India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రభుదేవా, నగ్మా జంటగా నటించిన సూపర్ హిట్ లవ్ స్టోరీ ‘ప్రేమికుడు’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే రీరిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ 1994లో తెలుగు, తమిళంలో రిలీజై సంచలన విజయం సాధించింది. ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలైట్. దివంగత SPB, వడివేలు, రఘువరన్, గిరీశ్ కర్నాడ్ కీలక పాత్రలు పోషించారు.
AP: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారించనుంది. స్కిల్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేయడాన్ని సీఐడీ సుప్రీంలో సవాల్ చేసింది. దీంతో కోర్టు తీర్పుపై ఆసక్తి నెలకొంది.
AP: మండల విద్యాధికారి-2(MEO-2)లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ప్రతినెలా రూ.1,000 ఫిక్స్‌డ్ ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటి వరకు MEO-1కు ఈ సదుపాయం ఉండగా, ఇకపై MEO-2లకూ అందించనుంది. పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు వీలుగా ప్రతి మండలంలో ఇద్దరు MEOలను గతేడాది ప్రభుత్వం నియమించింది. వారికి వేర్వేరుగా విధులను కేటాయించింది.
TG: ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం HYDలోని దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, సరూర్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, హయత్‌నగర్, చార్మినార్, కోఠి తదితర ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. కామారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మెదక్(D) కౌడిపల్లిలో ఈదురుగాలులు, వర్షం కారణంగా ఇంటి పైకప్పు కూలి మూడేళ్ల చిన్నారి సంగీత చనిపోయింది.
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఇవాళ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మరణించారు. మృతుల్లో డీవీసీ సభ్యులు వర్గీష్, మంగాతు, ప్లాటూన్ సభ్యులు కురసం రాజు, వెంకటేశ్ ఉన్నారు. వీరంతా తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన వారు. వీరిపై రూ.36 లక్షల రివార్డు ఉంది. సంఘటనా స్థలంలో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
TG: మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలో బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిసి కాంగ్రెస్‌లో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరేందుకు కుదరకపోతే బీజేపీలోకి వెళ్లేందుకైనా ఆయన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీజేపీ మరో జాబితా ప్రకటనపై కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో ఇవాళ ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాలు సహా 13 రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించి, పేర్లు ప్రకటించనుంది. తెలంగాణలోని 15 స్థానాలకు పేర్లు ప్రకటించగా.. మిగిలిన 2 స్థానాలు, పొత్తులో భాగంగా ఏపీలో పోటీ చేసే 6 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మనీలాండరింగ్ కేసు నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు. ‘లిక్కర్ కేసులో కవిత నేరం రుజువైంది. బూటకపు, రాజకీయ కేసులని ఆమె చేసిన వాదన అబద్ధమని తేలింది. నెయ్యి డబ్బాలంటూ ఆమె చెప్పిన కథలపై దర్యాప్తు జరుగుతుంది. సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో BRS రూ.వేల కోట్లు దాచింది’ అని తీహార్ జైలు నుంచి లేఖ రాశాడు.
TG: ఎన్నికల రోడ్‌షోలకు సెలవు రోజుల్లోనే అనుమతిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. ఇతర సమయాల్లో నిషేధం లేకున్నా, ప్రజలకు ఇబ్బంది లేకుండా అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఆస్పత్రులు, ట్రామాకేర్, బ్లడ్‌బ్యాంకులున్న ప్రాంతాల్లో రోడ్‌షోలు చేపట్టవద్దన్నారు. 85 ఏళ్లు పైబడిన, దివ్యాంగ ఓటర్లు 7.2 లక్షల మందికి నామినేషన్ల ఉపసంహరణ పూర్తైన 4 రోజుల తర్వాత హోం ఓటింగ్ ప్రారంభం అవుతుందని చెప్పారు.
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ మూవీలో బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రీ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ అతిథి పాత్రలో ఆమె కనిపించనున్నట్లు సమాచారం. పుష్పరాజ్ అనుచరుడిని ట్రాప్ చేయించి చంపించే పాత్రలో త్రిప్తి నటిస్తున్నట్లు టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆగస్టు 15న ఈ మూవీ రిలీజ్ కానుంది.
Sorry, no posts matched your criteria.