India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: కూరగాయల ధరలు 2-3 వారాల వ్యవధిలోనే 30-60 శాతం పెరిగాయి. రాష్ట్రంలో కూరగాయల పంటల సాగు 3.11 లక్షల ఎకరాలకే పరిమితమవడం, ఉత్పత్తి తగ్గడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మే 20న కిలో ఉల్లి ₹20 పలకగా ఇప్పుడు ₹40-50కి చేరింది. టమాటా ₹60-90, వంకాయ ₹40-50, పచ్చి మిర్చి ₹80-120 ధర పలుకుతోంది. బీన్స్, క్యారట్, బీట్‌రూట్, క్యాప్సికం, కాకరకాయ, పుదీనా, కొత్తిమీర ధరలు కూడా రెట్టింపు అయ్యాయి.
రేణుకా స్వామి అనే వ్యక్తి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్, నటి పవిత్ర గౌడ అరెస్టయిన సంగతి తెలిసిందే. రేణుకా స్వామి తనకు అశ్లీల చిత్రాలు పంపిన విషయాన్ని దర్శన్‌కు చెప్పకుండా ఉండాల్సిందని పవిత్ర పోలీసుల వద్ద విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆమె బాధపడ్డారట. మరోవైపు మర్మాంగంపై దర్శన్ తన్నడంతోనే రేణుక మృతిచెందాడని విచారణలో తేలినట్లు సమాచారం.
NEET UG పరీక్షల్లో జరిగిన అవకతవకలపై కేంద్రం స్పందించి తక్షణమే సమస్యను పరిష్కరించాలని YCP తిరుపతి MP మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. ‘తమకు న్యాయం చేయాలని కోరుతూ ఫ్యూచర్ డాక్టర్లు రోడ్లపైకి రావడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై NTA, కేంద్ర వైద్యారోగ్యశాఖ, అమిత్‌షా దృష్టిసారించి త్వరగా పరిష్కరించాలి. దేశం & ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశాన్ని మేము పార్లమెంటులో లేవనెత్తుతాం’ అని ఆయన ట్వీట్ చేశారు.
జీ7 సమావేశాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీలో భేటీ కానున్నారు. గతేడాది భారత్‌లో జరిగిన జీ20 సమ్మిట్ తర్వాత వీరిద్దరూ సమావేశం కావడం ఇదే తొలిసారి. వీరిద్దరూ సిక్కు వేర్పాటువాదం గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా బ్రిటన్ PM రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, ఇటలీ PM జార్జియా మెలోని, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీతో కూడా మోదీ భేటీ కానున్నారు.
TG: గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకల వ్యవహారంపై ఈడీ దూకుడు పెంచింది. పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఏసీబీ నమోదు చేసిన కేసుపై ఆరా తీసింది. గొర్రెల పంపిణీలో అవకతవకలపై వివరాలు ఇవ్వాలని ఆ శాఖ ఎండీకి లేఖ రాసింది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 22న ప్రారంభం కానున్నట్లు సమాచారం. అదే రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 9 వరకు కొనసాగనున్నాయట. ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 1న కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.
విజయ్ సేతుపతి నుంచి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘మహారాజ’. హీరో బిడ్డను కాపాడిన లక్ష్మి కిడ్నాప్ కావడం, ఇంతకీ ఆమె ఎవరనేది డైరెక్టర్ ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఫస్టాఫ్ కొంచెం కన్ఫ్యూజింగ్‌గా అనిపించినా సెకండాఫ్ ఊహించని ట్విస్టులతో సాగుతుంది. విజయ్ నటన, BGM, స్క్రీన్ ప్లే, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్స్, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. స్టోరీ నెమ్మదిగా సాగడం కాస్త మైనస్.
RATING: 3/5
AP: వైసీపీ హయాంలో క్రీడాశాఖ మంత్రిగా ఉన్న RK రోజా ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో రూ.100 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఆత్యా-పాత్యా సంఘం నేతలు CID ఫిర్యాదు చేశారు. ఆమెతోపాటు శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని కూడా విచారించాలని CIDని కోరారు. గత ఐదేళ్లలో పనిచేసిన శాప్ MDలు, DSDOలపై కూడా విచారణ చేయాలని పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటా కింద పలు విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందినవారిని విచారించాలన్నారు.
టీ20 వరల్డ్ కప్ నుంచి న్యూజిలాండ్ నిష్క్రమించింది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడి గ్రూప్ సిలో పాయింట్ల పట్టికలో చివరన నిలిచింది. మరో రెండు నామమాత్రపు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఇదే గ్రూపులో వెస్టిండీస్, అఫ్గానిస్థాన్ చెరో 6 పాయింట్లతో సూపర్-8కు చేరుకున్నాయి. కివీస్‌తోపాటు ఉగాండా, పపువా న్యూ గినియా జట్లు కూడా ఎలిమినేట్ అయ్యాయి.
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఎమర్జెన్సీలో రక్తదాతలను గుర్తించడం ఎలానో తెలుసుకుందాం.
– PAYTM యాప్‌లో బ్లడ్ డోనర్‌ను గుర్తించవచ్చు. ‘BLOOD’ అని సెర్చ్ చేయాలి. మీ లొకేషన్‌ను మెన్షన్ చేస్తే.. ఏ ఆర్గనైజేషన్‌లో ఏగ్రూపు బ్లడ్ ఎన్ని యూనిట్స్ అందుబాటులో ఉన్నాయో వారి అడ్రస్, మొబైల్ నంబర్ చూపిస్తుంది.
– <
SHARE IT
Sorry, no posts matched your criteria.