India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ రెస్ట్ లేకుండా శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నిన్న పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షించిన పవన్ నేడు ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ విభాగంతో భేటీ అయ్యారు. ఉదయం 10 గం. నుంచి అధికారులతో చర్చలు మొదలుపెట్టారు. ఛార్జ్ తీసుకున్న మొదటి రోజు నుంచే పాలనలో తన మార్క్‌ను చూపుతున్నారు.
తన అభిమాని రేణుకస్వామిని నటుడు దర్శన్ హత్య చేసిన ఘటన కన్నడ నాట సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక ఆధారాన్ని పోలీసులు సేకరించారు. హత్య సమయంలో దర్శన్ వాడిన లోఫర్స్‌ని అతని భార్య విజయలక్ష్మి ఫ్లాట్‌లో గుర్తించారు. హత్య తర్వాత అక్కడికొచ్చిన దర్శన్ ఇంట్లో పూజలు చేసి మైసూర్ వెళ్లారట. మరికొన్ని దుస్తులు, ఫుట్‌వేర్‌ని కూడా విజయలక్ష్మికి దర్శన్ అసిస్టెంట్ ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు.
ఉత్తరాదిలో నిన్న మొన్నటి వరకు వేడిగాలుల ఉధృతి కొనసాగింది. ఆ కారణంగా ఢిల్లీలో ఈ నెల 11 నుంచి 19 మధ్యలో 192మంది నిరాశ్రయులు మృతిచెందారని ఎన్జీవో సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్ సంస్థ తెలిపింది. ఈ కాల పరిమితిలో ఇంతమంది చనిపోవడం ఇదే అత్యధికమని ఓ నివేదికలో వెల్లడించింది. ఢిల్లీలో గడచిన 72 గంటల్లో ఐదుగురు కన్నుమూయడం గమనార్హం. ఇక గత 24 గంటల్లోనే నోయిడాలో 14మంది వేడి కారణంగా చనిపోయారు.
బిహార్ ప్రభుత్వం గత ఏడాది అమలులోకి తెచ్చిన 65% రిజర్వేషన్లను పట్నా హైకోర్టు రద్దు చేసింది. బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం రిజర్వేషన్లను పెంచుతూ గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది. సమానత్వం లోపించడమే కాక ఆర్టికల్ 14,15,16లను ఉల్లంఘించే విధంగా ఈ చట్టాలు ఉన్నాయని తెలిపింది. కాగా విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, ఉద్యోగాలకు సంబంధించి 2023లో ప్రభుత్వం చట్టాలను సవరించింది.
ఇండియాలో వినియోగిస్తున్న M3 మోడల్ ఈవీఎంలను హ్యాక్ చేయడం, ట్యాంపర్ చేయడం అసాధ్యమని ఐఐటీ గాంధీనగర్ డైరెక్టర్ రజత్ స్పష్టం చేశారు. ‘EVMలకు ఇతర పరికరాలతో కనెక్షన్ ఉండదు. వీటిని ఇంటర్నెట్, బ్లూటూత్ లాంటి వాటితో లింక్ చేయడం సాధ్యం కాదు. తద్వారా ఇతర సాఫ్ట్‌వేర్, ప్రోగ్రామ్స్ లోడ్ చేయలేం. ఎవరైనా ట్యాంపరింగ్ చేస్తే అందులోని ఆటోమేటెడ్ ఫంక్షన్లు దీన్ని వెంటనే ఫ్యాక్టరీ రీసెట్ చేస్తాయి’ అని వివరించారు.
ముంబైలో జరిగిన ‘కల్కి’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను బిగ్ బీ అమితాబ్ ఆటపట్టించారు. డార్లింగ్ ఇంట్రోవర్ట్ అవడంతో అమితాబ్, కమల్, దీపిక, రానా ఏం అంటున్నా నవ్వుతూ సిగ్గుపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తమ ఫేవరేట్ హీరో ఇంత ఉల్లాసంగా ఉండటం చూసి చాలా రోజులవుతుందని, బాలీవుడ్ సైతం ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అయిందని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
AP: సచివాలయంలో మంత్రులు బాధ్యతలు చేపట్టారు. జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు, కార్మికశాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్, పరిశ్రమల శాఖ మంత్రిగా TG భరత్ తమ ఛాంబర్లలో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి పోలవరాన్ని పరుగులు పెట్టిస్తామని నిమ్మల అన్నారు. YCP వల్లే పోలవరం ఆలస్యమైందని దుయ్యబట్టారు. కార్మిక చట్టాలను జగన్ ప్రభుత్వం కాలరాసిందని వాసంశెట్టి ఫైర్ అయ్యారు.
నీట్‌కు సంబంధించి వివిధ హైకోర్టుల్లో జరుగుతున్న కేసుల విచారణపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అన్ని కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పిటిషన్ విచారణలో భాగంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. నీట్ కౌన్సెలింగ్‌కు అంతరాయం ఉండదని స్పష్టం చేసింది. కాగా గ్రేస్ మార్క్స్ పొందిన 1,563 మందికి ఈనెల 23న మరోసారి పరీక్ష నిర్వహించాలని NTA భావిస్తోంది.
తమిళనాడులోని కల్లకురిచ్చిలో కల్తీ నాటుసారా తాగి మరణించిన వారి సంఖ్య 34కి పెరిగింది. మృతుల కుటుంబాలకు సీఎం స్టాలిన్ రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రూ.50,000 ఇస్తామని వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోకుల్ దాస్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. 3 నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించామన్నారు.
T20 WCలో కోహ్లీ ఫామ్ పేలవంగా ఉన్న సంగతి తెలిసిందే. అతడిని వన్ డౌన్‌లో పంపి పంత్‌తో ఇన్నింగ్స్ ఓపెన్ చేయించాలని క్రీడా విశ్లేషకులు సూచించడంపై స్పిన్నర్ అశ్విన్ స్పందించారు. ‘విరాట్ గురించి నాకు బాగా తెలుసు. పరుగులు రాకపోయినా తన కాన్ఫిడెన్స్ ఏమాత్రం తగ్గదు. ఒకవేళ మీరు వన్‌డౌన్‌కు పంపించినా ఏమాత్రం తగ్గరు. నేనెవరో చూపిస్తా అన్నట్లుగా ఆడతారు. త్వరలోనే మళ్లీ లయ అందుకుంటారు’ అని ధీమా వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.