India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: కౌలు రైతులకు తప్పనిసరిగా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. పంట నష్టపోయిన కౌలు రైతులకు ఇటీవల పరిహారం ఇచ్చామని, కౌలు రైతులకు నేరుగా పరిహారం ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పారు. ప్రాంతీయ సదస్సుల ద్వారా అభిప్రాయాలు తీసుకొని కౌలు చట్టం రూపకల్పన చేస్తామని, అందరికీ ఆమోదయోగ్యమైన కౌలు చట్టం అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయంపై తెలంగాణ ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. DEC 7, 2023 తర్వాత బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఒమన్, ఖతర్, సౌదీ, UAEల్లో ఎలాంటి కారణంతోనైనా చనిపోతే రూ.5 లక్షల పరిహారం ఇవ్వనుంది. చనిపోయిన 6 నెలల్లోపు డెత్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్, వర్క్ వీసా, ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్, బ్యాంక్ వివరాలతో కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. అభ్యర్థుల ఎంపికపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన సోమవారం కీలక నేతల సమావేశం జరిగింది. 28 గిరిజన స్థానాల్లో మిత్రపక్షాలు కాకుండా సొంతంగా బరిలోకి దిగాలని యోచిస్తోంది. మాజీ సీఎం చంపై సోరెన్ ద్వారా ఆ వర్గాలు BJPకి చేరువయ్యేలా వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. మిత్రపక్షాలు AJSUకు 9, JDUకు 2 స్థానాలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

ఉద్యోగం కోసం 1976లో దరఖాస్తు చేసిన లేఖ 48 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన ఘటన UKలోని లింకన్‌షైర్‌లో జరిగింది. టిజీ హాడ్సన్ అనే 70 ఏళ్ల మహిళకు బైక్ స్టంట్ రైడర్ కావాలనే కల ఉండేది. దీంతో ఉద్యోగం కోసం ఆమె దరఖాస్తు చేసి ఆ లేఖను పోస్ట్ చేయగా అది పోస్టాఫీసులోని కబోర్డులో ఇరుక్కుపోయింది. తాజాగా ఆ లేఖను గుర్తించిన అధికారులు తిరిగి పంపారు. అయితే, అడ్రస్ మార్చినా లెటర్ ఎలా వచ్చిందో తెలియట్లేదని ఆమె తెలిపారు.

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీకి గాయాలయ్యాయి. హైదరాబాద్‌లో ‘గూఢచారి-2’ సెట్స్‌లో యాక్షన్ సీన్ చేస్తుండగా గాయమైంది. ఒక చోటు నుంచి మరో చోటుకు దూకుతుండగా మెడకు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. మెడ స్వల్పంగా కట్ అయి రక్తం కారుతున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ‘OG’ తర్వాత ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న రెండో తెలుగు సినిమా ‘గూఢచారి-2’నే. ఇందులో అడివి శేష్ హీరోగా నటిస్తున్నారు.

నవంబర్ 1 నుంచి జరిగే హాంగ్ కాంగ్ క్రికెట్ సిక్సెస్ టోర్నీ-2024లో భారత జట్టు పాల్గొనబోతోంది. ఈ టోర్నీకి ఇది 20వ ఎడిషన్ కాగా, గతంలో సచిన్, ధోనీ వంటి ప్లేయర్లు కూడా ఇందులో ఆడారు. ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొంటాయి. ఇన్నింగ్స్‌కు 5 ఓవర్లు, టీమ్‌కు ఆరుగురు సభ్యులుంటారు. 3 రోజులపాటు జరిగే ఈ టోర్నీలో పాకిస్థాన్ కూడా పాల్గొంటోంది. మన టీమ్ నుంచి ఎవరెవరు ఆడితే బాగుంటుందో కామెంట్ చేయండి.

TG: హైదరాబాద్ నగరంలో చెరువుల ఆక్రమణలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఆక్రమణలు ఎక్కడ జరిగినా క్షణాల్లో హైడ్రాకు తెలిసేలా పటిష్ఠ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. చెరువుల FTL, బఫర్ జోన్లను గుర్తించేందుకు రిమోట్ సెన్సింగ్ సెంటర్, సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో రంగనాథ్ సమీక్ష నిర్వహించారు.

TG: బీసీ, ఈబీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రూ.1,502 కోట్లు రిలీజ్ చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

‘దేవర-2’ సినిమా షూటింగ్ 2025, అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు తెలిపాయి. పార్ట్-1కి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పార్ట్-2కి పనిచేయకపోవచ్చని సమాచారం. దీనిపై మూవీ టీమ్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. గత నెల 27న థియేటర్లలో విడుదలైన ‘దేవర’ ఇప్పటివరకు రూ.460కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. పార్ట్-1లో చాలా విషయాలను డైరెక్టర్ సస్పెన్స్‌లో పెట్టారు. దీంతో పార్ట్-2పై ఆసక్తి నెలకొంది.

దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో 10 మంది మృతి చెందారు. బారాషీట్‌లోని అగ్నిమాపక కేంద్రం లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేసినట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. దాడి సమయంలో స్థానికంగా రెస్క్యూ మిషన్‌కు వెళ్లడానికి సిద్ధమవుతున్న 10 మంది పౌర రక్షణ సభ్యులు మరణించినట్టు వెల్లడించింది. సెప్టెంబర్ చివర్లో ప్రారంభించిన ఇజ్రాయెల్ వరుస దాడుల్లో 1,400 మంది హెజ్బొల్లా సభ్యులు, పౌరులు మృతి చెందారు.
Sorry, no posts matched your criteria.