India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాజమండ్రి ఎంపీ స్థానంలో పురందీశ్వరి లక్ష ఓట్ల మెజార్టీని దాటారు. ప్రస్తుతం 1,15,566 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అనకాపల్లిలో సీఎం రమేశ్(BJP) 32 వేలు, నర్సాపురంలో శ్రీనివాసవర్మ(BJP) 58 వేల ఓట్ల లీడింగులో ఉన్నారు. ఇక కాకినాడలో జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్‌కు 32,241, మచిలీపట్నంలో బాలశౌరి(జనసేన) 25,364 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, సిట్టింగ్ ఎంపీ శశిథరూర్ తిరువనంతపురంలో విజయం కోసం చెమటోడుస్తున్నారు. ఆయనపై కేంద్రమంత్రి, బీజేపీ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ 4,948 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తిరువనంతపురంలో శశిథరూర్ మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఆయన 99,989 ఓట్లతో ఘన విజయం సాధించారు.
ఉత్తరాంధ్రలో NDA కూటమి దూసుకెళ్తోంది. మొత్తం 34 అసెంబ్లీ స్థానాలకుగాను 30 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కేవలం నాలుగు స్థానాల్లోనే వైసీపీ ఆధిక్యంలో ఉంది. 2019 ఎన్నికల్లో 34 స్థానాలకుగాను 28 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ.. ఈసారి ఘోరంగా వెనుకబడింది. కేవలం పాడేరు, అరకు, సాలూరు, పాలకొండలో మాత్రమే వైసీపీ ఆధిక్యంలో ఉంది. అటు MP స్థానాల్లో అరకులో మాత్రమే YCP ఆధిక్యంలో ఉంది.
కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ దూసుకెళ్తున్నారు. 6వ రౌండ్ ముగిసే సమయానికి 76వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 5వ రౌండ్ ముగిసే సమయానికి 55వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు వెనుకంజలో ఉన్నాయి.
మహారాష్ట్రలో ఇండియా కూటమి అనూహ్యంగా ఆధిక్యంలోకి వచ్చింది. 26 సీట్లలో లీడింగ్‌లో కొనసాగుతోంది. ఎన్డీయే 21 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో పోరు హోరాహోరీగా సాగుతోంది. సుప్రియా సూలే(NCP SP), నితిన్ గడ్కరీ (బీజేపీ) ఆధిక్యంలో ఉండగా, నవనీత్ రానా (బీజేపీ) వెనుకంజలో ఉన్నారు.
నాగర్‌కర్నూల్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్కకు ఉ.11గంటల వరకు 1032 ఓట్లు వచ్చాయి. అదే సమయానికి నోటాకు 1500 ఓట్లు పడ్డాయి. అంటే ఆమె కంటే ఎక్కువ ఓట్లు నోటాకే పడ్డాయి.
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ముందంజలో కొనసాగుతున్నారు. ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ స్థానం నుంచి బరిలో ఉన్న ఆయన బీజేపీ అభ్యర్థి సుబ్రత్‌పై 40వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఉన్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కీలకంగా భావించే ఈ రాష్ట్రంలో బీజేపీ, INDIA కూటమి మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. కాగా UPలో SP 62, కాంగ్రెస్ 17 స్థానాల్లో బరిలో దిగింది.
ఖమ్మం, నల్గొండలో కాంగ్రెస్ జోరు సాగుతోంది. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి 12వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి లక్షా 86ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి 6వ రౌండ్ ముగిసే సమయానికి లక్షా 70వేల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో వీరిద్దరు గెలవడం ఖాయంగా కనిపిస్తోంది.
AP: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దర్శి, గిద్దలూరులో మాత్రమే వైసీపీ ఆధిక్యంలో ఉంది. మిగతా 10 స్థానాల్లో టీడీపీ లీడింగ్‌లో కొనసాగుతోంది. యర్రగొండపాలెం, మార్కాపురం, ఒంగోలు, కందుకూరు, అద్దంకి, కొండపి, సంతనూతలపాడు, చీరాల, కనిగిరి, పర్చూరులో టీడీపీ ఆధిక్యంలో ఉంది.
➢మాచర్లలో జూలకంటి బ్రహ్మానందరెడ్డి: 30876 ఓట్ల ఆధిక్యం
➢బాపట్లలో వేగేశన నరేంద్రవర్మ: 30978 ఓట్ల ఆధిక్యం
➢సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ: 24713 ఓట్ల ఆధిక్యం
➢పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర: 24819 ఓట్ల ఆధిక్యం ➢వేమూరు(ఎస్సీ)లో నక్కా ఆనందబాబు: 10810 ఓట్ల ఆధిక్యం ➢గుంటూరు వెస్ట్‌లో మహమ్మద్ నసీర్ అహ్మద్: 15582 ఓట్ల ఆధిక్యం ➢చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు: 11797 ఓట్ల ఆధిక్యం
Sorry, no posts matched your criteria.