India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర కొనసాగుతోంది. తాజాగా ‘అనంతపురం జిల్లా సిద్ధమా..?’ అంటూ జగన్ వైసీపీ శ్రేణులను ఉత్సాహపరిచారు. నిన్న కర్నూలు జిల్లా కోడుమూరు, ఎమ్మిగనూరు, వేముగోడు, ఆదోని మీదుగా 108 కి.మీ. యాత్ర చేపట్టారు. నేడు పత్తికొండ, గుంతకల్, శింగనమల, ధర్మవరం నియోజకవర్గాల్లో రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
TG: RMPలు అర్హత లేకుండా వైద్యం చేయొద్దని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్-2010 ప్రకారం పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోకూడదని ఆదేశించింది. రోగ నిర్ధారణ చేసి మందులివ్వడం, ఇంజెక్షన్లు వేయడం, సెలైన్ ఎక్కించడం, అబార్షన్లు, కాన్పులు చేయడం, ప్రిస్క్రిప్షన్ రాయడం వంటివి చేయకూడదని తెలిపింది. సూచిక బోర్డులపై ప్రథమ చికిత్స కేంద్రం అని పెట్టుకోవాలని సూచించింది.
IPL-2024లో భాగంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచులో కోహ్లీ పలు రికార్డులు నెలకొల్పారు. IPLలో RCB తరఫున అత్యధిక సిక్సులు (241) బాదిన బ్యాటర్‌గా నిలిచారు. ఇప్పటివరకు ఈ రికార్డు గేల్(239) పేరిట ఉండేది. అలాగే టోర్నీ చరిత్రలో ఓవరాల్‌గా అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్ల లిస్టులో ధోనీని(239) అధిగమించి 4వ స్థానానికి చేరుకున్నారు. ఈ జాబితాలో గేల్(357), రోహిత్ (261), ABD(251) తొలి 3 స్థానాల్లో ఉన్నారు.
అరేబియా సముద్రంలో ఇండియన్ నేవీ మరో సాహసం చేసింది. సోమాలియా పైరేట్స్ హైజాక్ చేసిన ఏఐ కంబార్ నౌక నుంచి 23 మంది పాకిస్థానీ మత్స్యకారులను కాపాడింది. INS సుమేధ యుద్ధనౌక ద్వారా 12 గంటలపాటు రెస్క్యూ మిషన్ చేపట్టినట్లు నేవీ అధికారులు తెలిపారు. రక్షించిన బోటును, పాకిస్థానీలను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు పేర్కొన్నారు.
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న ఫ్రెంచ్ మూవీ ‘అనాటమీ ఆఫ్ ఎ ఫాల్’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మలయాళం, తమిళంలో అందుబాటులో ఉంది. భర్త మరణంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే భార్య కథే ఈ సినిమా. ఊహించని ట్విస్టులతో మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా అవార్డులు వచ్చాయి.
తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. శక్తిమంతమైన మహిళలు దేశ భవిష్యత్తును మారుస్తారని అన్నారు. ప్రస్తుతం ప్రతి 10 మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒకరు మాత్రమే స్త్రీలు ఉన్నారని చెప్పారు. రాహుల్ వ్యాఖ్యలపై మీ కామెంట్?
AP: విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో తిరుమలలో రద్దీ పెరిగింది. ఉచిత సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి భక్తులు బయట లైన్లలో వేచి ఉన్నారు. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటలు, టైమ్ స్లాట్ సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న 60,958 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. ‘విరాట్ కోహ్లీ ఎంతని ఆడతాడో మీరే చెప్పండి. ఎవరైనా అతనితో నిలబడాలి. KKRతో మ్యాచులో కూడా ఏ ఆటగాడైనా అతనికి మద్దతిస్తే అతను కచ్చితంగా 83కి బదులు 120 పరుగులు చేసి ఉండేవాడు. కాబట్టి ఇది టీమ్ అంతా కలిసి ఆడాల్సిన ఆట. ఈరోజు ఏ ఒక్క ప్లేయర్ అతనికి సపోర్ట్ చేయలేదు’ అని గవాస్కర్ అన్నారు.
శివభజన వింటూ శిశువు తల్లి గర్భం నుంచి బయటకొచ్చిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ‘ఈనెల 27న పురిటి నొప్పులతో ఉపాసన ఆస్పత్రికి వచ్చారు.అప్పటికే ఆమె పరిస్థితి విషమించింది. దీంతో ఆమె తన అత్త ప్రీతిని ఆపరేషన్ గదిలోకి అనుమతించాలని కోరారు. మేం ఒప్పుకోవడంతో లోపలికొచ్చిన ప్రీతి శివ భజనలు పాడారు. 20నిమిషాల్లో ఉపాసన మగబిడ్డకు జన్మనిచ్చారు. సానుకూల వాతావరణంలో ఆపరేషన్ సవ్యంగా జరిగింది’ అని వైద్యులు తెలిపారు.
స్నేహితులతో కలిసి సరదాగా చెరువులో ఈతకు వెళ్లిన బాలుడి గొంతులో చేప ఇరుక్కుపోయింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గీర్ చాంపా జిల్లాలో జరిగింది. దీంతో బాలుడు సమీర్ గోడ్(14) ఉక్కిరిబిక్కిరయ్యాడు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా, వైద్యులు సగం చేపను మాత్రమే బయటకు తీశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పెద్ద ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు మెడ దగ్గర ఆపరేషన్ చేసి చేపను బయటకు తీశారు.
Sorry, no posts matched your criteria.