News April 4, 2024

ఈ దుస్థితికి చంద్రబాబే కారణం: సజ్జల

image

AP: వాలంటీర్లపై చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ‘వాలంటీర్ వ్యవస్థపై నిమ్మగడ్డ రమేశ్‌తో ఫిర్యాదు చేయించారు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసరికి వాలంటీర్లకు సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. ఇవాళ ఆయన వల్ల వృద్ధులు ఎండలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. రోజూ ఏదోక కారణంతో TDP నేతలు ECకి ఫిర్యాదులు చేస్తున్నారు’ అని ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు.

News April 4, 2024

ఎంపీ నవనీత్ రాణాకు సుప్రీంకోర్టులో ఊరట

image

మహారాష్ట్రలోని అమరావతి MP నవనీత్ రాణాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె క్యాస్ట్ సర్టిఫికెట్‌ను ధర్మాసనం సమర్థించింది. సర్టిఫికెట్‌ను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కనపెట్టింది. ఆమె ‘మోచి’ కుల ధ్రువీకరణ పత్రాన్ని మోసపూరితంగా పొందారని పేర్కొంటూ హైకోర్టు సర్టిఫికెట్‌ను రద్దు చేయగా, ఆమె SCని ఆశ్రయించారు. తాజాగా ఊరట లభించడంతో నేడు అమరావతి BJP MP అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.

News April 4, 2024

క్రికెట్ జట్టు కెప్టెన్ మృతి

image

పాపువా న్యూ గినియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ కాయా అరువా(33) మృతి చెందారు. 2019 T20WC క్వాలిఫయర్, 2021 WC క్వాలిఫయర్ టోర్నీల్లో కెప్టెన్‌గా జట్టును నడిపించారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన అరువాకు బ్యాటింగ్‌లోనూ మంచి రికార్డు ఉంది. టీ20ల్లో ఆమె 59వికెట్లు, 341 రన్స్ చేశారు. PNG తరఫున అత్యధిక వికెట్ల రికార్డు ఆమె పేరిటే ఉంది. జపాన్‌పై 5/7తో T20 చరిత్రలోనే రెండో ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన ఇచ్చారు.

News April 4, 2024

సుప్రీంకోర్టులో ‘లిక్కర్ ఫైట్’.. తండ్రి తీర్పును తిరగరాస్తారా?

image

సుప్రీంకోర్టులో CJI చంద్రచూడ్ ఆధ్వర్యంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం ఇండస్ట్రియల్ ఆల్కహాల్ రెవెన్యూపై విచారిస్తున్న వేళ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ధర్మాసనం సభ్యురాలైన జస్టిస్ బీవీ నాగరత్న తండ్రి, నాటి CJI బీవీ వెంకటరామయ్య ఇదే కేసుపై 1989లో తీర్పు ఇచ్చారు. రెవెన్యూపై కేంద్రానికి అనుకూలంగా ఆ తీర్పు ఉంది. మరి తండ్రి తీర్పును జస్టిస్ నాగరత్న తిరగరాస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

News April 4, 2024

వరల్డ్ కప్ సమీపిస్తోంది.. బ్యాటర్లు మెరవరేం?

image

ఓవైపు T20WC సమీపిస్తోంది. మరోవైపు IPLలో భారత కీలక ప్లేయర్లు రాణించలేకపోతున్నారు. జైస్వాల్(39రన్స్), రుతురాజ్(62), గిల్‌(75)తో పాటు సీనియర్లు రోహిత్‌శర్మ(69), రాహుల్(93), పాండ్య(69) తడబడుతున్నారు. బౌలర్లదీ అదే పరిస్థితి. బుమ్రా(3వికెట్లు), కుల్దీప్(3), చాహర్(3) పెద్దగా వికెట్లు తీయలేదు. కొందరు కొత్త క్రికెటర్లు రాణిస్తున్నప్పటికీ వారికి జట్టులో ఛాన్స్ దొరుకుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

News April 4, 2024

రాహుల్ గాంధీ ఆస్తి ఎంతంటే?

image

వయనాడ్ MP అభ్యర్థిగా నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ తన ఆస్తులను రూ.20 కోట్లుగా అఫిడవిట్‌లో చూపించారు. రూ.11.15 కోట్ల స్థిరాస్తులు, రూ.9.24 కోట్ల చరాస్తులున్నట్లు పేర్కొన్నారు. తన వద్ద రూ.55వేల నగదు ఉన్నట్లు తెలిపారు. సొంత కారు, ఇల్లు లేవని వెల్లడించిన రాహుల్.. సోదరి ప్రియాంకా గాంధీతో కలిపి ఢిల్లీలో వ్యవసాయ భూమి ఉన్నట్లు వివరించారు. రాహుల్‌కు గురుగ్రామ్‌లో రూ.9 కోట్ల విలువ చేసే ఆఫీస్ స్పేస్ ఉంది.

News April 4, 2024

భారతదేశపు ‘బెస్ట్ పోస్ట్‌మ్యాన్’ కన్నుమూత

image

దేశంలో ‘బెస్ట్ పోస్ట్‌మ్యాన్’గా గుర్తింపు పొందిన విక్టర్ ధన్‌రాజ్(90) కన్నుమూశారు. ఆయన డెడికేషన్‌కు మెచ్చిన ప్రభుత్వం 1988లో భారతదేశపు ఉత్తమ పోస్ట్‌మ్యాన్‌‌గా గుర్తించింది. బెంగళూరుకు చెందిన ధన్‌రాజ్ 1952లో పోస్టల్ డిపార్ట్‌మెంటులో చేరి.. 1992లో పదవీ విరమణ పొందారు. కాగా.. ఆయన ధరించిన యూనిఫామ్‌ను పోస్టల్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచినట్లు ఆయన కుమారుడు దీపక్ కుమార్ వెల్లడించారు.

News April 4, 2024

టెస్లాను హైదరాబాద్‌కు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోండి: KTR

image

‘టెస్లా’ కార్ల కంపెనీ ఇండియాలో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు. ‘టెస్లా ప్లాంట్‌ను మన రాష్ట్రానికి తీసుకురావడానికి TS ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేయాలని మనవి చేస్తున్నా. ప్రభుత్వ పారిశ్రామిక విధానాలను వారికి వివరించి టెస్లా బృందం హైదరాబాద్‌ను సందర్శించేలా చర్యలు తీసుకోండి’ అని ట్వీట్ చేశారు.

News April 4, 2024

‘జీరో’ అయిన బైజూస్ హీరో

image

భారతదేశపు ఎడ్‌టెక్ దిగ్గజం ‘బైజూస్’ వ్యవస్థాపకుడు రవీంద్రన్ జీరోకి పడిపోయారు. అతడి నెట్‌వర్త్ రూ.17,545కోట్ల నుంచి సున్నాకి మారిందని ఫోర్బ్స్ బిలియనీర్ ఇండెక్స్‌లో వెల్లడైంది. కరోనా సమయంలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కు డిమాండ్ పెరగడంతో బైజూస్ ఒక వెలుగు వెలిగింది. ఒకప్పుడు ప్రపంచంలోనే మోస్ట్ వాల్యూడ్ ఎడ్‌టెక్ సంస్థగా నిలిచిన బైజూస్ మనీలాండరింగ్ ఆరోపణలతో ఇటీవల తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది.

News April 4, 2024

కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ కౌంటర్

image

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన BRS ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వొదని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ కౌంటర్ పిటిషన్ వేసింది. ఆమె బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉందన్న ఈడీ.. ఈ కేసులో మరికొందరిని ప్రశ్నిస్తున్నామని, ఈ సమయంలో బెయిల్ ఇవ్వొద్దని కోరింది. ఈడీ కౌంటర్‌కు రీజాయిండర్ వేసేందుకు కవిత లాయర్లు సమయం కోరారు. ఈ కేసులో గత నెల 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది.

error: Content is protected !!