India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: న్యాయం కోసం పోరాడుతున్న తనకు ప్రజల ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నట్లు వైఎస్ షర్మిల తెలిపారు. ‘దేవుడి దీవెనలతో, నాన్న ఆశీర్వాదంతో, అమ్మ ప్రేమతో, చిన్నాన్న చివరి కోరిక నెరవేర్చేందుకు ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నా. మీ రాజన్న బిడ్డను దీవించాలని ప్రజలను కోరుకుంటూ ఎన్నికల శంఖారావం పూరించనున్నా. న్యాయం కోసం పోరాడుతున్న ఈ యుద్ధంలో మీ ఆశీస్సులు నాపై ఉంటాయని ఆశిస్తున్నా’ అని ఆమె ట్వీట్ చేశారు.
సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో హృతిక్ రోహన్, దీపికా పదుకొణే జంటగా నటించిన ఫైటర్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అదరగొడుతోంది. 10 రోజుల్లోనే 12.5M వ్యూస్ సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత వేగంగా ఈ మార్క్ చేరుకున్న బాలీవుడ్ సినిమాగా నిలిచినట్లు తెలిపారు. యానిమల్, డంకీ చిత్రాల రికార్డులను బ్రేక్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం థియేటర్లలో దాదాపు రూ.350 కోట్ల కలెక్షన్లను సాధించింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ మూవీ ‘పుష్ప-2’. ఈ సినిమా టీజర్ ఏప్రిల్ 8న విడుదల కానుండగా మాస్ జాతర మరో నాలుగు రోజుల్లో అంటూ పుష్ప టీమ్ ట్వీట్ చేసింది. దీనికి ఓ ఫొటోను జతచేసి ‘పుష్ప ది రూల్ టీజర్.. ఉత్సాహం, ఉల్లాసం, అనుభూతిని పంచుతుంది’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న గ్రాండ్‌గా రిలీజ్ అవుతుందని మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు.
AP: బీజేపీ, జనసేనతో కలిసి 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏవైనా అమలు చేశారా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. నాయుడుపేట సభలో మాట్లాడుతూ.. ‘రూ.87వేల కోట్ల రైతు రుణ మాఫీ చేశారా? రూ.14వేల కోట్ల డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేశారా? ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్ చేశారా? ఇంటింటికీ ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇచ్చారా? పేదలకు ఒక్క సెంటు స్థలం ఇచ్చారా? రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చారా?’ అని నిలదీశారు.
AP: తనకు పేదలపై ఉన్న ప్రేమ దేశంలో ఏ నాయకుడికీ లేదని సీఎం జగన్ తెలిపారు. ‘అన్ని వర్గాలకూ మంచి చేశాననే ఆత్మవిశ్వాసంతో ప్రజల ముందుకొచ్చాను. సాధ్యంకాని హామీలను నేను మేనిఫెస్టోలో పెట్టను. జగన్ అమలు చేయలేని ఏ పథకమూ.. చంద్రబాబే కాదు ఆయన జేజమ్మ కూడా అమలు చేయలేదు. ఆయన చెప్పే అబద్ధపు హామీలతో నేను పోటీ పడాలనుకోవడం లేదు. మోసపు వాగ్దానాలు చేయను. అబద్ధాలు చెప్పను’ అని స్పష్టం చేశారు.
AP: తాము అధికారంలోకి వచ్చాక కూడా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబు స్పష్టం చేశారు. ‘వాలంటీర్ల వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. వారంతా వైసీపీకి పని చేయడం సరికాదు. ప్రజలకు సేవ చేయాలని వాలంటీర్లను కోరుతున్నా. ఎండలో సచివాలయానికి వెళ్లడం వల్ల ఒకరిద్దరు చనిపోయారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇచ్చే వీలుంది. కానీ జగన్ కావాలనే అలా చేయించలేదు’ అని చంద్రబాబు ఆరోపించారు.
AP: 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పేరు చెబితే కనీసం ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. ఆయన పేరు చెబితే వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు గుర్తుకు వస్తాయన్నారు. ‘జగన్‌కు నా అనేవాళ్లు పేదలు. చంద్రబాబుకు నా అనేవాళ్లు నాన్ లోకల్స్ అయిన TV5, ABN, ఈనాడు, దత్తపుత్రుడు. వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.
AP: విధ్వంస పాలకుడిగా రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని, ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని టీడీపీ చీఫ్ చంద్రబాబు మండిపడ్డారు. కొవ్వూరు ప్రజాగళం సభలో మాట్లాడిన ఆయన.. వైసీపీ డీఎన్‌ఏలోనే శవరాజకీయం ఉందని ఆరోపించారు. రక్తంలో మునిగిన వైసీపీకి ఓట్లు వేయొద్దని స్వయంగా జగన్ చెల్లే కోరుతున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే మిత్రపక్షాలతో కూటమిగా వచ్చామని చంద్రబాబు తెలిపారు.
రేపు తాను బీజేపీలో చేరుతున్నట్లు ప్రముఖ నటి, మాండ్య ఎంపీ సుమలత ప్రకటించారు. బెంగళూరులో బీజేపీ నేతల సమక్షంలో ఆ పార్టీలో జాయిన్ కానున్నట్లు తెలిపారు. మాండ్య పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధే ప్రధాన మంత్రంగా, మోదీనే మళ్లీ ప్రధాని కావాలనే ఆకాంక్షతో బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. కాగా గత ఎన్నికల్లో సుమలత ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు.
ఏటా వేసవికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దేశ ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపించొచ్చంటున్నారు నిపుణులు. ‘ఈసారి 10-20రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ కానున్న నేపథ్యంలో విద్యుత్, ఆహారం, వ్యాపారం, వడ్డీరేట్లు, GDP వృద్ధిపై ప్రభావం చూపొచ్చు. అధిక ఉష్ణోగ్రతలు పంట దిగుబడిని దెబ్బతీస్తే ఆ ప్రభావం వడ్డీరేట్లపైనా ఉంటుంది. విద్యుత్ కొరత, పరిశ్రమల ఉత్పాదకత తగ్గడం వంటి సవాళ్లు ఎదురవుతాయి’ అని హెచ్చరిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.