారిన వాతావరణంతో రిలాక్స్ అవుతున్నారు. కాగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరి మీ ప్రాంతంలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.

News March 18, 2024

రాహుల్ చెప్పింది నా గురించి కాదు: చవాన్

image

మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత బీజేపీలో చేరే ముందు తన తల్లి వద్దకు వచ్చి ఏడ్చారని రాహుల్ గాంధీ తాజాగా వ్యాఖ్యానించారు. అది ఆ రాష్ట్ర మాజీ సీఎం చవానేనంటూ వార్తలు వచ్చాయి. వాటిపై చవాన్ స్పందించారు. ‘ఆ మాటలు నా గురించే అయితే అవి నిరాధారం. నేను అసలు సోనియాతో మాట్లాడలేదు. నేను రాజీనామా చేసే వరకు విషయం ఎవరికీ తెలియదు. ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఇలా మాట్లాడారు’ అని తెలిపారు.

News March 18, 2024

ట్రోలింగ్‌పై తొలిసారి స్పందించిన హార్దిక్

image

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను ఆ జట్టు ఫ్రాంచైజీ ప్రకటించినప్పటి నుంచి అతడిపై హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై హార్దిక్ తొలిసారి స్పందించారు. ‘నేను రోహిత్ అభిమానుల భావోద్వేగాలను గౌరవిస్తా. కానీ, వారిని కంట్రోల్ చేయలేను. వారిని గౌరవిస్తూనే కెప్టెన్‌గా ఏం చేయాలనేదానిపై దృష్టి పెడతా’ అని పాండ్య చెప్పుకొచ్చారు.

News March 18, 2024

‘కీడా కోలా’లో ఎస్పీ బాలు పాటపై తరుణ్ భాస్కర్ రియాక్షన్ ఇదే..

image

‘కీడా కోలా’ మూవీలో లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు పాటను రీక్రియేట్ చేయడంపై దర్శకుడు తరుణ్ భాస్కర్ స్పందించారు. బాలు కుమారుడు చరణ్ లీగల్ నోటీసులు పంపింది నిజమేనా? అని ఓ కార్యక్రమంలో ప్రశ్నించగా.. ఇద్దరివైపు నుంచి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇలా జరిగిందని ఆయన చెప్పారు. గొప్ప కళాకారులను అమర్యాద పరచాలనే ఉద్దేశం ఎవరికీ ఉండదని.. ప్రస్తుతం అంతా సర్దుకుందని బదులిచ్చారు.

News March 18, 2024

మోదీకి నా మాటలు నచ్చవు: రాహుల్

image

ప్రధాని మోదీకి తన మాటలు నచ్చవని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. తన మాటల్లోని సత్యమేంటో తెలిసి కూడా వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలోని వ్యవస్థలన్నింటినీ మోదీ హస్తాల్లోకి తీసుకున్నారని ఆరోపించారు. మోదీ అధర్మానికి, అవినీతికి, అసత్యానికి శక్తి రూపమని విమర్శించారు. తాను వ్యతిరేకించినప్పుడల్లా మోదీ కలత చెందుతారని పేర్కొన్నారు.

News March 18, 2024

క్రాంగెస్‌లో చేరడానికి గొర్రెల్లో ఒకడిని కాదు: RSP

image

TG: తాను కేసీఆర్‌తో కలిసి పని చేయడంపై CM రేవంత్ చేసిన వ్యాఖ్యలపై RS ప్రవీణ్ కుమార్ స్పందించారు. తెలంగాణ ప్రజలకు ఏ పార్టీలో చేరాలనే విషయంలో స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. ‘మీరు గేట్లు తెరిస్తే చాలామంది పిరికిపందలు, అసమర్థులు, స్వార్థపరులు గొర్రెల మందలా వస్తున్నారు. ఆ గొర్రెల మందలో నేను లేను. ప్రవీణ్ కుమార్ నిజమైన, నిస్వార్థ, నిఖార్సైన వ్యక్తి’ అని RSP అన్నారు.

News March 18, 2024

హోమ్ ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకోండి: EC

image

రాష్ట్రంలో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ అన్నారు. 85ఏళ్లు నిండిన వారు హోమ్ ఓటింగ్ కోసం ఏప్రిల్ 22లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరో మూడు రోజుల్లో హోమ్ ఓటింగ్ దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుందన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 90వేల పోలింగ్ కేంద్రాలున్నాయని చెప్పారు.

News March 18, 2024

ఎల్బీ చేద్దామనుకుంటే బౌల్డ్ అయ్యాడు: అశ్విన్

image

ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌లో 26 వికెట్లు తీసిన భారత స్పిన్నర్ అశ్విన్ ఓ కార్యక్రమంలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సిరీస్‌ తొలి టెస్టులో ENG కెప్టెన్ స్టోక్స్ వికెట్ తీయడం ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. ఎల్బీ చేద్దామనే ఉద్దేశంతో బంతి వేస్తే బౌల్డ్ అయ్యాడని తెలిపారు. బజ్‌బాల్ దూకుడు ప్రదర్శించడంలో ఇంగ్లండ్ విఫలమైందని చెప్పారు. వారు ఇంకాస్త నాణ్యమైన క్రికెట్ ఆడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

News March 18, 2024

2,049 ప్రభుత్వ ఉద్యోగాలు.. APPLY చేసుకోండి

image

SSCలో 2,049 ఉద్యోగాల అప్లికేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఈరోజు రాత్రి 11 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు. విద్యార్హత: పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ. ప్రోగ్రామ్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, లైబ్రేరియన్, ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ లాంటి పోస్టులున్నాయి. మే 6 నుంచి 8 వరకు పరీక్షలు ఉంటాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. సైట్: https://ssc.gov.in/