India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేజ్రీవాల్‌కు టీవీలో 18-20 ఛానల్స్ చూసేందుకు జైలు అధికారులు అనుమతిచ్చారు. 24 గంటలూ మెడికల్ స్టాఫ్ అందుబాటులో ఉంటారు. ఆయనకు డయాబెటిస్ సమస్య ఉండడంతో రెగ్యులర్ చెకప్‌లు చేయనున్నారు. వారానికి రెండు సార్లు ఫ్యామిలీతో మాట్లాడేందుకు అవకాశం ఇస్తారు. 3 పుస్తకాలు, టేబుల్, కుర్చీ, మందులు అనుమతించాలని ఆయన కోర్టును కోరారు. ఇందుకు కోర్టు అనుమతించిందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఆర్థిక భారం తగ్గించుకునేందుకు బడా సంస్థలు లేఆఫ్ ట్రెండ్ ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మెక్‌కిన్సే కంపెనీ సైతం వందలాది సీనియర్ ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. తమ సంస్థను వదిలి మరోచోట ఉపాధి వెతుక్కోవాలని ఉద్యోగులను కోరుతోంది. యూకేలోని మేనేజర్ స్థాయి ఉద్యోగులకు అయితే తొమ్మిది నెలల పాటు జీతం ఇస్తామని.. ఆ సమయాన్ని మరోచోట ఉద్యోగం సంపాదించుకునేందుకు ఉపయోగించుకోమని ఆఫర్ ఇచ్చింది.
యూపీలోని లక్నోలో ఓ వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. అక్రమ సంబంధం ఉందని అనుమానించి భార్య జ్యోతి మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. పిల్లలు పాయల్(6), ఆనంద్(3)ని గొంతు నులిమి చంపేశాడు. 3 రోజులు మృతదేహాల పక్కనే పడుకుని ఉదయం పనులకు వెళ్లాడు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు గది తాళాలు పగలగొట్టి డెడ్ బాడీలను పోస్టుమార్టానికి తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.
వాంఖడే వేదికగా ముంబైతో జరుగుతోన్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నారు.
MI: రోహిత్‌శర్మ, ఇషాన్‌కిషన్, తిలక్‌వర్మ, హార్దిక్ పాండ్య(C), టిమ్ డేవిడ్, నమన్ ధీర్, కోయెట్జీ, బుమ్రా, పీయూష్ చావ్లా, ఆకాశ్ మద్వాల్, క్వేనా మఫాకా.
RR: జైస్వాల్, బట్లర్, సంజు శాంసన్(w/c), పరాగ్, జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, బర్గర్, చాహల్.
లోక్‌సభ ఎన్నికలు మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ‘ఎన్నికల సంఘంలో కేంద్రం తమ మనుషుల్ని మోహరించిందని రాహుల్ అన్నారు. ఎటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా బీజేపీ 400 సీట్ల లక్ష్యాన్ని అందుకోలేదని మాట్లాడారు. ఎలక్షన్స్ తర్వాత రాజ్యాంగంలో మార్పులు చేస్తారని ఆరోపించారు’ అని బీజేపీ నేతలు పేర్కొన్నారు.
TG: బీఆర్ఎస్‌ను వీడిన కడియం శ్రీహరి కేసీఆర్‌పై బురద చల్లడం సరికాదని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. దళితులపై ఆయన లేనిపోని కుట్రలు చేశారని, వరంగల్‌లో కడియంపై చావు డప్పు కొడతామని హెచ్చరించారు. ముసలి నక్కలన్నీ కాంగ్రెస్‌లో చేరుతున్నాయని విమర్శించారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే వరంగల్ ఎంపీగా పోటీ చేస్తానని రసమయి ప్రకటించారు.
చెన్నైలోని ఎన్నోర్‌లో పీఎం ఆవాస్ యోజన కింద గత ప్రభుత్వం పేదలకు 6,877 ఫ్లాట్లు నిర్మించడం చర్చనీయాంశమైంది. ఆ పారిశ్రామిక ప్రాంతం నివాసానికి అనువైన ప్రదేశం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నా 2018లో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. అయితే ఇందులో నివసించేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. దీంతో ఆ ప్రాంతం ఘోస్ట్ టౌన్‌గా మారింది. కాగా సమీపంలో నివసించే ప్రజలు సైతం తమ పిల్లలు తరచూ అనారోగ్యం పాలవుతున్నారని వాపోతున్నారు.
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.850 పెరగడంతో రూ.63,600 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.930 పెరిగి రూ.69,380కి చేరింది. కేజీ వెండి ధర రూ.600 పెరగడంతో రూ.81,600కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
నోయిడాలో ఓ వ్యక్తి ఉబర్ ఆటో బుక్ చేయగా రూ.7 కోట్ల బిల్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి సైతం బెంగళూరులో ఇలాంటి అనుభవమే ఎదురైంది. అతను ఉబర్ ఆటో బుక్ చేయగా బిల్ రూ.250 వస్తుందనుకుంటే ఏకంగా రూ. కోటి వచ్చేసరికి షాక్ అయ్యాడు. అయితే, ఇది సాంకేతిక లోపం వల్ల జరిగినప్పటికీ డ్రైవర్‌తో పాటు తననూ ఆందోళనకు గురిచేసిందని సదరు వ్యక్తి సోషల్ మీడియాలో మొరపెట్టుకున్నాడు.
రాజకీయ నాయకులు దొంగలని అందరూ తిడుతుంటారని, అయితే వారిని అవినీతిపరులుగా మార్చింది ప్రజలేనని సినీ నటుడు సుమన్ చెప్పారు. అన్ని పార్టీల నేతల వద్ద డబ్బులు తీసుకుని వారు ఓట్లు వేస్తున్నారని విమర్శించారు. ఐదేళ్లు పాలన బాగుండాలంటే ప్రజలు ఆలోచించి ఓటువేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఉంటున్న తనకు ఏపీ రాజకీయాల గురించి అవసరం లేదని స్పష్టం చేశారు. తాను ఇప్పటికే సమాజ సేవలో ఉన్నానన్నారు.
Sorry, no posts matched your criteria.