India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ రాజకీయాలకు వీడ్కోలు పలికారు. విశాఖపట్నం జిల్లా పరవాడ మండలం వెన్నెల పాలెంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ ప్రకటన చేశారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదన్న ఆయన, రాజకీయంగా తనకు ఇదే చివరి సమావేశం అన్నారు. సాటి కార్యకర్తలకు అండగా నిలబడతానన్నారు.
TG: కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించిన బీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి మరికాసేపట్లో వెళ్లనున్నారు. ఆయనను లాంఛనంగా పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇదిలా ఉంటే కేకే కూతురు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మీ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు.
పంజాబ్‌తో మ్యాచ్‌లో లక్నో కెప్టెన్సీ బాధ్యతలు నికోలస్ పూరన్ నిర్వర్తిస్తున్నారు. అకస్మాత్తుగా కెప్టెన్సీ మార్పుపై అందరిలో సందేహలు నెలకొన్నాయి. అయితే ఈ విషయంలో పూరన్ క్లారిటీ ఇచ్చారు. ‘రాహుల్ గాయం నుంచి కోలుకొని దాదాపు రెండు నెలల తర్వాత క్రికెట్ ఆడుతున్నారు. ఆయనకు కొంచెం విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించాం. రాహుల్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా అందుబాటులో ఉంటారు’ అని పూరన్ వెల్లడించారు.
కర్ణాటక డిప్యూటీ CM డికె.శివకుమార్‌కు ITశాఖ నోటీసులు ఇచ్చింది. తనకు నిన్న రాత్రి ఇన్‌కం ట్యాక్స్ ఆఫీస్ నుంచి నోటీసులు వచ్చాయని ఆయన వెల్లడించారు. ‘కేంద్రంలోని BJP ప్రతిపక్షాలను ఎందుకు ఇలా వేధిస్తోంది? ఈ ఎన్నికల్లో తాము ఓడిపోతామనే భయంతో ఇవన్నీ చేస్తోంది. చివరికి కమ్యూనిస్టు పార్టీ నేతలను కూడా బీజేపీ టార్గెట్ చేసింది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు’ అని మండిపడ్డారు.
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తన స్నేహితుడని.. అందుకే ‘ఇనిమేల్’ పాటలో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ అన్నారు. ‘లోకేశ్ గొప్ప దర్శకుడే కాకుండా నటుడు కూడా. ఈ పాట చేయడానికి ఆయన అంగీకరించినప్పుడు ఎగిరి గంతేశా. కెమెరా ముందు ఆయన బాగా నటించారు. తొలుత ఈ పాటను ఇంగ్లిష్‌లో రాశాం. ఆ తర్వాత నాన్న (కమల్ హాసన్) సాయంతో తమిళంలో చేశాం’ అని ఆమె చెప్పారు.
TG: వేసవి నేపథ్యంలో విద్యుత్, తాగునీటి అవసరాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రిజర్వాయర్లలో సరిపడా నీరుందని, నిరంతర నీటి సరఫరాపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని, వృథాపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం సూచించారు.
పంజాబ్‌తో మ్యాచులో లక్నో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో నికోలస్ పూరన్ లక్నో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. రాహుల్‌కు రెస్ట్ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
PBKS: ధావన్, బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, కరన్, జితేష్, శశాంక్, బ్రార్, హర్షల్, రబడా, చాహర్, అర్ష్‌దీప్
LSG: డీకాక్, రాహుల్, పడిక్కల్, బదోనీ, పూరన్, స్టోయినిస్, కృనాల్, బిష్ణోయ్, మొహ్సిన్, మయాంక్ యాదవ్, మణిమారన్
AP: పెళ్లైన కొన్ని గంటల్లోనే ఓ నవ వధువు మృతిచెందారు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దబ్బగడ్డలో జరిగింది. నిన్న రాత్రి 10 గంటలకు ఓ యువకుడితో అఖిల (20) వివాహం జరిగింది. ఆ తర్వాత నీరసంగా ఉందంటూ నిద్రపోయారు. కాసేపటి తర్వాత కుటుంబసభ్యులు పిలిచినా స్పందించకపోవడంతో వెంటనే ఆమెను సాలూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మరణించినట్లు తెలిపారు.
వ్యాయామం శరీరానికి మేలు చేసినట్టే చదువు కూడా చేస్తుందట! మూడు తరాలకు చెందిన 3,101 మందిపై US, నార్వే, UKకు చెందిన నిపుణులు పరిశోధించి ఈ విషయం కనుగొన్నారు. విద్యపై ఎంత ఎక్కువ కాలం గడిపితే వృద్ధాప్యం అంత నెమ్మదిగా వస్తుందట. శరీరంలోని కణాలు డ్యామేజ్ కావడాన్ని తగ్గిస్తుందని, ఫలితంగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని తేలింది. ఇది కచ్చితంగా ఎలా జరుగుతోందనే విషయంపై పరిశోధన చేస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.
టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును BCCI ఏప్రిల్ చివరి వారంలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. WC కోసం తమ ఆటగాళ్లను ప్రకటించడానికి మే 1 వరకు ICC గడువిచ్చింది. దీంతో ఆలోపే జట్టును ప్రకటించేందుకు BCCI సిద్ధమైనట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. కాగా IPL స్టార్లపై సెలక్టర్లు దృష్టి పెట్టినట్లు టాక్. ఈ టోర్నీలో రాణించిన ఒకరిద్దరికి జట్టులో చోటు కల్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.