India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈరోజు విచారణ జరపనుంది. కవితకు కోర్టు విధించిన కస్టడీ సైతం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక సీబీఐ కోర్టులో ఆమెను ఈడీ హాజరుపరచనుంది. కస్టడీని మరో 4రోజులపాటు పొడిగించాలని ఈడీ కోరే అవకాశం ఉంది.
AP: నారా లోకేశ్ రెడ్‌బుక్‌పై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన రెడ్‌బుక్ దేనికో అర్థం కావడం లేదు. ప్రజలకు ఏం చేస్తామో చెప్పకుండా ఈ బుక్ ఏంటి? ముందు ఆయన మంగళగిరిలో గెలవాలి కదా?’ అని ఎద్దేవా చేశారు. కాగా తమ పార్టీ కేడర్‌ను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలు, పోలీసులు, చట్టాన్ని ఉల్లంఘించిన వారి పేర్లను ఈ బుక్‌లో రాస్తున్నట్లు లోకేశ్ గతంలో వెల్లడించారు.
రంజాన్ నెల సందర్భంగా ఇజ్రాయెల్ వెంటనే గాజాపై కాల్పుల్ని ఆపాలని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి డిమాండ్ చేసింది. ఇజ్రాయెల్ బందీలందర్నీ విడిచిపెట్టాలని హమాస్‌కు తేల్చిచెప్పింది. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత UNSC స్పందించడం ఇదే ప్రథమం. మండలిలో 15 సభ్యదేశాల్లో అమెరికా తప్ప మిగిలిన అన్ని దేశాలూ తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. వీటో అధికారంతో తీర్మానాన్ని అడ్డుకునే ఛాన్స్ ఉన్నా అమెరికా దూరం పాటించింది.
ఇప్పుడు మంచి స్థాయికి చేరుకున్నప్పటికీ జీవితంలో అడ్జస్ట్ అవుతూనే ఉంటానని విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నా స్కూల్ డేస్‌లో నాన్నను సైకిల్ అడిగాను. బర్త్ డేకి కొంటానని, సెలవుల్లో కొంటానని సాగదీసి ఎప్పటికో కొన్నారు. వీడియో గేమ్, కంప్యూటర్, టీవీ.. ఇలా అన్నింటిలోనూ చిన్నప్పుడు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సర్దుకుపోతుంటాం. అడ్జస్ట్‌మెంట్ అనేది తప్పదు. అది జీవితంలో ఓ పాఠం’ అని పేర్కొన్నారు.
న్యూయార్క్‌కు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్లు అంజలి చక్ర (IND), సూఫీ మాలిక్ (PAK) అనే మహిళలు ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా వీరిద్దరు విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘మరికొన్ని రోజుల్లో పెళ్లి జరుగుతుందనగా అంజలిని మోసం చేశా. ఆమెను విపరీతంగా బాధపెట్టా. నేను నా తప్పిదానికి కట్టుబడి ఉన్నా. ఆమెను క్షమాపణలు కోరుతున్నా’ అని మాలిక్ ఓ ప్రకటనలో పేర్కొంది.
పంజాబ్ కింగ్స్‌పై 49 బంతుల్లో 77 రన్స్ చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు విరాట్ కోహ్లీ. వచ్చే టీ20 వరల్డ్ కప్‌లో తాను కచ్చితంగా ఆడాలనుకుంటున్న విషయాన్ని ఆయన మ్యాచ్ అనంతరం పరోక్షంగా వెల్లడించారు. ‘ఆటను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవాలి. నా పేరును ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను ప్రమోట్ చేసేందుకు మాత్రమే వాడుతున్నారని తెలుసు. కానీ టీ20 క్రికెట్ ఆట నాలో ఇంకా మిగిలే ఉందనుకుంటున్నా’ అని అన్నారు.
రాబోయే ఎన్నికల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కుమార్తె ఇతిశ్రీ ముర్ము పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒడిశాలోని మయూర్‌భంజ్ లోక్‌సభ స్థానం నుంచి ఆమెను బరిలో దింపాలని బీజేపీ భావిస్తోందట. గిరిజనులు అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో ఇతిశ్రీని పోటీకి నిలబెడితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పరపతి కలిసివస్తుందని భావిస్తోందట. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే బీజేపీ అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.
AP: వైఎస్ జగన్, షర్మిల మధ్య రాజకీయంగానే కాక వ్యక్తిగతంగానూ విభేదాలున్నాయంటూ వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. వైసీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో వాటిని ఖండించారు. ‘రాజకీయ లక్ష్యాలే తప్ప వైఎస్ కుటుంబంలో ఏ గొడవలూ లేవు. షర్మిల పట్ల అన్నగా జగన్ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. షర్మిలే రాజకీయంగా తప్పటడుగు వేశారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఆమె ప్రభావం ఏమాత్రం ఉండదు’ అని ఆయన స్పష్టం చేశారు.
గుజరాత్‌తో మ్యాచులో హార్దిక్ కెప్టెన్సీపై షమీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ధోనీలా 7వ ప్లేస్‌లో వచ్చి మ్యాచును ముగించడం అందరికీ సాధ్యంకాదు. ధోనీ ఎప్పటికీ ధోనీనే. అతడిలా ఎవరూ సరితూగరు. గతంలో హార్దిక్ 4,5 లేదా 5వ స్థానంలో బ్యాటింగ్ చేశారు. కానీ MI తరఫున 7వ ప్లేస్‌లో వచ్చారు. అలా వస్తే తనపై తానే ఒత్తిడి పెంచుకున్నట్లవుతుంది. పాండ్య ముందుగా వచ్చి ఉంటే మ్యాచ్ అంతవరకు వచ్చేది కాదు’ అని షమీ చురకలు అంటించారు.
రామ్ చరణ్-సుకుమార్ కాంబోలో మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా విడుదలకు ముందే బ్లాక్‌బస్టర్ అని రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ పేర్కొన్నారు. ‘RRR క్లైమాక్స్ షూటింగ్ అప్పుడు చరణ్ నాకు సుకుమార్‌గారి సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్ గురించి చెప్పారు. వినగానే నా మైండ్ పోయింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తారా అని చూస్తున్నా’ అని ట్విటర్‌లో తెలిపారు.
Sorry, no posts matched your criteria.