News November 16, 2024

T20 సిరీస్ ఆసీస్ కైవసం

image

పాకిస్థాన్‌తో జరుగుతున్న 3 టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. రెండో టీ20లో ఆసీస్ 13 రన్స్ తేడాతో నెగ్గింది. ఆస్ట్రేలియా తొలుత 20 ఓవర్లలో 147/9 పరుగులు చేసింది. ఛేదనలో పాక్ 19.4 ఓవర్లు ఆడి 134 పరుగులకే ఆలౌటైంది. ఉస్మాన్ ఖాన్ (52) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. స్పెన్సర్ జాన్సన్ 5 వికెట్లతో చెలరేగారు. నామమాత్రపు చివరి టీ20 ఎల్లుండి హోబర్ట్‌లో జరుగుతుంది.

News November 16, 2024

మహిళల అక్రమ రవాణా పచ్చి అబద్ధం: రోజా

image

AP: రాష్ట్రంలో YCP హయాంలో వాలంటీర్ల ద్వారా 30 వేల మంది మహిళల అక్రమ రవాణా జరిగిందని TDP, JSP చేసిన ఆరోపణలు తప్పని తేలాయని మాజీ మంత్రి రోజా అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఇది బట్టబయలైందని ఆమె చెప్పారు. ‘గత ఐదేళ్లలో మహిళల అక్రమ రవాణా కేసులు 34 నమోదయ్యాయని స్వయంగా హోంమంత్రే అసెంబ్లీలో ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అధికారం కోసం ఎంతటి అబద్ధాలైనా చెప్తారా? అంటూ ఆమె ఫైర్ అయ్యారు.

News November 16, 2024

చంద్రబాబు తమ్ముడి చివరి PHOTO

image

AP CM చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు చివరి ఫొటో బయటకొచ్చింది. HYD AIG ఆస్పత్రిలో గుండె సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మ.12.45 గంటలకు <<14625616>>తుదిశ్వాస <<>>విడిచారు. రేపు ఉ.5 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన పార్థివదేహాన్ని రేణిగుంట ఎయిర్‌పోర్టుకు తరలించనున్నారు. అక్కడి నుంచి నారావారిపల్లెకు తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆయన మృతిపట్ల టీడీపీ శ్రేణులు, నేతలు సంతాపం తెలియజేస్తున్నారు.

News November 16, 2024

రామ్మూర్తి మరణం కలచివేసింది: పవన్

image

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి మరణ వార్త నన్ను కలచివేసింది. సోదర వియోగంతో బాధపడుతున్న చంద్రబాబు నాయుడుకి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో ఉన్నందున రామ్మూర్తి అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నా. నారా రోహిత్, ఆయన కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు.

News November 16, 2024

ఏ రాష్ట్రంలోనూ ఏడాదిలో 50వేల ఉద్యోగాలివ్వలేదు: రేవంత్

image

తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏడాదిలో 50వేల ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. మహారాష్ట్రలో ప్రజా తీర్పును షిండే, అజిత్ పవార్ కాలరాశారని మండిపడ్డారు. చంద్రాపూర్‌లో మహావికాస్ అఘాడీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు.

News November 16, 2024

‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ రిలీజ్ ఎప్పుడంటే?

image

విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ మూవీకి సీక్వెల్ రానున్నట్లు ఇటీవల హీరో విశ్వక్ ఓ హింట్ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘ENE-2’ 2026లో రిలీజ్ అవుతుందని ఆయన చెప్పినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ సినిమాలో అదే టీమ్ కొనసాగుతుందా లేదా కొత్త టీమ్‌ను తీసుకుంటారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

News November 16, 2024

శిరోమ‌ణి అకాలీదళ్ చీఫ్ రాజీనామా

image

పంజాబ్ ప్రాంతీయ పార్టీ శిరోమ‌ణి అకాలీదళ్ అధ్య‌క్ష పదవికి సుఖ్‌బీర్ సింగ్ బాద‌ల్ రాజీనామా చేశారు. పార్టీలో ఐదేళ్ల‌కోసారి అధ్య‌క్ష ఎన్నిక‌ జ‌రుగుతుంది. 2019లో ఆయ‌న అధ్య‌క్షుడిగా ఎన్నికై ఐదేళ్లు పూర్తి చేసుకున్నారు. త్వ‌ర‌లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామ‌ని పార్టీ నేత ద‌ల్జీత్ చీమా తెలిపారు. 2007-17 మధ్య ప్ర‌భుత్వంలో ఉండ‌గా బాద‌ల్ మ‌తాచారాల ఉల్లంఘనకు పాల్ప‌డ్డార‌ని ఆయ‌న‌పై విమ‌ర్శ‌లున్నాయి.

News November 16, 2024

‘పుష్ప-2’ నుంచి ఊర మాస్ పోస్టర్

image

సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. రేపు ఈ చిత్ర ట్రైలర్ బిహార్‌లోని పట్నాలో రిలీజ్ కానుండగా అల్లు అర్జున్ దీనికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. రేపు సాయంత్రం 6.03 గంటలకు ట్రైలర్ యూట్యూబ్‌లో అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 5న రిలీజ్ కానుంది.

News November 16, 2024

తమ్ముడి మృతిపై చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్

image

AP: తన సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందడంపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘నా తమ్ముడు, చంద్రగిరి మాజీ MLA రామ్మూర్తి నాయుడు మనల్ని విడిచి వెళ్లిపోయాడని బాధాతప్త హృదయంతో తెలియచేస్తున్నా. రామ్మూర్తి ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవలు అందించారు. మా నుంచి దూరమై మా సోదరుడు మా కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’ అని Xలో ట్వీట్ చేశారు.

News November 16, 2024

ఈ దేశాల నుంచి జాబ్ ఆఫర్ వ‌స్తే జాగ్ర‌త్త‌!

image

Southeast Asia నుంచి, ముఖ్యంగా కంబోడియా, థాయ్‌లాండ్‌, మ‌య‌న్మార్ నుంచి జాబ్ ఆఫర్ వస్తే జాగ్ర‌త్త‌పడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఎందుకంటే 2022 నుంచి ఈ దేశాల‌కు వెళ్లిన వారిలో 30 వేల మంది భార‌తీయుల ఆచూకీ లభించకపోవడం క‌ల‌క‌లం రేపుతోంది. ఉద్యోగాల పేరుతో ర‌ప్పించి వీరితో బ‌ల‌వంతంగా సైబ‌ర్ క్రైమ్స్ చేయిస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీనిపై విచార‌ణ‌కు భార‌త ప్ర‌భుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నియ‌మించింది.