News April 5, 2024

ప్రముఖ తెలుగు యాంకర్ మృతి

image

ప్రముఖ తెలుగు న్యూస్ యాంకర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. గుండెపోటుతో చికిత్స పొందుతూ HYD యశోద ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. DDలో వార్తలు చదివిన తొలి తెలుగు యాంకర్. ఇప్పటి న్యూస్ రీడర్లు ఎందరికో గురువు. 1978లో న్యూస్ చదవడానికి JOBలో చేరిన ఆయనకు వార్తలు చదివేందుకు 1983 వరకు వేచి చూడాల్సి వచ్చింది. ప్రాంప్టర్ లేని సమయంలో తప్పులు లేకుండా జాగ్రత్తగా ఆయన వార్తలు చదివేవారు. 2011లో పదవీ విరమణ చేశారు.

News April 5, 2024

గురుకుల విద్యార్థులకు గుడ్‌న్యూస్

image

TG: SC, ST గురుకులాల పరిధిలోని 54 సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లలో 8వ తరగతి నుంచే IIT, మెడిసిన్ ఫౌండేషన్ కోర్సులు అందించనున్నారు. రోజువారీ పాఠాలతో పాటు ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌పై వీటిని బోధించనున్నారు. 2024-25 విద్యాసంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. విద్యార్థులకు రెండేళ్ల పాటు ఆన్‌లైన్ కంటెంట్ ఫ్రీగా అందించనున్నారు. ప్రతిష్ఠాత్మక సంస్థల్లో విద్యార్థులు అత్యధిక సీట్లు సాధించేలా శిక్షణనివ్వనున్నారు.

News April 5, 2024

LS ఎలక్షన్స్: సింగిల్ డిజిట్ తేడాతో గెలిచింది వీరే

image

లోక్‌సభ ఎన్నికల్లో 1962 నుంచి ఇప్పటివరకూ ఇద్దరు అభ్యర్థులు సింగిల్ డిజిట్ తేడాతో గెలిచారు. 1989లో ఉమ్మడి APలోని అనకాపల్లి స్థానానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కొణతాల రామకృష్ణ 9 ఓట్ల తేడాతో గెలిచారు. ఆ తర్వాత 1998లో బిహార్‌లోని రాజ్‌మహల్‌లో BJP అభ్యర్థి సోం మరాండీ కూడా 9 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా రామకృష్ణ ప్రస్తుతం అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి JSP అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. <<-se>>#Elections2024<<>>

News April 5, 2024

ఐపీఎల్ మ్యాచ్‌ల వీక్షణలో సరికొత్త రికార్డ్

image

IPL-2024 సీజన్ రికార్డ్ వ్యూస్‌ని సొంతం చేసుకుంది. తొలి పది మ్యాచ్‌లను టీవీల్లో 35 కోట్ల మంది వీక్షించినట్లు బ్రాడ్‌కాస్టర్ డిస్నీస్టార్ వెల్లడించింది. ఇది ఇప్పటిదాకా జరిగిన అన్ని సీజన్ల కంటే అత్యధికం కాగా ఓవరాల్ వాచ్‌టైమ్ 8,028 కోట్ల నిమిషాలుగా ఉంది. ఇది గతేడాదికన్నా 20 శాతం ఎక్కువ. ఈ సీజన్‌లో RCB, చెన్నై మధ్య జరిగిన తొలి మ్యాచ్‌ను ఏకంగా 16.8 కోట్ల మంది వీక్షించిన సంగతి తెలిసిందే.

News April 5, 2024

రేపటి నుంచి ప్రజల్లోకి పవన్ కళ్యాణ్

image

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రేపు నెల్లిమర్ల, ఏప్రిల్ 7న అనకాపల్లి, ఏప్రిల్ 8న ఎలమంచిలి నియోజకవర్గాల్లో జరిగే వారాహి విజయ భేరి యాత్రలో ఆయన పాల్గొననున్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. తీవ్ర జ్వరం నుంచి కోలుకోవడంతో ఆయన ప్రచార షెడ్యూల్‌ను పార్టీ విడుదల చేసింది.

News April 5, 2024

చంద్రబాబు.. మీ దిమ్మ తిరుగుతుంది: VSR

image

AP:ప్రజలు జగన్‌ను మరోసారి CMగా చూడాలని నిర్ణయించుకున్నారని YCP MP విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. ‘మీ న’మ్మక’స్తుడు నిమ్మగడ్డ రమేశ్‌తో వాలంటీర్లపై విషం చిమ్మించావు. వదిన పురందీశ్వరితో 22 మంది IPSలపై ఫిర్యాదు చేయించావు. ఆలిండియా సర్వీస్ ఉద్యోగుల నైతిక స్థైర్యం దెబ్బతీసేలా దొంగ దెబ్బ కొడుతున్నా అనుకుంటున్నావేమో. ప్రజలు కొట్టే దెబ్బకు మీ దిమ్మ తిరుగుతుంది. ఇవే మీకు ఆఖరి ఎలక్షన్లు’ అని ట్వీట్ చేశారు.

News April 5, 2024

నేడు, రేపు జాగ్రత్త!

image

TS: రాష్ట్రంలో ఇవాళ, రేపు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని తెలిపింది. ఉ.11 నుంచి మ.3 వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో వృద్ధులు, పిల్లలు బయటకు రావొద్దని సూచించింది. నిన్న నల్గొండ(D) ఇబ్రహీంపేటలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, 2016 తర్వాత ఈ ఏడాదే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని పేర్కొంది.

News April 5, 2024

నేడు, రేపు అత్యధిక ఉష్ణోగ్రతలు

image

AP: నేడు, రేపు భానుడు ఉగ్రరూపం దాల్చనున్నాడు. విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం రాష్ట్రంలో కొన్ని చోట్ల 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అనంతపురం(D)లో 41 నుంచి 43 డిగ్రీలు, పల్నాడు, NTR జిల్లాల్లో 41-44, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూ.గో జిల్లాల్లో 41-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. నిన్న నంద్యాల(D) చాగలమర్రిలో గరిష్ఠంగా 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

News April 5, 2024

రేపటి నుంచే పరీక్షలు

image

ఏపీలో సమ్మెటివ్ అసెస్‌మెంట్-2 వార్షిక పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ముందుగా ప్రకటించినట్లుగా ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. పరీక్షల తేదీలు మారినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు.

News April 5, 2024

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాగా నిన్న శ్రీవారిని 62,549 మంది భక్తులు దర్శించుకున్నారు. అదే సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు సమకూరింది.

error: Content is protected !!