News April 4, 2024

‘కావలి’ ప్రజలకు ఎవరు కావాలో?

image

AP: నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గంలో 1952 నుంచి 15సార్లు ఎన్నికలు జరిగాయి. 6సార్లు INC, 3సార్లు TDP, YCP 2సార్లు, కిసాన్ మజ్దూర్, ప్రజా పార్టీ, స్వతంత్ర పార్టీ ఒక్కోసారి, ఇండిపెండెంట్ ఓసారి గెలిచారు. 2014, 19లో YCP నుంచి గెలిచిన ప్రతాప్ కుమార్ హ్యాట్రిక్ సాధిస్తానని ధీమాగా ఉండగా, TDP నుంచి కావ్య కృష్ణారెడ్డి తనదే గెలుపంటున్నారు. ఇద్దరికీ ఆర్థిక, అంగబలం ఉండటంతో పోటీ రసవత్తరంగా ఉండనుంది.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 4, 2024

ఘోరం.. భుజం తగిలిందని చంపేశారు

image

HYDలోని బేగంపేటలో ఘోరం జరిగింది. తరుణ్(18) మంగళవారం 10pmకు పాన్ షాప్‌కి వెళ్లాడు. అక్కడున్న సాయికిరణ్(21) భుజం తరుణ్‌కు తగిలి వాగ్వాదం మొదలైంది. సాయికిరణ్ ముగ్గురు రూమ్‌మేట్స్ శివశంకర్(24), ఎ.తరుణ్(21), పండు(22)లను తీసుకొచ్చాడు. దీంతో గొడవ ఘర్షణగా మారింది. ఆ నలుగురూ రూమ్‌లో కత్తి తీసుకొచ్చి.. తరుణ్‌ను పొడిచి పరారయ్యారు. తరుణ్ తల్లి అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. కేసు నమోదైంది.

News April 4, 2024

10 గ్రాముల బంగారం రూ.70,470

image

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరింది. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేట్ రూ.600 పెరిగి రూ.70,470కి చేరింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.500 పెరిగి రూ.64,600గా నమోదైంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనాలంటే వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. అటు కేజీ వెండి ధర కూడా రూ.1300 పెరిగి రూ.85,300కు చేరింది.

News April 4, 2024

సీఎం జగన్‌ను, నన్ను ఎవరూ ఓడించలేరు: కొడాలి నాని

image

AP: అభిమానులు తన కాళ్లకు <<12975332>>పాలాభిషేకం<<>> చేయడంపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మాజీ మంత్రి కొడాలి నాని ఫైరయ్యారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ మాదిరి వాళ్ల డప్పులు వాళ్లే కొట్టుకుంటూ, వాళ్ల దండలు వాళ్లే తెచ్చుకుంటున్నట్లు తాను చేయడం లేదని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో సీఎం జగన్‌ను, గుడివాడలో తనను ఎవరూ ఓడించలేరన్నారు. తాను 23వేల మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించానని తెలిపారు.

News April 4, 2024

చెప్పిన తేదీకే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్!

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప-2’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మే నెలాఖరులోగా బన్నీ పార్ట్ పూర్తవుతుందని, జూన్‌లో సినిమా మొత్తం షూటింగ్ కంప్లీట్ అవుతుందని సినీవర్గాలు తెలిపాయి. అయితే, ఐటమ్ సాంగ్ ఇంకా షూట్ చేయలేదని వెల్లడించాయి. ఎలాగైనా ఆగస్టు 15న సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈనెల 8న టీజర్ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

News April 4, 2024

గ్లాసు సింబల్‌పై విచారణ.. తీర్పు రిజర్వ్

image

AP: గాజు గ్లాసు సింబల్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇటీవల జనసేనను రిజిస్టర్ పార్టీగా గుర్తించిన ఈసీ.. గ్లాసును ఫ్రీ సింబల్‌గా ప్రకటించింది. దీంతో ఆ గుర్తును తమకు కేటాయించాలంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

News April 4, 2024

తుక్కు వాహనాలు దర్జాగా రోడ్డెక్కుతున్నాయ్!

image

హైదరాబాద్‌ మహానగరంలో కోటిన్నరకు పైగా జనాభా ఉండగా.. 80 లక్షలకు పైగా వాహనాలు ఉన్నట్లు ఆర్టీఏ డేటా చెబుతోంది. వీటిలో 21 లక్షలకు పైగా (25%) వాహనాలు 15 ఏళ్ల కంటే ఎక్కువ వయసుగలవే ఉన్నాయి. ఇందులో 17 లక్షల బైక్స్, 3.5 లక్షల కార్లు, లక్ష గూడ్స్ వాహనాలు, 20 వేల ఆటో-రిక్షాలు, 4000 క్యాబ్‌లు ఉన్నాయి. ఈ వాహనాల వల్ల వాయు కాలుష్యం పెరిగి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

News April 4, 2024

అసలేంటి ఇండస్ట్రియల్ ఆల్కహాల్ కేసు?

image

ఇథనాల్ అధిక మోతాదులో ఉండే ఇండస్ట్రియల్ ఆల్కహాల్‌లో ఇసోప్రొపైల్ రసాయనం కలవడం వల్ల ఇది తాగేందుకు పనికిరాదు. దీనిని కాస్మొటిక్స్, క్లీనింగ్ ప్రొడక్ట్స్, పెయింట్ సాల్వెంట్స్ మొదలైన ఉత్పత్తుల తయారీకి ఉపయోగిస్తారు. తాజాగా ఈ ఇండస్ట్రియల్ ఆల్కహాల్‌‌పై పూర్తి అధికారం రాష్ట్రాలకే దక్కాలని UP, బెంగాల్ ప్రభుత్వాలు సుప్రీంను ఆశ్రయించాయి. లిక్కర్, స్పిరిట్ తరహాలోనే ఇది కూడా తమ పరిధిలోదేనని వాదిస్తున్నాయి.

News April 4, 2024

షర్మిల ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు?: సజ్జల

image

AP: YS వివేకా హత్యపై ఐదేళ్లుగా మాట్లాడని షర్మిల ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ‘షర్మిల, సునీత వెనుక చంద్రబాబు ఉన్నారు. మా ప్రభుత్వం రక్తపుమడుగులో ఉందని ఎలా అంటారు? వివేకా హత్యతో జగన్‌కు సంబంధం ఏంటి? షర్మిల, చంద్రబాబు ఆరోపణలపై మేం స్పందించాల్సిన అవసరం లేదు. ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశం. వాళ్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు’ అని ఫైరయ్యారు.

News April 4, 2024

నేతన్నలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టింది: KTR

image

TG: నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోరా అని ప్రశ్నిస్తూ CM రేవంత్‌కు KTR బహిరంగ లేఖ రాశారు. ‘నేతన్నలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టింది. వారి బతుకులు ఆగమయ్యేలా ప్రభుత్వ విధానాలున్నాయి. నేతన్నలకు ఆర్డర్లు నిలిపివేశారు. చేనేతమిత్ర వంటి పథకాలను పక్కనపెట్టారు. గతంలో మాదిరిగా వారికి చేతినిండా ఆర్డర్లు ఇవ్వాలి. బతుకమ్మ చీరల ఆర్డర్ ఇచ్చి, పెండింగ్ బిల్లులను చెల్లించాలి’ అని డిమాండ్ చేశారు.

error: Content is protected !!