News September 18, 2025

‘మార్కో’ సీక్వెల్‌‌‌కు ఉన్ని ముకుందన్ దూరం!

image

మలయాళ సూపర్ హిట్ మూవీ ‘మార్కో’కు సీక్వెల్ రానుంది. ‘లార్డ్ మార్కో’గా రానున్న ఈ చిత్రంలో హీరోగా ఉన్ని ముకుందన్ నటించట్లేదని సినీ వర్గాలు తెలిపాయి. వేరే హీరోతో ఈ మూవీని తెరకెక్కిస్తారని పేర్కొన్నాయి. ‘మార్కో’పై వచ్చిన నెగిటివిటీ కారణంగా పార్ట్-2 చేసేందుకు ఆసక్తి లేదని గతంలోనే ఉన్ని తెలిపారు. ప్రస్తుతం ఆయన ప్రధాని మోదీ బయోపిక్ ‘మా వందే’లో లీడ్ రోల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

News September 18, 2025

చేతిలో బిట్ కాయిన్‌తో ట్రంప్ విగ్రహం

image

క్రిప్టో కరెన్సీకి మద్దతిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌ విగ్రహాన్ని ఇన్వెస్టర్లు ఏర్పాటు చేశారు. వాషింగ్టన్ DCలోని యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ బయట 12 అడుగుల ట్రంప్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చేతిలో బిట్ కాయిన్‌తో బంగారు వర్ణంలో ఈ విగ్రహం ఉంది. దీన్ని వెండి, అల్యూమినియంతో తయారు చేసి, బంగారు పూత వేసినట్లు తెలుస్తోంది. ఫెడరల్ రిజర్వు వడ్డీ <<17745765>>రేట్లు<<>> తగ్గించిన కాసేపటికే దీన్ని ఆవిష్కరించారు.

News September 18, 2025

APPLY NOW: ఇస్రో‌లో ఉద్యోగాలు

image

<>ఇస్రో<<>>లో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు గుడ్‌‌న్యూస్. ఇస్రో అనుబంధ సంస్థ స్పేస్ అప్లికేషన్ సెంటర్‌ 7 అసిస్టెంట్(రాజ్యభాష) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 2వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

News September 18, 2025

RTCలో డ్రైవర్ పోస్టులు.. అర్హతలు ఇవే

image

TGSRTCలో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజైన సంగతి తెలిసిందే. డ్రైవర్ పోస్టులకు వయో పరిమితి 22 ఏళ్ల నుంచి 35 ఏళ్లుగా నిర్ణయించారు. కనీస విద్యార్హత పదో తరగతి పాసై ఉండాలి. పేస్కేల్ రూ.20,960-60,080గా ఉంటుంది. హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ (HPMV), హెవీ గూడ్స్ వెహికల్ (HGV) లేదా ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News September 18, 2025

HEALTH: ఇవి పాటిస్తే రోగాలు దూరం!

image

* ఆరోగ్యకరమైన కిడ్నీల కోసం పుష్కలంగా నీరు తాగండి
* గుండె ఆరోగ్యం కోసం అధికంగా ఉప్పు తినకూడదు
* పొగ తాగకుండా ఉంటే మీ ఊపిరితిత్తులు సేఫ్
* రోజూ 8 గంటలు నిద్రపోతే మెదడు ఆరోగ్యంగా ఉండి చురుగ్గా పనిచేస్తుంది
* పొట్ట ఆరోగ్యం కోసం ఐస్‌క్రీమ్స్, చల్లని పదార్థాలు తినడం మానేయాలి
* మూత్రనాళం ఆరోగ్యానికి పచ్చి ఉల్లిపాయలు మంచివని వైద్యులు చెబుతున్నారు.

News September 18, 2025

27 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

image

ఐఐటీ ఢిల్లీలో 4 ప్రాజెక్ట్ సైంటిస్టు పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఈ నెల 30 ఆఖరు తేదీ. ఐఐటీ హైదరాబాద్‌లో 4 రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు ఈనెల 26 వరకు, మునిషన్స్ ఇండియా లిమిటెడ్‌లో 14 ఇంజినీర్ పోస్టులకు ఈ నెల 28వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్‌లో 5 ఉద్యోగాలకు అక్టోబర్ 3 వరకు అవకాశం ఉంది.

News September 18, 2025

3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్

image

AP: ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న సీఎం చంద్రబాబు బీచ్‌ను సందర్శించి, రూ.97 కోట్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కి.మీ దూరం ఉంటుంది.

News September 18, 2025

శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.

News September 18, 2025

ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) 35 ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీటెక్/BE ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈనెల 24వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 28ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.177. SC, ST, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

News September 18, 2025

మైథాలజీ క్విజ్ – 9

image

1. రాముడికి ఏ నది ఒడ్డున గుహుడు స్వాగతం పలికాడు?
2. దుర్యోధనుడి భార్య ఎవరు?
3. ప్రహ్లాదుడు ఏ రాక్షస రాజు కుమారుడు?
4. శివుడి వాహనం పేరు ఏమిటి?
5. మొత్తం జ్యోతిర్లింగాలు ఎన్ని?
<<-se>>#mythologyquiz<<>>