India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు, రేపు ఉత్తర కొరియాలో పర్యటించనుండటంపై యూఎస్ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘పుతిన్ పర్యటన గురించి మాకు బెంగ లేదు కానీ రెండు దేశాల బంధం బలోపేతం కావడమే ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర కొరియా ఇస్తున్న క్షిపణుల్నే రష్యా ఉక్రెయిన్‌పై వాడుతోంది. ఇప్పుడు కొరియా ద్వీపకల్ప పరిస్థితుల్నీ పుతిన్ పర్యటన ప్రభావితం చేయొచ్చు’ అని పేర్కొన్నారు.
AP: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు వెలగపూడి సచివాలయానికి రానున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ తొలిసారి సచివాలయానికి వస్తుండటంతో ఘనస్వాగతం పలికేందుకు అమరావతి రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తన ఛాంబర్‌ను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం CM చంద్రబాబుతో భేటీ కానున్నారు. రేపు డిప్యూటీ సీఎంగా జనసేనాని బాధ్యతలు స్వీకరించనున్నారు.
AP: అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలన్నీ ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్‌తో ఓటింగ్ నిర్వహిస్తున్నాయని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవడానికి మనం కూడా ఆ దిశగా అడుగులు వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయం జరగడమే కాకుండా జరిగినట్లు కనిపించాలని జగన్ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యం ఎలాంటి సందేహాలు లేని వ్యవస్థగా పురోగమించాల్సిన అవసరం ఉందన్నారు.
TG: మంత్రిగా పనిచేస్తున్నప్పటికీ, తాను ఇంకా విద్యార్థినేనని కాంగ్రెస్ నేత సీతక్క అన్నారు. వ్యవస్థలో మార్పు కోసం గతంలో గన్ను పట్టి, తర్వాత సమాజ సేవ కోసం తిరిగి వచ్చానని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కురవిలోని గిరిజన ఏకలవ్య గురుకులాన్ని ఆమె సందర్శించారు. తాను ప్రస్తుతం ఎల్ఎల్ఎం రెండో సంవత్సరం చదువుతున్నానని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
AP: నేడు ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు అధికారులు రిజల్ట్స్ వెల్లడించనున్నారు. దాదాపు 1.40 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. మరోవైపు ఫస్టియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు సమాచారం.
AP: 2019 సంవత్సరానికి ముందు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నట్లయితే వాటికి పాత పేర్లను పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. 2019-24 మధ్య ప్రవేశపెట్టిన కొత్త పథకాలకు పేర్లను తొలగించాలంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ పేర్లు లేకుండానే పథకాలు కొనసాగించాలంది. పార్టీల రంగులు, జెండాలతో ఉన్న పాసుపుస్తకాలు, లబ్ధిదారుల కార్డులు, సర్టిఫికెట్ల జారీని వెంటనే నిలిపివేయాలని సూచించింది.
AP: పార్టీ సభ్యత్వ నమోదును జూలై నుంచి ప్రారంభించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. కూటమి విజయం కోసం కష్టపడి పనిచేసిన నాయకుల్ని వీలైనంత త్వరగా నామినేటెడ్ పదవుల్లో నియమించాలని కోరారు. SC, ST, BC, మైనార్టీ వర్గాల్లోని యువతను పార్టీలోకి స్వాగతించాలని సూచించారు. సీనియర్ల సూచనలు, జూనియర్ల మద్దతుతో పార్టీని బలోపేతం చేయాలని నిర్దేశం చేశారు.
TG: ఏపీ నుంచి ఉద్యోగులు తెలంగాణలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. రాష్ట్ర విభజన సమయంలో కొందరు TG ఉద్యోగులను ఏపీకి, ఏపీ వారిని TGకి కేటాయించారు. అప్పటి నుంచి వారు బదిలీలు కోరుతున్నారు. ఈ అంశం ఏళ్లుగా నానుతోంది. తాజాగా కొత్తగా ఏర్పడిన రేవంత్ ప్రభుత్వం కేవలం ఉద్యోగుల మార్పిడి సమాచారం సేకరించింది. దీంతో ఏపీ నుంచి ఉద్యోగులు TGలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది.
AP: రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. ఓ వైపు వర్షాలు కురుస్తుండగా, మరోవైపు వేడి, ఉక్కపోత కొనసాగుతోంది. నిన్న తునిలో అత్యధికంగా 40.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అదే సమయంలో పలు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఇవాళ అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.
టీ20 వరల్డ్ కప్‌లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా వెస్టిండీస్ రికార్డు నెలకొల్పింది. అప్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో 6 ఓవర్లలో వికెట్ నష్టపోయి 92 పరుగులు చేసింది. ఆ తర్వాతి స్థానంలో నెదర్లాండ్స్(91/1) ఉంది. మరోవైపు ఈ మ్యాచులో అఫ్గానిస్థాన్ బౌలర్ అజ్మతుల్లా వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో 36 పరుగులు వచ్చాయి. ఇందులో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు, 10 ఎక్స్‌ట్రాలు ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.