News April 7, 2024

పెరిగిపోతున్న నోటా ఓట్లు.. ప్రభావం శూన్యం?

image

దేశంలో నిర్వహిస్తున్న ఏ ఎన్నికల్లోనైనా నోటా ఓట్లు పెరిగిపోతున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 60,00,197 ఓట్లు నోటాకు పోలయ్యాయి. 2019లో ఈ సంఖ్య 65,22,772కి చేరింది. ఈ విధానాన్ని NOTA (నన్ ఆఫ్ ద ఎబౌ) పేరుతో 2013లో అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే నోటా అనేది రాజకీయ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపట్లేదని, ఇది కోరల్లేని పాములా తయారైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. <<-se>>#Election2024<<>>

News April 7, 2024

బట్లర్ రికార్డు

image

రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ బట్లర్ అరుదైన రికార్డు నెలకొల్పారు. RR తరఫున అత్యధికంగా 11 POTM అవార్డులు గెలుచుకున్న ప్లేయర్‌గా నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో రహానే(10) ఉన్నారు. అంతేకాకుండా ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా గేల్(6) రికార్డును సమం చేశారు. దీంతో పాటు RR తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కెప్టెన్ శాంసన్(3,389) తర్వాతి స్థానంలో బట్లర్(2,831) నిలిచారు.

News April 7, 2024

ఎన్ని నదులున్నాయో అంబటికి తెలుసా?: CBN

image

AP: రాష్ట్రంలో ఎన్ని నదులున్నాయో అంబటి రాంబాబుకు తెలుసా? అని చంద్రబాబు ప్రశ్నించారు. నిన్న సత్తెనపల్లిలో ప్రచారం చేసిన ఆయన.. ‘క్యూసెక్కుకి, టీఎంసీకి తేడా తెలుసా? రాంబాబుకు మంత్రి పదవి ఇచ్చింది నన్ను, పవన్‌ను తిట్టడానికే. ఆయన సంక్రాంతి సంబరాల్లో డాన్సులు వేస్తున్నాడు. పోలవరం నిర్మించి డాన్సులు వేసి ఉంటే అందరూ చప్పట్లు కొట్టేవారు. రాంబాబును చిత్తుగా ఓడించి కన్నాను గెలిపించాలి’ అని కోరారు.

News April 7, 2024

3 రోజులు వర్షాలు!

image

AP: రాష్ట్రంలో రేపటి నుంచి 3 రోజులపాటు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ కూడా ఉందని హెచ్చరించింది. పగటి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గి ఊరటనిస్తాయని తెలిపింది. అటు తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఉంటాయని పేర్కొంది.

News April 7, 2024

మలయాళ చిత్రాలదే హవా

image

ఈ ఏడాది మలయాళ చిత్రాల హవా కొనసాగుతోంది. తొలి మూడు నెలల్లో విడుదలైన సినిమాల్లో ఏకంగా 3 చిత్రాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసి మలయాళ ఇండస్ట్రీలో ఆల్ టైం రికార్డు సృష్టించింది. ఇక ‘ప్రేమలు’ మూవీ రూ.125 కోట్లకు పైగా రాబట్టగా, ‘ది గోట్ లైఫ్’ రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లతో దూసుకుపోతోంది.

News April 7, 2024

రికార్డు స్థాయిలో యూపీఐ లావాదేవీలు

image

దేశంలో యూపీఐ లావాదేవీల జోరు కొనసాగుతోంది. 2023-24 FYలో ఈ సంఖ్య తొలిసారి 10వేల కోట్లను దాటి 13,100 కోట్లకు చేరింది. ఈ లావాదేవీల విలువ రూ.199.89 లక్షల కోట్లుగా ఉంది. 2022-23 FYలో 8,400 కోట్ల లావాదేవీలు జరగగా, వాటి విలువ రూ.139.1 లక్షల కోట్లుగా ఉంది. కాగా ఆ తర్వాతి ఏడాది సంఖ్యలో 57శాతం, విలువలో 44శాతం వృద్ధి నమోదవడం గమనార్హం.

News April 7, 2024

విరాట్ కోహ్లీ సెంచరీపై తీవ్ర విమర్శలు

image

నిన్న RRపై విరాట్ చేసిన సెంచరీపై విమర్శలు వస్తున్నాయి. సెంచరీకి కోహ్లీ 67 బంతులు తీసుకున్నారని, చివరి ఓవర్లలో సింగిల్స్ తీయడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కోహ్లీ వేగంగా ఆడి ఉంటే స్కోర్ 200 దాటేదని, అతడిది స్వార్థపూరిత ఇన్నింగ్స్ అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే జట్టులో మిగతా ప్లేయర్లు ఏమాత్రం సపోర్ట్ చేయకపోయినా కోహ్లీ సూపర్ సెంచరీ చేశారని కొందరు మద్దతుగా నిలుస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News April 7, 2024

IPLలో స్లోయెస్ట్ సెంచరీలు

image

67 బంతులు- విరాట్ కోహ్లీ (2024)
67- మనీశ్ పాండే (2009)
66- జోస్ బట్లర్ (2022)
66- సచిన్ (2011)
66- డేవిడ్ వార్నర్ (2010)

News April 7, 2024

ఉదయాన్నే బ్రష్ చేయకపోతే క్యాన్సర్ ముప్పు!

image

ఉదయాన్నే బ్రష్ సరిగ్గా చేయకపోతే పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని US పరిశోధకులు హెచ్చరించారు. ఫ్రెడ్‌హట్చిన్‌సన్ క్యాన్సర్ కేంద్రానికి చెందిన పరిశోధకులు 200 మంది క్యాన్సర్ బాధితులపై రీసెర్చ్ చేశారు. బాధితుల్లోని సగం కణతుల్లో దంతాల్లో ఉండే సూక్ష్మజీవులున్నట్లు గుర్తించారు. ఇవి క్యాన్సర్‌కు కారణమవుతాయని నిర్ధారించారు. 20-49 ఏళ్ల వయస్సు వారు దీని బారిన పడటం ఏడాదికి 1.5% పెరుగుతోందని తెలిపారు.

News April 7, 2024

కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

image

ఐపీఎల్‌లో అత్యధిక క్యాచులు (110) అందుకున్న ఫీల్డర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించారు. అతని తర్వాత వరుసగా సురేశ్ రైనా (109), కీరన్ పొలార్డ్ (103), రోహిత్ శర్మ (99), శిఖర్ ధవన్ (98), రవీంద్ర జడేజా (98) ఉన్నారు. అలాగే ఓడిన మ్యాచుల్లో అత్యధిక సెంచరీలు(3) చేసిన ఆటగాడిగానూ కోహ్లీ నిలిచారు.

error: Content is protected !!