News March 17, 2024

180 సెలవులు ఎప్పుడైనా వాడుకోవచ్చు: ప్రభుత్వం

image

AP: మహిళా ఉద్యోగుల పిల్లల సంరక్షణ సెలవులపై విధించిన నిబంధనను ప్రభుత్వం తొలగించింది. వారు తమ పిల్లల వయసు 18 ఏళ్లు వచ్చేలోపే ఈ సెలవులు వినియోగించుకోవాలని గతంలో నిబంధన ఉంది. తాజాగా దీన్ని ఎత్తేసిన ప్రభుత్వం.. రిటైరయ్యేలోపు ఎప్పుడైనా 180 రోజుల సెలవులు వినియోగించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు అసెంబ్లీ ఉద్యోగులకు సీఆర్‌డీఏ పరిధిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ సర్కార్ ఉత్తర్వులిచ్చింది.

News March 17, 2024

రష్యా అధ్యక్షుడిగా మళ్లీ పుతినే?

image

రష్యాలో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరోసారి పుతిన్ అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పుతిన్ ప్రధాన ప్రత్యర్థి నావల్నీ చనిపోవడం, కొంతమంది ప్రత్యర్థులు జైళ్లు, అజ్ఞాతంలో ఉండడంతో ఆయన సులువుగా విజయం సాధిస్తారని తెలుస్తోంది. ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నా వారు నామమాత్ర ప్రత్యర్థులేనని టాక్.

News March 17, 2024

సుంకం లేకుండానే బంగారం దిగుమతి

image

బంగారం దిగుమతి విషయంలో ఆర్బీఐకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దిగుమతి సుంకం చెల్లించకుండానే బంగారం దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. మన దేశంలో బంగారం దిగుమతిపై 15%సుంకం చెల్లించాల్సి ఉంటుంది. కేంద్రం తాజాగా నిర్ణయంతో ఈ సుంకం భారం తగ్గనుంది.

News March 17, 2024

ELECTION CODE: తిరుమలలో సిఫారసు లేఖలు చెల్లవ్

image

సార్వత్రిక ఎన్నికల కోడ్ ప్రభావం తిరుమల దర్శనంపై పడింది. ఇకపై తిరుమలలో వసతి, శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలు స్వీకరించమని టీటీడీ తెలిపింది. ఇందుకు భక్తులు సహకరించాలని కోరింది. స్వయంగా వచ్చే సెలబ్రిటీలు, వారి కుటుంబసభ్యులకు మాత్రమే దర్శనం, వసతి కల్పించనున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఈ సిఫారసు లేఖలు చెల్లవు.

News March 17, 2024

భారీగా తగ్గిన చికెన్ ధరలు

image

చికెన్ ప్రియులకు గుడ్‌న్యూస్. గతవారం వరకు భారీగా పెరిగిన ధరలు తగ్గాయి. ఏపీ, తెలంగాణలో కేజీ చికెన్ ధర స్కిన్‌లెస్ రూ.200 నుంచి రూ.210 ఉంది. వారం కిందట ఇది రూ.280 నుంచి రూ.310 వరకు పలికింది. ప్రస్తుతం విత్ స్కిన్ అయితే రూ.200లోపే లభిస్తోంది. ఇరు రాష్ట్రాల్లో కోళ్ల లభ్యత పెరగడమే ధర తగ్గుదలకు కారణమని మాంసం వ్యాపారులు చెబుతున్నారు. మరి మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News March 17, 2024

కవితను కలిసేందుకు కోర్టు నిర్ధారించిన టైమ్ ఇదే

image

TG: ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు సీబీఐ కోర్టు సమయం నిర్ధారించింది. ప్రతిరోజు సా.6 నుంచి సా.7 గంటల వరకు కలిసేందుకు అవకాశం కల్పించింది. ఇవాళ ఆమెను భర్త అనిల్‌తో పాటు కేటీఆర్, హరీశ్ రావు, న్యాయవాదులు కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఆమెను ఈనెల 23 వరకు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు నిన్న తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

News March 17, 2024

ASRTU స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా సజ్జనార్

image

TSRTC ఛైర్మన్ సజ్జనార్‌ను మరో పదవి వరించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్టేకింగ్స్(ASRTU) స్టాండింగ్ కమిటీ నూతన ఛైర్మన్‌గా ఆయన ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరిగిన ASRTU 54వ జనరల్ బాడీ మీటింగ్‌లో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సజ్జనార్ ఆ పదవిలో ఏడాదిపాటు కొనసాగనున్నారు. స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా TSRTC చీఫ్ మెకానిక్ ఇంజినీర్ రఘునాథ‌రావు ఎన్నికయ్యారు.

News March 17, 2024

IPL ఒక సర్కస్ లాంటిది: మిచెల్ స్టార్క్

image

IPL ఒక సర్కస్‌లా ఎంటర్‌టైన్ చేస్తుందని ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అన్నారు. ‘8ఏళ్ల తర్వాత మళ్లీ IPLలో ఆడటం ఒక కొత్త సవాలు. ఈ టోర్నీ ప్రపంచంలోనే బెస్ట్ T20 లీగ్. ఈసారి కొత్త జట్టుతో ఆడనుండటం ఉత్సాహాన్నిస్తోంది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 2014, 2015 సీజన్లలో RCBకి ఆడిన స్టార్క్.. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. KKR అతడిని రూ.24.5కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

News March 17, 2024

APPLY NOW: 18 ఏళ్లు నిండినవారు మాత్రమే..

image

లోక్ సభ ఎన్నికలు మే 13న జరగనుండగా, 18 ఏళ్లు నిండినవారు ఏప్రిల్ 15 వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ వెల్లడించింది. ఓటర్ లిస్టులో పేరు లేని వారు, కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారు ఫామ్-6ను ఆన్‌లైన్‌లో లేదా స్థానిక ఎన్నికల అధికారికి సమర్పించవచ్చని తెలిపింది. ఓటర్ హెల్ప్ యాప్ లేదా https://voters.eci.gov.in/ వెబ్‌సైట్‌లో ఓటు నమోదు చేసుకోవచ్చు.

News March 17, 2024

16 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో పోటీ: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

image

AP: వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 16 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు వెల్లడించారు. ‘ఇండియా’ కూటమిలోని పార్టీలతో చర్చించిన అనంతరం అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. మంగళగిరిలో తమ పార్టీ కచ్చితంగా పోటీలో ఉంటుందని ప్రెస్‌మీట్‌లో చెప్పారు. ఈ ఎన్నికల్లో వైసీపీతో పాటు ఎన్డీఏ కూటమిలోని పార్టీలను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.